పవన్ కల్యాణ్ కు మళ్లీ హ్యాండిచ్చారుగా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీజేపీ మళ్లీ హ్యాండిచ్చింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తామే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన [more]

Update: 2021-03-13 06:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీజేపీ మళ్లీ హ్యాండిచ్చింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తామే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ భావించారు. ఆయన ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డాను కలసి కూడా చెప్పివచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థి విషయంపై సమన్వయ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. కానీ హటాత్తుగా బీజేపీ తాము బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి పవన్ కల్యాణ్ కు షాకిచ్చింది.

గతంలోనూ అంతే…..

గతంలోనూ బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ కు ఇలాంటి షాక్ లే తగిలాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ ను వ్యూహ్యాత్మకంగా పక్కన పెట్టింది. జనసేన నేతలు అక్కడ పోటీకి సిద్ధమయినా చివరి నిమిషంలో మాత్రం జనసేన అభ్యర్థులు ఎవరూ బరిలో ఉండరని బీజేపీ ప్రకటించింది. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పోటీ నుంచి తప్పుకునేలా పవన్ కల్యాణ్ ను ఒప్పించగలిగారు.

ప్రత్యేకంగా సమావేశమై….

ఇక తాజాగా తిరుపతి ఉప ఎన్నికలో బరిలోకి దిగాలని జనసేన భావించింది. పవన్ కల్యాణ్ తిరుపతిలో జనసేన కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో దాదాపు ఐదు నియోజకవర్గాలలో బలిజ ఓటర్లు అధికంగా ఉండటంతో తామే పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన కార్యకర్తలు, నేతలు కూడా పవన్ కల్యాణ్ ను ఒప్పించారు. అయినా చివరి నిమిషంలో బీజేపీ మాత్రం పవన్ కల్యాణ్ పక్కన పెట్టి తామే పోటీ చేస్తామని చెప్పడంతో జనసైనికులు షాక్ కు గురయ్యారు.

వ్యూహాత్మకంగానే వెనక్కు తగ్గారా?

అయితే ఈ ఉప ఎన్నిక విషయంలో పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగానే వెనక్కు తగ్గారంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో బీజేపీ పై బాగా అసంతృప్తి ఉంది. తాము బరిలోకి దిగితే విపక్ష టీడీపీ ఓట్లను చీల్చే అవకాశముంది. అందుకే బీజేపీ చేసిన ప్రతిపాదనకు పవన్ కల్యాణ్ తలొగ్గారు. గెలవని చోట బరిలోకి దిగడం ఎందుకు? కనీసం అధికార పార్టీ మెజారిటీ తగ్గించేందుకు వీలు కల్గిలే పోటీ నుంచి పవన్ కల్యాణ్ పార్టీ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News