ప్రజా వేదిక ఎపిసోడ్ తో టీడీపీ పరువు పోయిందా ?
ఎందుకో తెలుగుదేశం పార్టీకి కాని కాలం దాపురించింది. తాడు పట్టుకుంటే అది పాము అవుతోంది. అసలు రోజులు బాగాలేవు. లేకపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 23 [more]
ఎందుకో తెలుగుదేశం పార్టీకి కాని కాలం దాపురించింది. తాడు పట్టుకుంటే అది పాము అవుతోంది. అసలు రోజులు బాగాలేవు. లేకపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 23 [more]
ఎందుకో తెలుగుదేశం పార్టీకి కాని కాలం దాపురించింది. తాడు పట్టుకుంటే అది పాము అవుతోంది. అసలు రోజులు బాగాలేవు. లేకపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 23 మంది ఎమ్మెల్యేలు గెలవడం ఏంటి. రాజకీయ వారసుడు లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడం ఏంటి. ముచ్చటగా మూడవసారి కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చోవడమేంటి. తన కొడుకు వయసు ఉన్న జగన్ తో మాటలు పడడం ఏంటి. ఓ వైపు వయసు ముదురుతున్న వేళ సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు జాతకం ఇలా రివర్స్ కావడమేంటి. మొత్తానికి బాబుతో పాటే టీడీపీ సైకిల్ కి పంక్చర్ పడిపోయింది.
జనం ముందు దోషిగా :
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు పాలనంతా అవినీతిమయం, అక్రమం అని అయిదేళ్ళ పాటు జగన్ వూరూ వాడా వూదరగొట్టారు. అయితే అవి ప్రతిపక్షం చేసే సాధారణ ఆరోపణగానే అంతా చూశారు. అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలను వెలికి తీయాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అయితే అన్ని విషయాలు బయటపడేటప్పటికి చాలా సమయం పడుతుంది. కొన్ని నిరూపించేందుకు ఏళ్ళు వూళ్ళు కూడా దాటిపోవచ్చు. అందుకే జగన్ నెల రోజుల లోపే బాబు భాగోతాన్ని బయట పెట్టేందుకు ఆయన కలల వేదిక ప్రజావేదికనే ఎంచుకున్నారు. దాన్నే నిలువెత్తు సాక్ష్యంగా చేసి చూపించారు. అది అక్రమమని లోకమంతా కళ్ళారా చూసేలా చేసి మరీ కూలగొట్టారు. టీడీపీకి ఈ డ్యామేజి అంతా ఇంతా కాదు.
లొల్లి చేసినా పరువు గోవిందా :
ఇక ప్రజావేదిక అక్రమ కట్టడం అని విపక్షాలతో పాటు అందరికీ తెలుసు. అందుకే ఎవరూ గట్టిగా జగన్ సర్కార్ ని ఏమీ అనలేని పరిస్థితి. అదే సమయంలో కూలగొట్టొద్దు అంటూ టీడీపీ అంటోంది తప్ప అది అక్రమ కట్టడం కాదు అని చెప్పలేకపోతోంది. దానికి బదులుగా పేలవమైన వాదనలు వినిపిస్తూ ఏపీలో ఎక్కడపడితే అక్కడ అనధికారికంగా వైఎస్సార్ విగ్రహాలు ఉన్నాయి. ఇంకేవో అక్రమ కట్టడాలు ఉన్నాయని లిస్ట్ చదువుతోంది. అక్కడ తప్పు ఉంటే దాని మీద చర్యలు ఉంటాయి కానీ ప్రజా వేదిక తప్పుల తడక అని తమ్ముళ్ళు చెప్పకనే ఒప్పుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే ఈ ఎపిసోడ్ తో టీడీపీ పరువు పూర్తిగా మంటకల్సిపోయింది. ఒక్క ప్రజా వేదికలోనే కోట్ల అవినీతి జరిగిందని జగన్ సర్కార్ ఆంధ్ర జనాలకు చక్కగా తెలియచేసింది. ఇపుడు తమ్ముళ్ళకు సౌండ్ వస్తే ఒట్టు.