ర్యాగింగ్ భరించలేకపోతున్నారా?
ఏపీలో 151 సీట్లు, 22 మంది ఎంపీలతో జగన్ గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఉండాలి. కానీ రాజకీయం చూస్తే అలా కనిపించడంలేదు. 23 సీట్లతో [more]
ఏపీలో 151 సీట్లు, 22 మంది ఎంపీలతో జగన్ గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఉండాలి. కానీ రాజకీయం చూస్తే అలా కనిపించడంలేదు. 23 సీట్లతో [more]
ఏపీలో 151 సీట్లు, 22 మంది ఎంపీలతో జగన్ గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఉండాలి. కానీ రాజకీయం చూస్తే అలా కనిపించడంలేదు. 23 సీట్లతో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబుతో జగన్ కి పెద్దగా పేచీ రావడం లేదు. ఎందుకంటే బాబు వరస జనాలకు అలవాటే కాబట్టి పట్టింపు ఉండదన్న అంచనా ఉంది. ఊహించని ఉపద్రవం పవన్ నుంచే రావడంతో వైసీపీ హై కమాండ్ కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయారు. దాంతో ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉంటారని వైసీపీ ఆశించినట్లుగా ప్రచారం ఉంది. దానికి భిన్నంగా పవన్ కల్యాణ్ పడిలేచిన కెరటంలా దూసుకువస్తున్నారు. పవన్ కల్యాణ్ పార్టీకి తాడు బొంగరం లేదనుకుని సరిపెట్టుకున్నా ఆయన వూళ్లకు వూళ్ళు తిరుగుతూ వైసీపీ మీద గట్టిగా ద్వజమెత్తుతున్నారు.
కార్నర్ చేస్తున్నారు….
పవన్ కల్యాణ్ అసలైన ప్రతిపక్ష అవతారం ఎత్తేసారు. ఏదో ఒక రోజు రోడ్డు మీదకు వస్తే ఆరు నెలల పాటు కనిపించడన్న విమర్శలకు చెక్ పెడుతూ సినిమాలు సైతం పక్కన పెట్టేసి బస్తీ మే సవాల్ అంటున్నారు. జగన్ తో తేల్చుకుంటానని రంగంలోకి దూసుకువస్తున్నారు. రాయలసీమ జిల్లాలో పవన్ టూర్ ఓ విధంగా వైసీపీకి ఇబ్బందిగా మారిందని చెప్పాలి. పవన్ కల్యాణ్ కి చేతిలో అధికారం లేదు, పెద్దగా బాధ్యత లేదు. దాంతో ఆయన ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ వైసీపీ సర్కార్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఉల్లి దిగుబడి తగ్గి దేశవ్యాప్తంగా ధరలు మిన్నంటినా కూడా జగన్ దే తప్పు అంటున్నారు. ప్రతీ ఏటా టమాటాలు శీతాకాలం సీజన్లో పంట అధికమై గిట్టుబాటు ధర రాకపోవడం జరిగేదే. దాన్ని కూడా రాధ్ధాంతం చేస్తూ రైతులను ఆదుకోరా అంటూ గర్జిస్తున్నారు. రాయలసీమ వెనకబాటుతనం కొన్ని దశాబ్దాలుగా ఉంటే దాన్ని తెచ్చి జగన్ ఖాతాలో వేస్తున్నారు. ఫ్రాక్షనిజానికి వైసీపీ కేరాఫ్ అడ్రస్ అంటున్నారు. ఇన్ని రకాలుగా పవన్ అంటున్నా ఎలా కౌంటర్ చేయాలో తెలియక వైసీపీ బాగా ఇబ్బంది పడుతోంది.
చేసిన మంచి అంతా …
పవన్ కల్యాణ్ ని చూస్తూ వదిలేయలేరు, అలాగని సీరియస్ గా తీసుకోలేరు. మొత్తానికి పవన్ కల్యాణ్ మార్క్ పాలిటిక్స్ ని ఎలా ఛేదించడం అన్నది వైసీపీకి అతి పెద్ద చిక్కు ప్రశ్నగా ఉందంటున్నారు. పవన్ కల్యాణ్ జగన్ ని టార్గెట్ చేసుకుని అనాల్సినవి అన్నీ అంటున్నారు. మత మార్పిళ్ళు జగన్ చలవేనని చెబుతున్నారు. ఏపీలో అసలు పాలన లేదని కూడా చెప్పేస్తున్నారు. మరి ఇన్ని విధాలుగా పవన్ కల్యాణ్ అంటూంటే ఆరు నేలల్లో అనేక పధకాలు ప్రవేశపెట్టిన వైసీపీకి మంచి కంటే ఎక్కడ ఈ చెడ్డ జనంలోకి పోతుందో అన్న కంగారు పట్టుకుంది.
ఒక్క ఎమ్మెల్యేతోనే…..
పవన్ కల్యాణ్ సినిమా నటుడు, పైగా యువతలో మంచి ఆకర్షణ కలిగిన నేత, బలమైన సామాజికవర్గానికి చెందిన వారు కావడం మరో విషయం. వీటికి మించి పవన్ కల్యాణ్ ఇంత ధైర్యంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని హాట్ కామెంట్స్ చేస్తున్నారంటే వెనకాల బీజేపీ ఉందేమోనన్న ఆలోచన కూడా వైసీపీలో ఉంది. దాంతో ఈ పవనాస్త్రాన్ని ఎలా ఎదుర్కోవడమో అర్ధం కావడం లేదట. చంద్రబాబు ప్రతిపక్షం అవుతారనుకుంటే పవన్ కల్యాణ్ దూకుడేంటని వైసీపీ నేతలు తలగోక్కుంటున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ కి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీని మాత్రం బాగానే ర్యాగింగ్ చేస్తున్నారు.