రూటు మారిస్తేనే… సీటు దక్కుతుందట
ఏదైనా అనుభవమైతే కాని విషయం తెలియదంటారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా అదే బోధపడినట్లుంది. సినీనటుల గ్లామర్ పెద్దగా రాజకీయాల్లో పనిచేయడం లేదు. [more]
ఏదైనా అనుభవమైతే కాని విషయం తెలియదంటారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా అదే బోధపడినట్లుంది. సినీనటుల గ్లామర్ పెద్దగా రాజకీయాల్లో పనిచేయడం లేదు. [more]
ఏదైనా అనుభవమైతే కాని విషయం తెలియదంటారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా అదే బోధపడినట్లుంది. సినీనటుల గ్లామర్ పెద్దగా రాజకీయాల్లో పనిచేయడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు సినీనటులను రాజకీయంగా పెద్దగా పట్టించుకోవడం లేదు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కమల్ హాసన్, విజయ్ కాంత్ పార్టీలు జీరో స్థానాలను సాధించాయి. అందుకే పవన్ కల్యాణ్ రాజకీయంగా మరో నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.
బలం ఉన్నా…?
ఏదైనా రాజకీయ పార్టీ బలంగా ఉండాలటే క్షేత్రస్థాయిలో క్యాడర్ అవసరం. దీంతో పాటు బలమైన ఓటు బ్యాంకు మద్దతు కూడా అవసరం. పవన్ కల్యాణ్ కు ఇటు అభిమానుల అండదండలతో పాటు కాపు సామాజికవర్గం అండదండలు కూడా రాజకీయంగా లభించే అవకాశముంది. అయితే అత్యాశకు పోయి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి గత ఎన్నికల్లో జనసేన సింగిల్ డిజిట్ కే పరిమితమయింది.
ఏడేళ్ల నుంచి….
ఇప్పటికే ఏడేళ్ల నుంచి పార్టీ నడపటం కూడా పవన్ కల్యాణ్ కు కష్టమయింది. ఆర్థికంగా ఒడిదుడుకులు తట్టుకోలేకనే పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి చేసిన తప్పులు పునరావృతం కాకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా తాను కింగ్ మేకర్ గా మారాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచన. నిజానికి కొంత కష్టపడితే పవన్ కల్యాణ్ కు ఇదేమీ సాధ్యం కాదు. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పాలనను చూసి విసిగిపోయిన ప్రజలు పవన్ కల్యాణ్ కు ఈసారి మద్దతిచ్చే అవకాశముంది.
30 గెలిస్తే చాలు….
దాదాపు ముప్ఫయి స్థానాలను గెలుచుకుంటే చాలు ఏపీలో కింగ్ మేకర్ గా పవన్ కల్యాణ్ మారతారు. అందుకోసమే ఆయన వ్యూహం మార్చినట్లు తెలిసింది. ఎంపిక చేసిన యాభై స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి అక్కడ ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆయన సర్వే చేయించడానికి కూడా సిద్ధమయ్యారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రాయసీమలోని చిత్తూరు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఈ యాభై స్థానాలను ఎంపిక చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ వ్యూహం వర్క్ అవుట్ అయితే నిజంగానే పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంది.