కులం కార్డు తోనే కొట్టాలని … ?
వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ కి అదే రీతిలో జవాబు చెప్పాలని టిడిపి వ్యూహం రూపొందించినట్లు కనిపిస్తుంది. పార్టీలో ఎవరు అరెస్ట్ అయినా, ఎవరికి సమస్య వచ్చినా [more]
వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ కి అదే రీతిలో జవాబు చెప్పాలని టిడిపి వ్యూహం రూపొందించినట్లు కనిపిస్తుంది. పార్టీలో ఎవరు అరెస్ట్ అయినా, ఎవరికి సమస్య వచ్చినా [more]
వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ కి అదే రీతిలో జవాబు చెప్పాలని టిడిపి వ్యూహం రూపొందించినట్లు కనిపిస్తుంది. పార్టీలో ఎవరు అరెస్ట్ అయినా, ఎవరికి సమస్య వచ్చినా ఆ కులాన్ని వైసిపి తొక్కేస్తుంది అనేది గట్టిగా ప్రచారం చేయడమే దీనిలో భాగమంటున్నారు విశ్లేషకులు. ముందుగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలు ఆ తరువాత బిసి సామాజిక వర్గాలకు చెందిన నేతలను టచ్ చేస్తే కులం కార్డు ను ప్రధాన విపక్షం బయటకు తీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఇప్పుడు ట్రెండ్ మార్చి కమ్మ కులంపై మరింత విషాన్ని జగన్ సర్కార్ కక్కుతుందనే అంశంపై రమేష్ ఆసుపత్రి వ్యవహారంలో బయటకు తెచ్చింది టిడిపి. ఇలా వివిధ కులాల నేతలను ఎవరిని కేసుల్లో అరెస్ట్ చేస్తున్నా ఆయా కులాలను అణగదొక్కేస్తున్నారనే అంశం ప్రజల్లోకి తన మీడియా ద్వారా బయటపెట్టేందుకు కార్యాచరణ గట్టిగానే తీసుకుందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
బిజెపి పైనా అదే ప్రయోగిస్తున్న తమ్ముళ్ళు …
ఇందులో భాగంగా ఇదే మైండ్ గేమ్ ను బిజెపి నేతలపైనా ప్రయోగిస్తే సరిపోతుందనే జివిఎల్ నరసింహారావు బ్రదర్ అనిల్ కుమార్ బంధువులంటూ సోషల్ మీడియా లో ప్రచారం పెద్దఎత్తునే చేయడానికి రీజన్ అంటున్నారు. అయితే దీనిపై బిజెపి ఎదురుదాడి వెంటనే మొదలు పెట్టి చంద్రబాబు అండ్ ఆ పార్టీ మీడియా ను అన్ని వేదికలపై ఉతికి ఆరేసే స్కీం గట్టిగా మొదలు పెట్టడం విశేషం. సోషల్ ఇంజనీరింగ్ లో ఆరితేరిన వైసీపీ చీఫ్ జగన్ కులాల వారీగా కార్పొరేషన్ లు నిధుల పంపిణీలు, సంక్షేమ కార్యక్రమాలతో సైలెంట్ గా పార్టీ ఓటు బ్యాంక్ ను పటిష్టం చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా టిడిపి కి ఇంతకాలం వెన్నెముక గా ఉంటూ వచ్చిన బిసి కులాలు నెమ్మదిగా వైసిపి ఓటు బ్యాంక్ గా పరివర్తనం చెందడం మొదలైందని తేలిపోయింది.
దెబ్బకొట్టిన బిసి ఓటు బ్యాంక్ …
గత ఎన్నికల్లో కూడా బిసి లు పెద్ద శాతంలోనే వైసీపీ వైపు టర్న్ కావడంతో టిడిపి 23 సీట్లకే పరిమితం అయిందన్నది ఇప్పుడు ఆ పార్టీ గుర్తిస్తుంది. దీనికి ఇప్పటినుంచి కులాల వారీగా వైసిపి పై యుద్ధం మొదలు పెట్టకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదాన్ని గుర్తించే దాడి తీవ్రం చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనిని సమర్ధంగా తిప్పికొట్టడానికి వైసీపీ ఆయా కులాలకు సంబంధించిన నేతలనే మీడియా స్క్రీన్ పైకి తీసుకువచ్చి కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. దాంతో ఈ ఇద్దరి గేమ్ లో ఎవరు సక్సెస్ అవుతారాన్నది కాలమే సమాధానం చెప్పాలి.