సోమిరెడ్డి తనయుడు ఇలా చేస్తున్నారా? వైరల్ అయిందే?

నెల్లూరు జిల్లా టీడీపీలో స‌డెన్‌గా ఓ వార్త తెర‌మీదికి వ‌చ్చింది. అది కూడా నెల్లూరు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి కుటుంబానికి [more]

Update: 2020-04-07 14:30 GMT

నెల్లూరు జిల్లా టీడీపీలో స‌డెన్‌గా ఓ వార్త తెర‌మీదికి వ‌చ్చింది. అది కూడా నెల్లూరు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన వార్త కావ‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడు. దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా పార్టీని ముందుండి న‌డిపిస్తున్నారు. పార్టీలో పెద్దగా వివాదాలు ఏవీ లేకుండానే ఆయ‌న ముందుకు దూసుకుపోతున్నారు. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 20 ఏళ్ల కింద‌ట ఒక‌సారి సోమిరెడ్డి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత మాత్రం చ‌తికిల ప‌డుతూనే ఉన్నారు.

గత ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా….

ఇంకా చెప్పాలంటే వ‌రుస ఓట‌ముల‌తో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప‌రాజ‌యాల రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఆయ‌న వ‌రుస‌గా ఐదుసార్లు ఓడిపోతూ వ‌స్తున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న త‌న వార‌సుడిగా కుమారుడు సోమిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకు రావాల‌ని నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నిక‌ల తర్వాత రాజ‌గోపాల్‌రెడ్డి యాక్టివ్ అయ్యారు. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ త‌ర‌ఫున ప్రచారం చేయ‌డం, ప్రజ‌ల మ‌ధ్యే ఉండ‌డం, ముఖ్యంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ వ‌ర్గంలో నాయ‌కుడిగా ఉన్నారు. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు ముందుకు సాగారు. పార్టీకి సంబందించిన కార్యక్రమాల‌ను నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నిక‌ల్లో స‌ర్వేప‌ల్లి నుంచి పోటీ చేయాల‌ని రాజ‌గోపాల్ భావించారు.

ఫలితాల తర్వాత…..

అయితే, పోటీ తీవ్రంగా ఉండ‌డంతో చంద్రబాబు మ‌రోసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే ఛాన్స్ ఇచ్చారు. దీంతో రాజ‌గోపాల్ రెడ్డి తండ్రి విజ‌యానికి కృషి చేశారు. మ‌రి అదేం దుర‌దృష్టమో.. మ‌రోసారి కూడా ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత రాజ‌గోపాల్ పార్టీ కార్యక్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. సోమిరెడ్డి పార్టీలోనే ఉండి.. ప్రభుత్వంపై విమ‌ర్శలు చేస్తున్నా.. ఆయ‌న కుమారుడు, యువ నేత మాత్రం నారా లోకేష్ గ్రూప్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల యువ నాయ‌కులకు హైద‌రాబాద్‌లో విందు ఇచ్చిన సంద‌ర్బంలోనూ రాజ‌గోపాల్ గైర్హాజ‌ర‌య్యారు. దీనిపై అప్పట్లోనే రూమ‌ర్లు వ‌చ్చాయి.

మంత్రిగారు రంగలోకి దిగి…..

అయితే, తాజాగా టీడీపీ నేత‌ల‌కు అందిన స‌మాచారం ప్రకారం సోమిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి వైసీపీ నేత‌ల‌కు స‌న్నిహితంగా ఉంటున్నార‌ని అంటున్నారు. ప్రస్తుతం స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాకాని గోవ‌ర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే వైసీపీలో నెల్లూరు నేత‌ల‌కు, కాకాని వ‌ర్గం అంటే గిట్టని వారు ఉన్నారు. ఈ క్రమంలో వారు రాజ‌గోపాల్‌ను వైసీపీలోకి తీసుకురావాల‌ని నిర్ణయించిన‌ట్టు తెలుస్తోంది. అయితే, దీని వెనుక మంత్రి ఒక‌రు చ‌క్రం తిప్పుతున్నార‌ని, అయితే, ఇప్పటికిప్పుడు పూర్తి వివ‌రాలు చెప్పలేమ‌ని అంటున్నారు స్థానిక నేత‌లు. మొత్తానికి టీడీపీలో మాత్రం సోమిరెడ్డి త‌న‌యుడు సైకిల్ దిగిపోయాడ‌ని చెప్పుకుంటున్న మాట‌ల్లో వాస్తవం ఉంద‌నేది నిజం అంటున్నారు ప‌రిశీల‌కులు కూడా.

Tags:    

Similar News