సుజనా దెబ్బ.. ఎలా ఉంటుంది..?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? చెప్పడం కష్టం. నాయకులు తమ అవసరాలే ప్రధానంగా పార్టీలకు మంగళం పాడుతున్నారు. మరికొన్ని పార్టీలకు హారతులు పడుతున్నారు.ఈ క్రమంలోనే ఏపీలో [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? చెప్పడం కష్టం. నాయకులు తమ అవసరాలే ప్రధానంగా పార్టీలకు మంగళం పాడుతున్నారు. మరికొన్ని పార్టీలకు హారతులు పడుతున్నారు.ఈ క్రమంలోనే ఏపీలో [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? చెప్పడం కష్టం. నాయకులు తమ అవసరాలే ప్రధానంగా పార్టీలకు మంగళం పాడుతున్నారు. మరికొన్ని పార్టీలకు హారతులు పడుతున్నారు.ఈ క్రమంలోనే ఏపీలో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి బై చెప్పారు. ఆ వెంటనే నేరుగా వెళ్లి బీజేపీలో చేరిపోయారు. ఈ నలుగురు ఎంపీలే కాదు.. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో పాటు తాజా ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు కూడా కాషాయం గూటికి చేరే ఏర్పాట్లలో ఉన్నారు. ఈ పరిణామంతో ఇప్పటికే కుదేలైన టీడీపీ నాయకులకు మరో గట్టి షాక్ తగిలేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. సుజనా చౌదరి ఎఫెక్ట్ తో తెలుగుదేశం పార్టీ విలవిల లాడుతోంది.
పట్టును పెంచుకునేందుకు….
విషయంలోకి వెళ్తే.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి.. తన పట్టును పెంచుకునేందుకు, బీజేపీలో తనకంటూ స్థానం పదిలం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో తనకు మిత్రులుగా, శిష్యులుగా ఉన్న నాయకులకు గేలం వేస్తున్నారు. ఇంకా టీడీపీలోనే ఉండి మీరు చేసేదేంటి? అక్కడ పార్టీ మట్టికరిచిపోయింది. ఇప్పట్లో కోలుకోవడం, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం అనేది కూడా కష్టమే. సో.. మీరంతా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం మంచిది- అని సుజనా చౌదరి తన వర్గానికి హితవు పలుకుతున్నారు.
గుంటూరు టీడీపీ నేతలను….
ఈ క్రమంలోనే సుజనా చౌదరి శిష్యుడు, బాపట్ల నుంచి తాజా ఎన్నికల్లో పోటీ ఓడిపోయిన టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్.. టీడీపీ నుంచి జంప్ చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఈయన ఒక్కడితోనే సుజనా చౌదరి సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. గుంటూరులోని టీడీపీ కీలక నేతలను ఆయన దారిలో పెడుతున్నారు. వీరిలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వంటివారినే లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు.. పంచాయతీ పదవుల్లో ఉన్న నాయకులు టీడీపీని వీడారు.
తొలిసారి వస్తుండటంతో….
ఇక, తాజాగా సుజనా చౌదరి బీజేపీలోకి చేరిన తర్వాత తొలిసారి గుంటూరుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఆయన స్వాగతం చెప్పేందుకు ఆయన అనుచరులు రెడీ అయ్యారు. పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సుజనా చౌదరి వెంట ఎక్కువ మందే బీజేపీలోకి చేరేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. సుజనాచౌదరిని ఎవరెవరె కలిసే అవకాశముందన్న దానిపై తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠ నెలకొంది. మరి ఈ పరిణామం టీడీపీకి పెను దెబ్బేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.