పవన్ ది పాత ఫార్ములానే…?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత ఫార్ములానే కొత్తగా ఎంచుకున్నారు. గతంలో ఎన్టీ రామారావు అనుసరించిన విధానంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 60 మంది కొత్త వారికి [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత ఫార్ములానే కొత్తగా ఎంచుకున్నారు. గతంలో ఎన్టీ రామారావు అనుసరించిన విధానంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 60 మంది కొత్త వారికి [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత ఫార్ములానే కొత్తగా ఎంచుకున్నారు. గతంలో ఎన్టీ రామారావు అనుసరించిన విధానంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 60 మంది కొత్త వారికి అందులోనూ యువకులకు టిక్కెట్లు ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన యువకులు, విద్యావంతులకే ఎక్కువ అవకాశమిచ్చి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. తాను కూడా ఎన్టీఆర్ బాటలోనే నడవాలని పవన్ నిర్ణయించుకుంటున్నట్లు ఆయన మాటల్లో కనపడుతుంది.
యువతకే పెద్ద పీట…..
గత మూడు రోజులుగా జిల్లాల వారీగా అమరావతిలో సమీక్షలు చేస్తున్న పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను జిల్లా నేతలతో పంచుకుంటున్నారు. 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకునే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా వచ్చే ఎన్నికలలో కీ రీలో పోషిస్తామన్న విశ్వాసాన్ని వారిలో నింపుతున్నారు. ఇక యువత, మహిళలను ఆకట్టుకునేందుకు వారికే ఎక్కువ స్థానాలను కేటాయించాలని పవన్ నిర్ణయించారు. గెలుపోటములు పక్కన పెడితే యువత ప్రాతినిధ్యాన్ని ఎన్నికల్లో పెంచాలని ఆయన నిర్ణయించుకున్నారు.
పాత నేతలకు ఫుల్ స్టాప్ పెట్టాలని…..
గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని సామాజికవర్గాలు,కొన్ని కుటుంబాలే నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వారికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నది పవన్ ఆలోచన. ఇందుకోసం ఆయన కొత్త రక్తం కోసం వెదుకుతున్నారు. ఆర్థికంగా బలంగా లేకపోయినా పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేవారికి సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. తనకంటూ కొన్ని జిల్లాలపై ప్రత్యేక అవగాహన ఉందంటున్నారు పవన్. పార్టీ పట్ల అంకిత భావం, సిద్ధాంతాలను బలంగా నమ్మే వ్యక్తులకు ఈసారి టిక్కెట్లు కేటాయించాలన్నది పవన్ భావనగా ఉందంటున్నారు.
ప్రయోగం ఫలిస్తుందా…?
ఒకవైపు ఇతర పార్టీల నుంచి సీనియర్లను, అనుభవం ఉన్నవాళ్లను, ఎలాంటి వివాదాలు లేని వారిని తీసుకుంటూ, మరోవైపు కొత్త తరానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది పవన్ వ్యూహం. ఈ విధానంతో పాత నేతలతో విసిగిపోయిన ప్రజలకు ఊరట కల్పిస్తానన్న ధీమాతో ఉన్నారు. కాని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. కేవలం తనను చూసే ప్రజలు అనుకుంటే అది భ్రమే అవుతుందన్న వాదనలు కూడా విన్పిస్తున్నాయి. మొత్తం మీద పవన్ చేస్తున్న ఈ ప్రయోగం ఫలిస్తుందా? వికటిస్తుందా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచిచూడక తప్పదు.