సుజనా రచ్చకి ఫుల్ స్టాప్ పడుతుందా?
చంద్రబాబుకి కుడి భుజంగా ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఆయన ఆశీస్సులతోనే బిజెపి లో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం నడుస్తున్న ఎంపి సుజనా చౌదరి ఒంటరి అవనున్నారా ..? [more]
చంద్రబాబుకి కుడి భుజంగా ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఆయన ఆశీస్సులతోనే బిజెపి లో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం నడుస్తున్న ఎంపి సుజనా చౌదరి ఒంటరి అవనున్నారా ..? [more]
చంద్రబాబుకి కుడి భుజంగా ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఆయన ఆశీస్సులతోనే బిజెపి లో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం నడుస్తున్న ఎంపి సుజనా చౌదరి ఒంటరి అవనున్నారా ..? అవుననే బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఎపి రాజధాని మారుస్తారని వైసిపి సర్కార్ నేతలు ప్రకటనలు చేసిన వెంటనే సుజనా చౌదరి బిజెపి తరుపున రంగంలోకి దిగి రచ్చ మొదలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం దీనికి అంగీకరించేది లేదంటూ పార్టీ స్టాండ్ కాకుండా సొంత స్టాండ్ తీసుకుని ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీనికి కౌంటర్ గా వైసిపి ఎదురుదాడి మొదలు పెట్టేసింది. సుజనా చౌదరికి అమరావతిలో వందల ఎకరాలు ఉన్నందునే ఈ ఉలికిపాటు అంటూ ఆరోపించడం మరో వివాదానికి దారితీసింది. ఆ తరువాత సుజనా చౌదరి నెమ్మదిగా వెనక్కి తగ్గారు. అయితే తాజాగా ఎపి సర్కార్ మూడు రాజధానులు ఖాయం అనే స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం తో మళ్ళీ సీన్ లోకి సుజనా చౌదరి దిగక తప్పలేదు.
పార్టీ ఒకలా సుజనా మరోలా ….
ఇప్పుడు కూడా సుజనా చౌదరి వ్యాఖ్యలకు ఎపి బిజెపి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లేకుండా పోయింది. కన్నా లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కన్నా గుంటూరు కి చెందిన నేతగానే స్థానిక పరిస్థితుల రీత్యా మాట్లాడాలిసి వస్తుంది. అయితే అదే పార్టీకి చెందిన వారు మాత్రం వైసిపి నిర్ణయన్ని సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు, గత ప్రభుత్వంలో కమలం శాసనసభా పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు, ప్రస్తుత బిజెపి ఎంపి టిజి వెంకటేష్ వైసిపి అధినేత జగన్ ఆలోచన కు జై కొట్టేశారు. అదీగాక రాయలసీమ లో హై కోర్టు విశాఖలో కార్యనిర్వాహక రాజధాని తమ పార్టీ ఆలోచనే కాదు తమ ఎన్నికల మ్యానిఫెస్టో లో పెట్టాం అంటూ సొంతపార్టీలోని సుజనా చౌదరి వంటివారు గట్టిగా మాట్లాడలేని పరిస్థితి కల్పించింది.
గతంలో జోక్యం చేసుకున్న సునీల్ దేవధర్ …
గతంలో రాజధాని మార్పుపై చర్చ నడిచినప్పుడు తమ పార్టీ నేతలు తలో మాట మాట్లాడటంపై ఎపి కమలం ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ జ్యోక్యం చేసుకోవాలిసి వచ్చింది. అయిన అందరిని పిలిచి క్లాస్ పీకి పార్టీ స్టాండ్ ఒక్కటే వుండాలని స్పష్టం చేశారు. నేతలు గీత దాటి వెళ్ళొద్దని చెప్పక చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో సునీల్ దేవధర్ మరోసారి సీన్ లోకి వస్తే కానీ ప్రాంతాల వారీగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నేతల నోటికి తాళం వేయలేకపోవొచ్చని బిజెపి శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తానికి పార్టీ విధానానికి మెజారిటీ నేతల అభిప్రాయాలకు భిన్నంగా సుజనా చౌదరి దూకుడు కి త్వరలోనే చెక్ పెట్టేస్తారని కమలం లో టాక్. మరి సునీల్ ఏమి చేయనున్నారో చూడాలి.