మంత్రికి మంటెక్కుతుందట

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైసీపీలో రాజ‌కీయ చిచ్చు ర‌గులుకుంది. ఇక్కడ నుంచి జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో కేబినెట్ మినిస్టర్‌గా ఉన్న శ్రీరంగ‌నాథ‌రాజు. ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ర‌గిలిపోతున్నట్టు [more]

Update: 2020-02-02 11:00 GMT

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైసీపీలో రాజ‌కీయ చిచ్చు ర‌గులుకుంది. ఇక్కడ నుంచి జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో కేబినెట్ మినిస్టర్‌గా ఉన్న శ్రీరంగ‌నాథ‌రాజు. ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ర‌గిలిపోతున్నట్టు టాక్‌. గ‌త ఏడాది గెలిచాక కేబినెట్లో మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందో లేదోన‌ని భావించినా మంత్రి పీఠం ద‌క్కడంతో ఆనందంతో ఉన్న ఆయ‌న వ‌చ్చే రెండేళ్ల త‌ర్వాత కూడా దీనిని తానే సొంతం చేసుకోవాల‌ని మంచి ఊపుపై ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న దూకుడు చూపిస్తున్నారు. ప‌శ్చిమ డెల్టాలో త‌న రాజ‌కీయ ఆధిప‌త్యాన్ని కూడా చాటుతున్నారు. జిల్లాలో డెల్టాపై పూర్తి ప‌ట్టు సాధించేందుకు ఇప్పటికే ప్రయ‌త్నాలు చేస్తున్నారు.

ప్రశంసలు కురిపించి….

అయితే, ఇంత‌లోనే మంత్రి రంగ‌నాథ‌రాజు వ్యూహానికి గండి ప‌డింది. సీఎం జ‌గ‌న్ మేన‌మామ‌, క‌డ‌ప జిల్లా కు చెందిన ర‌వీంద్రనాథ్ రెడ్డి ఇటీవ‌ల సంక్రాంతిని పుర‌స్కరించుకుని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు వ‌చ్చారు. అదికూడా వైసీపీ సీనియ‌ర్ నేత‌, న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద‌రాజు ఆహ్వానం మేర‌కు ర‌వీంద్ర ఇక్కడ‌కు వ‌చ్చారు. కోడి పందేల‌ను వీక్షించారు. ఆతిథ్యం స్వీక‌రించారు. ఈ కార్యక్రమంలో ర‌వీంద్రనాథ‌రెడ్డి ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ప్రసాద‌రాజు పార్టీ కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. 2012 ఉప ఎన్నిక‌ల నుంచి కూడా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నార‌ని చెప్పారు.

వచ్చే విస్తరణలో….

అంతేకాదు, వైఎస్ ఫ్యామిలీకి, ముఖ్యంగా జ‌గ‌న్‌కు కూడా ప్రసాద‌రాజు చాలా ఆప్తుల‌ని ర‌వీంద్రనాథ్‌రెడ్డి కొనియాడారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌ర్వాత చేసిన కామెంట్లు రాజ‌కీయ ర‌గ‌డ‌తోపాటు మంత్రి రంగ‌నాథ‌రాజు గుండెల్లో భోగిమంట‌ల‌ను రేపాయి. “వాస్తవానికి మొన్న ఏర్పాటైన మంత్రి వ‌ర్గంలోనే ప్రసాద‌రాజుకు జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చి ఉండాల్సింది. అయితే, అదే వివిధ కార‌ణాల‌తో త‌ప్పిపోయింది. అయితే, మ‌రో రెండేళ్ల త‌ర్వాత జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో ఖ‌చ్చితంగా ప్రసాద‌రాజుకు ఛాన్స్ ద‌క్కుతుంది“-అని ర‌వీంద్రనాధ్ రెడ్డి అన్నారు. దీంతో రంగ‌నాథ‌రాజు ర‌గిలిపోతున్నార‌ట. ఈ విష‌యం ఇప్పుడు ప‌శ్చిమ డెల్టా వైసీపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో బాగా హాట్ టాపిక్‌గా మారింది.

ముందు నుంచి పార్టీలో…..

ప్రసాద‌రాజు జ‌గ‌న్ వెంట ముందు నుంచి ఉన్నారు. జ‌గ‌న్ పార్టీ పెట్టిన వెంట‌నే వైసీపీలోకి వెళ్లిన ఆయ‌న 2012లో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకుని మ‌రీ ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయం అనుకున్నా రంగ‌నాథ‌రాజు ఆలిండియా క్షత్రియ సంఘం కీల‌క నేత‌ల నుంచి జ‌గ‌న్‌పై ఒత్తిడి తేవ‌డంతో ప్రసాద‌రాజుకు మంత్రి ప‌ద‌వి రాలేదు. చివ‌ర‌కు రంగ‌నాథ‌రాజుకు క్షత్రియుల కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. రాజుల కోటాలో త‌ను క‌ష్టప‌డి సంపాయించుకున్న మంత్రి పీఠం మ‌రో రెండేళ్ల త‌ర్వాత కూడా త‌న‌కే ఉంటుంద‌ని ఆయ‌న అనుకుంటున్నారు.

ఇద్దరి మధ్య…

అయితే, ఇంత‌లోనే ఉరుములులేని పిడుగు మాదిరిగా జ‌గ‌న్ మేన‌మామ‌ ర‌వీంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల‌తో ఆయ‌న షాక్ అయిన‌ట్టు టాక్‌. దీంతో రంగ‌నాథ‌రాజు తీవ్రంగా ర‌గిలిపోతున్నార‌ని, త‌న మంత్రి ప‌ద‌వి రెండేళ్ల త‌ర్వాత ప్రసాద‌రాజు ఎక్కడ లాగేసుకుంటారో ? అని కాస్త టెన్షన్ ప‌డుతున్నట్టు వైసీపీలోనే వినిపిస్తోన్న టాక్‌.. ఏదేమైనా వైసీపీలో ప్రసాద‌రాజు వ‌ర్సెస్ రంగ‌నాథ‌రాజు మ‌ధ్య పొస‌గ‌డం లేద‌న్న టాక్ జిల్లా వైసీపీ వ‌ర్గాల్లోనే బ‌లంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News