బ్రాహ్మణులకు అంత సీన్ ఉందా… ?
రాజకీయాల్లో బ్రాహ్మణులు కీలకంగా ఉండాలని ఆ సామాజికవర్గంలోని పెద్దలు బలంగా కోరుకుంటున్నారు. అది సమంజసమైన వాదనే కానీ ఇపుడున్న పరిస్థితుల్లో జరిగే పనేనా అన్నదే చర్చ. బ్రాహ్మణులు [more]
రాజకీయాల్లో బ్రాహ్మణులు కీలకంగా ఉండాలని ఆ సామాజికవర్గంలోని పెద్దలు బలంగా కోరుకుంటున్నారు. అది సమంజసమైన వాదనే కానీ ఇపుడున్న పరిస్థితుల్లో జరిగే పనేనా అన్నదే చర్చ. బ్రాహ్మణులు [more]
రాజకీయాల్లో బ్రాహ్మణులు కీలకంగా ఉండాలని ఆ సామాజికవర్గంలోని పెద్దలు బలంగా కోరుకుంటున్నారు. అది సమంజసమైన వాదనే కానీ ఇపుడున్న పరిస్థితుల్లో జరిగే పనేనా అన్నదే చర్చ. బ్రాహ్మణులు రాజకీయంగా చైతన్యం కావాలని, తమ హక్కులు సాధించుకోవాలని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి కోరుతున్నారు. సమాజంలో అన్ని వర్గాలు ముందుకుపోతూంటే ఒకనాడు అగ్రభాగాన ఉండి ఈ రోజు ఉనికిపోరాటం చేస్తున్న బ్రాహ్మణుల గురించి ఆయన ఆవేదన చెందారు. బ్రాహ్మణులు కేవలం ఉద్యోగ ఉపాధి రంగాల్లో కాకుండా రాజకీయాన కూడా తమ వాటాను తేల్చుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.
నాడు అలా …?
బ్రాహ్మణులు ఒకనాడు ఈ దేశానికి ప్రధానులుగా పనిచేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ వారే ముఖ్యమంత్రులుగా ఉండేవారు. ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయాక ఆంధ్రరాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బ్రాహ్మణుడు అయిన బూర్గుల రామక్రిష్ణారావు ఉండేవారు. ఉమ్మడి ఏపీలో పీవీ నరసింహారావు లాంటి వారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇక ఎంతో మంది మంత్రులుగా కూడా పనిచేసి చిరకీర్తిని గడించారు.
ఏమైపోయారో…?
ఒక లెక్క ప్రకారం చూస్తే గతంలో ఉమ్మడి ఏపీలో 35 మంది వరకూ ఎమ్మెల్యేలుగా ఉండేవారు. అంటే ఇపుడు రెడ్లు, ఇతర కులస్థుల మాదిరిగా ఒకనాడు నిర్ణయాత్మకమైన శక్తిగా బ్రాహ్మణులు ఉండేవారు అన్నదే దీని అర్ధం. మరి మంత్రి పదవులు నిష్పత్తి ప్రకారం వారికే ఎక్కువగా దక్కేవి. అయితే కాంగ్రెస్ ఏలుబడి సాగిన తొలి మూడు దశాబ్దాల కాలంలో బ్రాహ్మణుల రాజకీయం కూడా సాఫీగా సాగిందనే చెప్పాలి. తెలుగుదేశం ఆవిర్భవించాకనే వారి జాతకం తారు మారు అయింది. టీడీపీని ఎన్టీయార్ స్థాపిస్తే కాంగ్రెస్ నుంచి కరణం రామచంద్రరావు అనే బ్రాహ్మణ నాయకుడు నాడు ఆ పార్టీలో చేరారు. ఆయన బతికున్నంతవరకూ చంద్రబాబు బ్రాహ్మణుల కోటాలో ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చేవారు. ఆ తరువాత ఆ ముచ్చటా తీరిపోయింది. ఈ పరిస్థితి ఎంతదాక వచ్చింది అంటే టీడీపీ 1999 తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బ్రాహ్మణులకు టికెట్లే ఇవ్వకపోయినా ఎవరూ నోరెత్తని పరిస్థితి ఉంది.
కాంగ్రెస్ లో అలా ..?
ఇక కాంగ్రెస్ మొదటి నుంచి అన్ని పార్టీలకు న్యాయం చేస్తుంది. కాబట్టి వైఎస్సార్ జమానాలోనూ బ్రాహ్మణులకు టికెట్లు దక్కాయి. ఇక జగన్ కూడా వైసీపీలో బ్రాహ్మణులకు టికెట్లు ఇస్తూ వచ్చారు. ఇపుడు వైసీపీలో ఇద్దరు బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ సంఖ్య పెరగాలని ఈ మధ్య విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ మహా సభ గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయితే బ్రాహ్మణులు విభజన ఏపీలో కేవలం రెండు శాతం ఉన్నారు. ఆ లెక్కన చూసుకున్నా వారికి కనీసం నాలుగు సీట్లు ప్రతీ రాజకీయ పార్టీ ఇవ్వాలి. కానీ ఒక్క వైసీపీ మాత్రమే అలా ఇస్తోంది. అన్ని పార్టీలు ఇచ్చేలా ఈ సామాజిక వర్గం డిమాండ్ చేయాలి. అలాగే తమకు కాంగ్రెస్ తరువాత మొదట్లో ఎంతో కొంత చోటు ఇచ్చిన బీజేపీ లాంటి జాతీయ పార్టీలు కూడా ఇపుడు పక్కన పెట్టడం మీద పోరాటం చేయాలి. ఒక్క మాట ఇక్కడ నిజం. ఓట్లున్న కులాలకే సీట్లు. అందువల్ల బ్రాహ్మణులు మైనారిటీలు, ఓటు పరంగా కూడా నిరుపేదలు. మరి వారికి రాజకీయ హోదా రావాలి అంటే ముందు పోరాటాలు నేర్చుకోవాలి. అంతే తప్ప మీటింగులు పెట్టి తీర్మానాలు చేస్తే దక్కవన్నది పచ్చి నిజం.