పిచ్చ కామెడీగా ఉందటగా…!!

ఏపీలో బీజేపీ స‌భ్యత్వ న‌మోదు పిచ్చ కామెడీగా త‌యారైంది. 2024లో అధికారంలో వ‌స్తామ‌ని గొప్పలు చెప్పుకుంటున్న ఆపార్టీ నేత‌ల‌ను స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమం న‌వ్వుల పాలు చేస్తోంది. [more]

Update: 2019-08-01 03:30 GMT

ఏపీలో బీజేపీ స‌భ్యత్వ న‌మోదు పిచ్చ కామెడీగా త‌యారైంది. 2024లో అధికారంలో వ‌స్తామ‌ని గొప్పలు చెప్పుకుంటున్న ఆపార్టీ నేత‌ల‌ను స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమం న‌వ్వుల పాలు చేస్తోంది. ఎవ‌రో కొంద‌రు నేత‌లు మాత్రమే పార్టీలో చేరుతున్నార‌ని, ప్రజ‌లెవ‌రూ కొత్తగా బీజేపీలో చేరేందుకు ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని స‌భ్యత్వ న‌మోదు స్పష్టం చేస్తోంది. అత్యధిక సభ్యత్వాల‌ను నమోదు చేసి… ప్రజల్లో త‌మ‌పై ఉన్న ఆదరణను నిరూపిస్తామని అనుకున్న నేత‌లు కనీసం సగం సభ్యత్వాలను కూడా నమోదు చేయించలేకపోయారు. దీంతో క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ప్రజ‌ల్లో ఉ న్న ఆద‌ర‌ణ ఏపాటిదో తేట‌తెల్లమ‌వుతోంది.

ఉన్న సభ్యత్వాలు కూడా….

ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేత‌లు చేసిన సభ్యత్వ సంఖ్య లక్షన్నరలోపే. అసలు ఆ పార్టీ కార్యకర్తలు కూడా రెన్యూవల్ చేసుకోవడం లేదా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఏపీలో 35 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని బీజేపీ నేతలు చెప్పుకుంటుండ‌గా, ఈసారి 20 శాతం మందిని అధికంగా చేర్పించాలని హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం మాజీ మంత్రి మాణిక్యాలరావును ఇన్ చార్జిగా నియ‌మించింది. నేత‌లు ఎంత హ‌డావిడి చేసినా.. ఉన్న స‌భ్యత్వాలు కూడా చేజారిపోయే ప‌రిస్థితి ఏర్పడింది.

ఆ ఫలితమేనా…?

మొత్తంగా ఆ పార్టీ నేత‌లు చెబుతున్నట్లుగా 35 లక్షల నుంచి… నాలుగైదు లక్షలకు సభ్యత్వం దిగ‌జారిపోయే ప్రమాదం ఉంది. నేత‌ల చేరిక‌ల‌తో రాష్ట్రంలో బ‌లం పుంజుకుంటుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఇలాంటి ప‌రిస్థితి ఏర్పడటం ఏమిట‌న్నది హైక‌మాండ్ కు అంతుచిక్కడం లేదు. నిజానికి నేత‌ల మ‌ధ్య వర్గ పోరాటంతోనే ఏపీలో పార్టీ కుదేలవుతోంద‌ని బీజేపీ పెద్దలు అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు క‌న్నా.. కొత్తగా పార్టీలో చేరి న ఎంపీ సుజనా చౌదరి ఎవ‌రికి వారుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇది రెండు వర్గాలనూ అసంతృప్తికి గురి చేస్తోంది. దీని ఫ‌లిత‌మే సభ్యత్వ నమోదుపై కనిపిస్తోంద‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

లక్ష్యాన్ని చేరడం కష్టమే….

మొత్తం 150 నియోజకవర్గాల్లో కనీసం ఇప్పటి వ‌ర‌కు 1000ని మందిని కూడా కొత్తగా సభ్యులుగా చేర్చుకోలేకవ‌డం నేత‌ల మ‌ధ్య వ‌ర్గపోరును తెలుపుతోంది. ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు లేకపోయినా… కొంత మంది నేతలు వరుస పెట్టి ఆ పార్టీలో చేరిపోయారు. ఏపీకి చెందిన ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు.. కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. వారెవరూ… బీజేపీ సభ్యత్వాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేద‌ని తెలుస్తోంది. ఈ కార‌ణం చేత‌నే ఆర్బాటంగా ప్రారంభించిన స‌భ్యత్వ న‌మోదు అభాసుపాల‌వుతోంది. ఆగస్టు పదకొండో తేదీతో ముగించాల‌నుకు న్న కార్యక్రమంలో ల‌క్ష్యాన్ని చేరుకుంటారో… లేదో మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది.

Tags:    

Similar News