ఉపద్రవం రాకుండా కసరత్తులు షురూ

సంక్షోభం ఏది తలెత్తినా పాలు, నీటి కోసం కూడా కిలోమీటర్ల దూరం వెళ్ళలిసిందే. మహానగరాలకు వచ్చే పాలు కూరగాయలు అన్ని కుగ్రామాలనుంచి రవాణా జరగాలిసిందే. ఇక రవాణా [more]

Update: 2020-07-28 09:30 GMT

సంక్షోభం ఏది తలెత్తినా పాలు, నీటి కోసం కూడా కిలోమీటర్ల దూరం వెళ్ళలిసిందే. మహానగరాలకు వచ్చే పాలు కూరగాయలు అన్ని కుగ్రామాలనుంచి రవాణా జరగాలిసిందే. ఇక రవాణా బంద్ అయితే నిత్యావసరాల కోసం ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఏ వైపు చూసినా ఆకలి కేకలే వినిపించే పరిస్థితి ఎదురౌతుంది. ఇళ్ళ అద్దెలనుంచి అన్ని భారమై సామాన్యులు మరింత చితికిపోవడం కళ్లెదుటే కనిపిస్తుంది. ఇక అందరికి ఒకేసారి ఉపద్రవం వస్తే అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నా చేతిలో డబ్బున్నా కాపాడే వారే ఉండరు. విద్యా, వైద్యం కాస్మో కల్చర్ కి అలవాటు పడ్డాక కరోనా వంటి మహమ్మారి తరుముతుంటే సగటు నగర జీవి బిక్క చావలిసిందేనా .

మారుతున్న ప్రభుత్వాల ఆలోచనలు …

కరోనా కు ముందు తరువాత ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆలోచిస్తుంది ఇదే. ప్రభుత్వాల తీరులో సైతం గణనీయ మార్పులు మొదలైనట్లే స్పష్టం అవుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణే సర్వ రోగ నివారిణి అని అంతా అర్ధం చేసుకుంటున్నారు. విశ్వ నగరాలు ఎప్పటికైనా కొంప ముంచుతాయని వైరస్ వంటివి చుట్టు ముడితే బతికి బయట పడటం కష్టమనే సంకేతాలు ఇప్పటికే సర్కార్ లు తెలుసుకున్నాయి. ప్రజలు ఉన్న చోటికే ఉపాధి కల్పించగలిగే ఆలోచనలకు ఇప్పుడు నాంది పలుకుతున్నాయి తెలుగు రాష్ట్రాలు.

పట్టణాలవైపు గులాబీ చూపు…

చిన్న చిన్న పట్టణాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ లను ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ సర్కార్ ఆలోచన మొదలు పెట్టింది. తద్వారా హైదరాబాద్ మహానగరంపై గణనీయమైన వత్తిడి తగ్గించే అవకాశం ఉండటంతో బాటు సొంత ఊర్లలోనే యువత ఉపాధి పొంది ఆ పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయని భావిస్తుంది. దీనిపై ఇప్పటికే టి ఐటి మంత్రి కెటిఆర్ కసరత్తులు గట్టిగానే చేస్తున్నారు. పలు ఐటి కంపెనీలను వివిధ పట్టణాల్లో పెట్టాలనే ప్రణాళికలో ఆయన ఉన్నారు.

జగన్ సర్కార్ ది అదే రూట్ …

ఏపీ లో కరోనా రాకముందే జగన్ సర్కార్ శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక నే ప్రాతిపదికగా తీసుకుంది. అందుకే రాజధానిని సైతం వికేంద్రీకరించింది. రాయలసీమ, కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్ర లు మూడిటిని సమానంగా తీర్చిదిద్దేందుకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను సైతం ఏర్పాటు చేస్తుంది. ఏ జిల్లాకు ఆ జిల్లాను అభివృద్ధి పరచడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయికి ఒక జిల్లా ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తుంది. ఏ ప్రాంతంలో ఏ అవకాశాలు ఉన్నాయి ? ప్రజలు ఉపాధి కి వలస పోకుండా చేయాలిసిన పనులేమిటి అనేదానిపై ఫోకస్ పెంచింది ఎపి. అయితే ఇవన్నీ సాకారం కావాలంటే చాలా సమయం పట్టనుంది. అయితే లక్ష్యం మంచిదే అయినప్పుడు ఎప్పటికైనా అది పూర్తి చేసే సంకల్పంతో నేతలు వడివడిగా అడుగులు వేయాలిసి ఉంటుంది. తప్పులను రాజకీయ పక్షాలు ఎత్తి చూపాలి కానీ అధికారపక్షం ఏ నిర్ణయం తీసుకున్నా తప్పే అని రాజకీయాలు చేస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అనుకున్నంత వేగంగా సాగదంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News