పవన్ ఫిక్స్ అయినట్లుంది

పవన్ ను భారతీయ జనతా పార్టీ ఒక ఆటాడుకుంటున్నట్లు కన్పిస్తోంది. జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తారంటూ బీజేపీ నేతలు మైండ్ గేమ్ మొదలు [more]

Update: 2019-09-08 15:30 GMT

పవన్ ను భారతీయ జనతా పార్టీ ఒక ఆటాడుకుంటున్నట్లు కన్పిస్తోంది. జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తారంటూ బీజేపీ నేతలు మైండ్ గేమ్ మొదలు పెట్టారు. అసలే ఓటమి భారంతో కుంగిపోయి ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ పవన్ కల్యాణ్ ను తమ పార్టీలో కలిపేసుకోవాలని గట్టిగానే భావిస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా బీజేపీతో చెలిమి చేయాలని చూస్తున్నారు.

మోదీపై ప్రశంసలు….

పవన్ కల్యాణ్ ఇటీవల రాజధాని అమరావతిని పర్యటించినప్పుడు బీజేపీ పెద్దలపై ప్రశంసలు కురిపించారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒకే ఒక రోజులో ఏళ్లుగా నలుగుతున్న అంశాన్ని మోదీ తేల్చి పారేశారన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకుంటే తాను నేరుగా మోదీని కలుస్తానని కూడా చెప్పడం చర్చకు మరింత తావిచ్చింది. మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా తరలిస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇలా పవన్ కల్యాణ్ బీజేపీ పట్ల పాజిటివ్ గాన స్పందిస్తున్నారు.

హోదాను పక్కన పెట్టి….

ఎన్నికలకు ముందు పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక హోదాపై కామెంట్స్ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ ఊసే మరిచిపోయారు. పైగా 2014 ఎన్నికలకు ముందే తనను అమిత్ షా పార్టీని బీజేపీలో కలిపేయాలని కోరారని కూడా హింట్ ఇచ్చారు. అయితే జనసేన పార్టీ మాత్రం ఏ పార్టీలో కలిపే ప్రసక్తి లేదని, తన ఊపిరి ఉన్నంత వరకూ జనసేన ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం వచ్చే డిసెంబరు నాటికి జనసేన బీజేపీలో విలీనం కావడం ఖాయమని జోస్యం చెప్పేస్తున్నారు.

పొత్తుకు సిద్ధమయినట్లే….

అయితే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల విషయంలో పొత్తుతో వెళ్లేందుకు సిద్ధమయి పోయినట్లే కన్పిస్తుంది. జనసేనను పార్టీలో విలీనం చేయకుండా బీజేపీతో కలసి నడిచేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలతో పాటు మేధావులు, ఉద్యోగులు మోదీ పాలన పట్ల ఆసక్తి చూపుతుండటంతో బీజేపీతో కలసి వెళితే విజయం ఖాయమని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మాయావతితో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఈసారి కమలనాధులతో కలసి నడుస్తారన్న టాక్ మాత్రం జనసేనలో బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News