ఆవేశమేనా..? ఆలోచనలేదా?

పవన్ కల్యాణ్ కు ఆవేశమెక్కువ. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ముందు స్టేట్ మెంట్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత వెనక్కు తగ్గుతారు. ఈ ఆరేళ్లలో అనేకసార్లు అనుభవమయినా ఆయన తీరు [more]

Update: 2020-02-09 13:30 GMT

పవన్ కల్యాణ్ కు ఆవేశమెక్కువ. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ముందు స్టేట్ మెంట్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత వెనక్కు తగ్గుతారు. ఈ ఆరేళ్లలో అనేకసార్లు అనుభవమయినా ఆయన తీరు మార్చుకున్నది లేదు. ఇక ఏపీ రాజధాని రైతులకు అండగా నిలబడతానని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. అంతేకాదు ఢిల్లీ స్థాయిలో తాను అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా ఆపగలుగుతానని చెప్పారు. అయితే రంగంలోకి దిగాక కాని పవన్ కల్యాణ్ కు పరిస్థితి అర్థమయినట్లు లేదు.

తరలిస్తే ఊరుకోనంటూ…..

రాజధానిని తరలిస్తే ఊరుకోనంటూ పదే పదే ప్రకటించారు పవన్ కల్యాణ్. రైతుల ఉద్యమానికి అండగా నిలుస్తానని చెప్పారు. బీజేపీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. రెండు మార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. ఢిల్లీలోనే ఆవేశంగా లాంగ్ మార్చ్ ఉంటుందని ప్రకటించారు. ఫిబ్రవరి 2వ తేదీన లాంగ్ మార్చ్ అని, విజయవాడ లో చేస్తామని చెప్పారు. తర్వాత లాంగ్ మార్చ్ ప్రతిపాదన అటకెక్కింది. ఇక లాంగ్ మార్చ్ లేనట్లే అనుకోవాలి.

ఈ నెల 10వ తేదీ తర్వాత….

పవన్ కల్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజధాని రైతులు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. దీంతో తాను రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ వారికి మాట ఇచ్చారు. ఈ నెల 10వ తేదీ తర్వాత రాజధాని ప్రాంతంలో పవన్ కల్యాణ్ పర్యటన ఎప్పుడైనా ఉండొచ్చు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో రాజధాని గ్రామాల పర్యటన ఇంకా ఖరారు కాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో కలసిన తర్వాత పవన్ వాయిస్ రాజధాని విషయంలో బలంగా విన్పించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఎలాంటి హామీ ఇస్తారో?

ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల్లో పర్యటించాలని పవన్ పది రోజుల క్రితం నిర్ణయించారు. ఈ గ్రామల పర్యటన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమని సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులకు పవన్ కల్యాణ‌్ ఎలాంటి భరోసా ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News