జగన్ కు తలనొప్పిగా మారారే?
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల వ్యవహార శైలిపై అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరూ జగన్‌కు సన్నిహితులుగా ముద్ర వేయించుకున్నారు. ఒకరు పార్టీలో ఆది నుంచి [more]
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల వ్యవహార శైలిపై అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరూ జగన్‌కు సన్నిహితులుగా ముద్ర వేయించుకున్నారు. ఒకరు పార్టీలో ఆది నుంచి [more]
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల వ్యవహార శైలిపై అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరూ జగన్‌కు సన్నిహితులుగా ముద్ర వేయించుకున్నారు. ఒకరు పార్టీలో ఆది నుంచి ఉంటూ.. యువ నాయకు డిగా.. జగన్‌కు అత్యంత దగ్గర అనుచరుడిగా కూడా గుర్తింపు పొందారు. ఆయనే నెల్లూరు జిల్లాకు చెందిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. ఈయన ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. జగన్ వ్యూహాలను తూ.చ. తప్పకుండా అమలు చేయడంలోను, ఆయన వాయిస్‌ను బలంగా వినిపించడంలోనూ అనిల్ దూకుడుగానే ఉంటున్నారు.
జగన్ ఒకటంటే….
అదే సమయంలో ప్రతిపక్షంపై విరుచుకుపడడంలోను, కౌంటర్లు ఇవ్వడంలోనూ అనిల్‌ది అందెవేసిన చెయ్యి అనే రేంజ్‌లో ఇటీవల అసెంబ్లీలో టీడీపీపై విరుచుకుపడ్డారు. అయితే, తాజాగా ఆయన చేసిన ఓ వ్యాఖ్య.,. ఇదేంట్రా.. జగన్ అలా చెబుతుంటే.. మంత్రి గారేంటి ఇలా చెబుతున్నారు? అని వైసీపీ నేతలే చర్చించుకున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని కనీసం 30 ఏళ్ల పాటు తన వద్దే ఉంచుకోవాలని జగన్ ఆశపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన అనేక సభల్లోనూ చెప్పారు. అయితే, తాజాగా అనిల్ మాత్రం మేం 20 ఏళ్లు అధికారంలో ఉంటాం.. అంటూ కృష్ణాజిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పూజా కార్యక్రమంలో ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేశారు. ఇక శాఖా పరంగా కాకుండా ఆయన శాఖతో సంబంధం లేని విషయాల్లోనూ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన ప్రకటనలు చేయడం కూడా మిగిలిన మంత్రులకు, ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారింది.
అవంతి కూడా…
ఇక, మరో మంత్రి.. అవంతి శ్రీనివాస్. గతంలో టీడీపీలో ఉన్న ఆయన అనకాపల్లి ఎంపీగా చక్రం తిప్పారు. ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చి.. ఏకంగా భీమిలి టికెట్‌తోపాటు.. మంత్రి పదవిని కూడా కొట్టేశారు. అయితే, ఈయన కూడా ఇటీవల కాలంలో విపక్షంపై విరుచుకుపడుతున్నారు. నేరుగా మాజీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. జగన్ దృష్టిలో పడాలని తహతహలాడిన నాయకుల్లో ఈయన కూడా ఒకరు. ఇటీవల ఈయన కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. వైఎస్ ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో మంత్రి అవంతి పాల్గొన్నారు.
ఆటోల వెనక…?
ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లను ఉద్దేశించి చేసిన ప్రకటన ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. “సీఎం జగన్ ఫొటోలు.. మీ ఆటోలకు వెనకాల అంటించుకోండి.. పోలీసులు కానీ, ఆర్టీఏ డిపార్ట్‌మెంట్ కానీ మీకు కేసులు రాయదు, వేధింపులు కూడా ఉండవు.“ అని అవంతి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో రెచ్చిపోయాయి. ఇలా ఈ ఇద్దరు మంత్రులు కొంత దూకుడు ప్రదర్శిస్తుండడంతో ప్రభుత్వానికి తలనొప్పులు వస్తున్నాయని సీనియర్ మంత్రులు చెవులు కొరుక్కొంటున్నారు.