సైకిల్ కు సైడ్ స్టాండ్ వేశారట

చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ మంత్రి దివంగ‌త గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు వార‌సులు ఏం చేస్తున్నారు? త‌ండ్రి వార‌స‌త్వాన్ని పుణికి [more]

Update: 2019-10-29 00:30 GMT

చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ మంత్రి దివంగ‌త గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు వార‌సులు ఏం చేస్తున్నారు? త‌ండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని రాజ‌కీయాల్లో దూ సుకుపోవాల‌ని అనుకున్న కుమారులు ఇప్పుడు ఎటు చూస్తున్నారు? ఇదే చర్చ జిల్లాలో జరుగుతోంది. దీనికి కార‌ణం కూడా ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌డిచిన రెండు వారాలుగా కూడా పార్టీలో యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తానంటూ ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గాలి ముద్దు కృ ష్ణ కుమారులు ఇద్ద‌రూ కూడా యువ‌కులే కాబ‌ట్టి వారికి ఏవైనా ప‌ద‌వులు లభిస్తాయా? లేదా? అనే చ‌ర్చ సాగుతోంది.

కుటుంబంలో విభేదాలు….

గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతి చెంద‌డంతో ఆయ‌న అప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఈ కుటుంబానికి కేటా యించాల‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే, ప‌ద‌వి కోసం ఈ కుటుంబంలో త‌ల్లి ఇద్ద‌రు కుమారుల మ‌ధ్య చిచ్చు రేగింది. ఈ క్ర‌మంలోనే గాలి పెద్ద కుమారుడు గాలి భాను ప్ర‌కాశ్‌.. ఒక దారిలోను, త‌ల్లి, చిన్న కుమారుడు గాలి జ‌గ‌దీష్ ఒక దారిలోనూ న‌డిచారు. వాస్త‌వానికి ఈ ఇద్ద‌రు కుమారుల మ‌ధ్య గాలి జీవించి ఉన్న స‌మ‌యంలోనే స‌ఖ్య‌త లేక‌పోవ‌డం, రాజకీయంగా పైచేయి సాధించాల‌ని ఒక‌రికొక‌రు ప్ర‌య‌త్నించడం తెలిసిందే. అయితే, గాలి ముద్దుకృష్ణమ మృతి నేప‌థ్యంలో మాత్రం వ్యాపారాల వ్య‌వ‌హారాల‌కు చిన్న‌కుమారుడు జ‌గ‌దీష్ వార‌సుడు.

ఇద్దరూ రాజకీయాలపై….

రాజ‌కీయాల‌కు మాత్రం పెద్ద కుమారుడు గాలి భాను ప్ర‌కాశ్ వార‌సుడుగా గాలి ముద్దుకృష్ణమనాయుడు నిర్ణ‌యించుకున్నారు. కానీ, చిన్న కుమారుడు కూడా రాజ‌కీయాల‌పై క‌న్నేశారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్సీ వివాదం త‌లెత్తింది దీంతో చంద్ర‌బాబు మ‌ధ్యే మార్గంగా గాలి స‌ర‌స్వ‌తమ్మ‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన ఎన్ని క‌ల్లో న‌గ‌రి టికెట్‌ను భాను ప్ర‌కాశ్‌కు కేటాయించారు. అయితే, పార్టీ క్యాడర్ మొత్తం ఈ ప‌రిణామాన్ని జీర్ణించుకుని, స‌పోర్టు చేసినా.. కుటుంబంలో త‌ల్లి, చిన్న కుమారుడు మాత్రం భానుకు స‌హ‌క‌రించ‌లేద‌న్న‌ది వా స్తవం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.

ఒకరు వైసీపీలోకి….

ఇక‌, భాను టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. కానీ, జ‌గ‌దీష్ మాత్రం వైసీపీలోకి చేరుతున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఈయ‌నపై వైసీపీ నుంచి ఒత్తిళ్లు కూడా వ‌చ్చాయ‌ని అంటు న్నారు. ఈయ‌న మామ, క‌ర్ణాట‌క బీజేపీ నేత క‌ట్టా సుబ్ర‌హ్మ‌ణ్యం నాయుడు అండ‌దండ‌లు ఉన్నాయి. మ రోప‌క్క‌, త‌ల్లి ఎమ్మెల్సీ గా ఉన్నా.. జ‌గ‌దీషే చక్రం తిప్పుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌దీష్ ఎటైనా వెళ్లొచ్చ‌నే ప్ర‌చారం కూడా జ‌ర‌గుతోంది. ఏదేమైనా.. గాలి వార‌సుల రాజ‌కీయంలో పెద్ద కుమారుడు డైల‌మాలో ఉండ‌గా.. చిన్న‌కుమారుడు మాత్రం ఎటైనా వెళ్లేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News