రేవంత్ రెచ్చిపోతే.. ఎవరికి నష్టం?
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోనూ పట్టు చిక్కడం లేదు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు మిత్రులకన్నా శత్రువులే ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి [more]
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోనూ పట్టు చిక్కడం లేదు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు మిత్రులకన్నా శత్రువులే ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి [more]
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోనూ పట్టు చిక్కడం లేదు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు మిత్రులకన్నా శత్రువులే ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి రేవంత్ ను నిలువరించడానికే ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి కారణమనే వారు కూడా లేకపోలేదు. దుందుడుకు నిర్ణయాలు, ఏకపక్షంగా అప్పటికప్పుడు చేపట్టే ఆందోళనలతో ఆయన ఇరకాటంలో పడుతున్నారు. అంతేకాదు పార్టీని కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చి….
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి మాటల తూటాలతో ఆకట్టుకుంటారన్న పేరుంది. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని పదే పదే విమర్శలు చేస్తుండటంతో ఆయన కొద్దికాలంలోనే రాష్ట్ర నేతగా ఎదిగిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు ఊహించని గౌరవం ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది.
అనవసర వివాదాల్లో…..
శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పీసీసీ చీఫ్ పదవి కోసం పెద్దయెత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాలను వినియోగించడం వివాదాస్పద మయింది. నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారని రేవంత్ రెడ్డి ప్రజలకు తెలియజెప్పాలనుకున్నారు. ఇందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బెయిల్ కూడా రేవంత్ రెడ్డికి దక్కలేదు.
సొంత పార్టీ నుంచి…..
ఇదిలా ఉంటే సొంత పార్టీ నుంచే రేవంత్ రెడ్డికి సహకారం అందడం లేదు. రేవంత్ రెడ్డి పార్టీకి చెప్పకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్ నేత వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. మరో నేత జగ్గారెడ్డి సయితం రేవంత్ రెడ్డి అనుచరులపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఆయన అనుచరులను రేవంత్ నిలువరించకుంటే తాను సోనియాకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. భూ కుంభకోణాల కేసులో కూడా రేవంత్ ఇరుక్కున్నారు. రేవంత్ రెడ్డి ఎవరినీ సంప్రదించకుండా తానే హీరో అవ్వాలని నిర్ణయాలు తీసుకుంటున్నారని, వాటికి తమ మద్దతు ఉండదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒంటరిగానే కన్పిస్తున్నారు. ఆయన దూకుడును తగ్గించుకుంటే బెటరన్న సూచనలు కూడా విన్పిస్తున్నాయి.