రేటింగ్ కోసం చేస్తే ఇక అంతే
రాష్ట్రంలో ప్రశ్నిస్తానంటూ.. పార్టీని ప్రారంభించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పటి వరకు ఇతమిద్దంగా చూస్తే.,. ప్రశ్నించింది ఒకే ఒక్క పార్టీని, ఒకే ఒక్క [more]
రాష్ట్రంలో ప్రశ్నిస్తానంటూ.. పార్టీని ప్రారంభించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పటి వరకు ఇతమిద్దంగా చూస్తే.,. ప్రశ్నించింది ఒకే ఒక్క పార్టీని, ఒకే ఒక్క [more]
రాష్ట్రంలో ప్రశ్నిస్తానంటూ.. పార్టీని ప్రారంభించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పటి వరకు ఇతమిద్దంగా చూస్తే.,. ప్రశ్నించింది ఒకే ఒక్క పార్టీని, ఒకే ఒక్క నేతను. అదే వైసీపీ, జగన్ ను మాత్రమే. ఈ రెండు మినహా పవన్ ఇప్పటి వరకు చేసింది పెద్దగా ఏమీలేదు. ప్రత్యేక హోదా విషయంలో ముందు పట్టుబట్టినా.. పై నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆయన విరమించుకున్నారు. పాచిపోయిన లడ్డూలు అంటూ ప్రత్యేక ప్యాకేజీని పోల్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ ఊసే మరిచిపోయారు. పైగా ప్రజల్లో ప్రత్యేక హోదాపై పట్టు లేదని, ప్రజలు కోరుకోనప్పుడు తానేం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
రేటింగ్ కోసమేనా?
వాస్తవానికి ఇప్పుడు పవన్ కల్యాణ్ చేపట్టిన ఇసుక లాంగ్ మార్చ్‌ను ఎవరు కోరుకున్నారు ? ఇసుక విషయంలో ఆయన స్పందించిన దాంట్లో పావలా వంతైనా ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం కదిలించగలిగారా ? అంటే శూన్యమనే చెప్పాలి. ప్రత్యేక హోదా చాలా క్లిష్టతతో కూడుకున్నదనేది వాస్తవం. ఇది రాష్ట్రంలో ఒక నాయకుడిపై చేసే పోరాటం కాదు, కేంద్రంపై చేసే పోరు. దీనికి సమయం, సహనము కూడా చాలా కావాలి. అదే ఇసుక అయితే, ఇలా చేస్తే.. అలా రేటింగ్ పెరిగిపోతుంది. అందుకే ఆయన సునాయాశ మార్గం ఎంచుకున్నారు.
అర్థం కావడం లేదా?
అయితే, పార్టీ విషయానికి వస్తే.. ఈ రేంటింగ్ ఎంత మేరకు ఉపయోగపడుతోంది ? అంటే.. అది కూడా శూన్యమనే వాదనే వినిపిస్తోంది. ఉద్యమాలు చేయడం ద్వారా, ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించడం ద్వారా ఓటు బ్యాంకు ను స్థిరీకరించుకొవచ్చనేది వృధా. ఈ విషయం రాష్ట్రంలో బీజేపీని చూసినా.. దీనికి ముందు నుంచి ఉన్న కమ్యూనిస్టు పార్టీలను చూసినా ఇట్టే అర్ధమవుతుంది. రాష్ట్రంలో ఎదగాలని భావించే పార్టీ ప్రజానాడిని పట్టుకోవాల్సిన అవసరాన్ని మరిచిపోయి.. ఏదో ప్రత్యేక అజెండాతో ముందుకు సాగాలని చేస్తున్న ప్రయత్నం పవన్ కల్యాణ్ లో స్పష్టంగా కనిపిస్తోందని సామాన్యుల నుంచి మేధావుల వరకు కూడా చర్చించుకుంటున్నారు.
వ్యూహం లేకుంటే….?
ఈ క్రమంలోనే తనకు పాతికేళ్ల టైం ఉందని పవన్ కల్యాణ్ చెప్పుకొంటున్నారు. అయితే, ఇప్పటికే పదేళ్లు అయిపోయాయి. 2014లో పోటీ చేయలేదు. 2019లో ఒక్క సీటును ముక్కీ మూలిగీ గెలుచుకున్నారు. అలాంటి నాయకుడు పుంజుకునేందుకు ఇలాంటి మార్గాలతో పని అయ్యేనా? అనేది పార్టీలోని నేతలే అంటున్న మాట. ఇక ఇప్పటికి పార్టీకి జిల్లాలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ సరైన సంస్థాగత కమిటీలు లేవు. రేపో మాపో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలంటే ఎవరు బాధ్యత తీసుకోవాలో ? కూడా పార్టీ వాళ్లకే అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ వ్యూహాలు మార్చుకోని పక్షంలో మరో కమ్యూనిస్టు పార్టీగా మనం మిగిలిపోతామని ఆ పార్టీ వాళ్లే హెచ్చరిస్తున్నారు.