ఆమె పార్టీ జెండా పడతానన్నా ఒప్పుకోవడం లేదట?

ఇప్పుడు ఏపీలో ఉన్న ప‌రిస్థితిలో ప్రధాన ప్రతిప‌క్షం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నాయ‌కులు ఉన్నప్పటికీ అంకిత‌భావంతో ప‌నిచేసే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. దీంతో పార్టీ యాక్టివ్‌గా ఉన్నా.. [more]

Update: 2020-04-23 00:30 GMT

ఇప్పుడు ఏపీలో ఉన్న ప‌రిస్థితిలో ప్రధాన ప్రతిప‌క్షం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నాయ‌కులు ఉన్నప్పటికీ అంకిత‌భావంతో ప‌నిచేసే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. దీంతో పార్టీ యాక్టివ్‌గా ఉన్నా.. యాక్టివ్‌గా కార్యక్రమాలు న‌డిపించే నాయ‌కుల కొర‌త వెంటాడుతోంది. జ‌గ‌న్ ప్రభుత్వంపై చంద్రబాబు అనేక రూపాల్లో నిర‌స‌న కార్యక్రమాలు చేప‌ట్టినా.. వాటిని చేప‌ట్టడంలో నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యార‌ని తానే కొన్ని సంద‌ర్భాల్లో ఆగ్రహం వ్య‌క్తం చేశారు. వాటి వెనుక అసంతృప్తులు కావొచ్చు.. మ‌రేదైనా కావొచ్చు.. నాయ‌కులు మాత్రం ముందుకు రావ‌డం లేదు.

నేనున్నానంటున్నా….

ఈ స‌మ‌యంలో నేనున్నాను.. పార్టీని న‌డిపిస్తాను.. అని చెప్పే నాయ‌కుల‌ను చంద్రబాబు ప‌ట్టించు కోవడంలేద‌నే అప‌వాదు ఇప్పుడు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క ‌వ‌ర్గానికి చెందిన మాజీ స్పీక‌ర్ ప్రతిభా భార‌తి త‌న‌యురాలు గ్రీష్మ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. త‌న త‌ల్లికి వార‌సత్వంగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన గ్రీష్మ.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనే ఇక్కడ నుంచి పోటీ చేయాల‌ని భావించారు. అయితే, అప్పటికే పార్టీలో ఉన్న అంత‌ర్గత కుమ్ములాట‌లు, అదే స‌మ‌యంలో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండ్రు ముర‌ళి టీడీపీ సైకిల్ ఎక్కిన నేప‌థ్యంలో గ్రీష్మ విష‌యాన్ని చంద్రబాబు ప‌ట్టించుకోలేదు.

కొండ్రు మురళి చేరికతో….

ప్రతిభా భార‌తి రాజ‌కీయాల‌కు దూరం కావ‌డంతో చంద్రబాబు గ్రీష్మ రాజ‌కీయ భ‌విష్యత్తు త‌న‌కు వ‌దిలేయ‌మ‌ని చెప్పి కొండ్రుకు సీటు ఇచ్చారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కొండ్రు రాజాంలో ఘోరంగా ఓడిపోయారు. ఆయ‌న ఓట‌మికి పార్టీ వ్యతిరేక గాలుల‌తో పాటు ఇటు ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు స‌హ‌క‌రించ‌లేద‌న్న టాక్ కూడా ఉంది. ఇక ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని పూర్తిగా గాలికి వ‌దిలేశారు. పోనీ టికెట్ ఇచ్చార‌నే విశ్వాసం ఆయ‌న ఏమైనా చూపిస్తున్నారా ? అంటే అది కూడా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు కాబ‌ట్టి.. వైసీపీలోకి జంప్ చేయాల‌ని భావిస్తున్నారు. ఈ క్రమంలో రాజాంలో టీడీపీని ప‌ట్టించుకునే నాధుడు క‌నిపించ‌డంలేదు.

లోకేష్ చుట్టూ తిరుగుతున్నా…..

ఈ క్రమంలోనే తాను ఇక్కడ పార్టీని న‌డిపిస్తాన‌ని, త‌న‌కు ప‌గ్గాలు అప్పగించాల‌ని గ్రీష్మ కోరుతున్నారు. అంతేకాదు, ఈ విష‌యంపై ఆమె హైద‌రాబాద్‌లోని నెంబ‌ర్ 2 నాయ‌కుడు, బాబు త‌న‌యుడు నారా లోకేష్ వ‌ద్దకు ప‌లుమార్లు వెళ్లి అభ్యర్థించారు. అయినా కూడా ఆమెకు ఇప్పటి వ‌ర‌కు గ్రీన్ సిగ్నల్ ల‌భించ‌లేదు. రాజాం సీటు కోసం ఆమె లోకేష్‌నే న‌మ్ముకుని ఆయ‌న చుట్టూనే ప్రద‌క్షిణ‌లు చేస్తున్నారు. రేపో మాపో గ్రీష్మకు రాజాం ప‌గ్గాలు ఇచ్చినా.. ఆమెలో ఉత్సాహం నీరుగారిపోయాక ఇవ్వడం వ‌ల్ల ఎలాంటి ప్రయోజ‌నం ఉండ‌ద‌నే విష‌యాన్ని గుర్తించి.. ఇప్పటి‌కైనా చంద్రబాబు ఆమెకు ప‌గ్గాలు అప్పగించి ప్రోత్సహిస్తే.. పార్టీ ప‌రుగులు పెడుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News