డౌట్ లో పడిన విశ్వసనీయత ?
రాజకీయాల్లో అయినా మరే రంగంలో అయినా విశ్వసనీయత చాలా ముఖ్యం. జనాలు ఏమీ పట్టించుకోరు అనుకుంటే అంతకంటే పొరపాటు మరోటి లేదు. ఇక అన్న చాటు తమ్ముడిగా [more]
రాజకీయాల్లో అయినా మరే రంగంలో అయినా విశ్వసనీయత చాలా ముఖ్యం. జనాలు ఏమీ పట్టించుకోరు అనుకుంటే అంతకంటే పొరపాటు మరోటి లేదు. ఇక అన్న చాటు తమ్ముడిగా [more]
రాజకీయాల్లో అయినా మరే రంగంలో అయినా విశ్వసనీయత చాలా ముఖ్యం. జనాలు ఏమీ పట్టించుకోరు అనుకుంటే అంతకంటే పొరపాటు మరోటి లేదు. ఇక అన్న చాటు తమ్ముడిగా సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2008 నాటికి ప్రజారాజ్యం పార్టీలో కూడా తన వంతు పాత్ర నిర్వహించారు. ఇక ఆయన 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని పెట్టారు. నాటి నుంచి గత ఏడేళ్ళుగా పవన్ పోతున్న రాజకీయ పోకడలు అన్నీ ఇన్నీ కావు. ఆయన పొత్తులూ స్నేహాలు అన్నీ కూడా చిన్నపిల్లలాటగానే మారిపోతున్నాయి. తాజాగా తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా సహకారం అందించకుండా పవన్ చేసిన పనితో ఆయనలోని మిత్రుడు కూడా పెద్ద సందేహంగా మారిపోయారు.
అనుమానాలు అలా…?
పవన్ కల్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి రావడానికి బీజేపీ వేసిన బిస్కట్లు ఎన్నో ఉన్నాయి. పవన్ కల్యాణ్ ని కాబోయే సీఎం అని కూడా కీర్తించాల్సి వచ్చింది. ఏపీ వరకూ ఆయనే బిగ్ బాస్ అని కూడా కమలనాధులు చెప్పుకున్నారు. ఇలా ఎన్ని చేసినా కూడా పవన్ కల్యాణ్ పూర్తిగా మెట్టు దిగలేదు, బెట్టు వీడలేదు. కేవలం ఒకే ఒక్క మీటింగుతో సరిపెట్టేశారు. ఆ తరువాత ఆయన కరోనా వచ్చిందని చెప్పి పూర్తిగా సెల్ఫ్ ఐసోలేషన్ కి పరిమితం అయ్యారు. సరే పవన్ కల్యాణ్ కి కరోనా వచ్చే లోగా కనీసం మరిన్ని మీటింగులు అయినా బీజేపీ తరఫున నిర్వహించి ఉండవచ్చు. లేదా తన ప్రకటనల ద్వారా కానీ వీడియోల ద్వారా కానీ బీజేపీ ప్రచారంలో ఇండైరెక్ట్ గా భాగం కావచ్చు. మరి ఎందుకో పవన్ కి ఇష్టం లేనట్లుగానే ఉంది, మొక్కుబడిగా ఒక సభతో నమస్కారం అనేశారు. దాంతో బీజేపీ ఇపుడు డిపాజిట్ కోల్పోయింది. దీంతో పవన్ కల్యాణ్ తమకు అసలు మిత్రుడేనా అన్న అనుమానాలు అయితే బీజేపీ నేతలలో కలుగుతున్నాయట.
నమ్మలేరా…?
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఇప్పటికే అన్ని అవకాశాలూ వాడేసుకున్నారు. ఆయన ఒక్క కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ తో తప్ప అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. రేపటి రోజున ఆయన మళ్ళీ మనసు మార్చుకుని టీడీపీతో పొత్తు అన్నా మునుపటి గ్లామర్ రాదు, జనాలు కూడా అంతలా నమ్మే సీన్ ఉండదు. ఇక టీడీపీ కూడా పవన్ కల్యాణ్ కి ఇదివరకులా రాజకీయ మర్యాదలు ఇవ్వకపోవచ్చు. ఆయన అనివార్యంగా తమతో కలిశారని భావించవచ్చు. పవన్ వస్తుతహా రాజకీయ నాయకుడు కాదు, కానీ ఆయన సినిమా ఇమేజి ని చూపించి తనకు పెద్ద పీట వేయాలని భావించడంతోనే సమస్య వస్తోంది. రాజకీయాల్లో ఆయన ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. ఇంతలోనే ఇలా అంటే చాలా ఇబ్బందే అన్న మాట అయితే ఉంది.
పొలిటికల్ జంక్షన్ లోనే….?
నిజానికి పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని మంచి పనే చేశారు అన్న వారూ ఉన్నారు. బీజేపీ కోసం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఆయన కష్టపడినట్లు అయితే కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి రాజ్య సభ ఆఫర్ అయినా ఇచ్చి ఉండేవారు. అసలు ఆ రకంగా ప్రచారం కూడా సాగింది. అయితే పవన్ కల్యాణ్ ని ఎవరు ప్రభావితం చేశారో కానీ పెద్దగా బీజేపీ తరఫున ప్రచారం చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు పవన్ కల్యాణ్ కి ఏకైక ఆప్షన్ టీడీపీ. దానికి చంద్రబాబు ఎటూ తయారుగా ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ అనుకున్న రాజకీయ లక్ష్యాలు ముఖ్యమంత్రి పదవే కాదు కీలకమైన పాత్ర ఏవీ టీడీపీతో కలిస్తే అసలు సాధ్యపడదు, ఇక పవన్ కల్యాణ్ ఇలా తడవకో పార్టీ వైపు మారుతూ ఉంటే ఆయన రాజకీయ విశ్వసనీయత మీద కూడా డౌట్లు పెద్ద ఎత్తున పెరిగిపోతాయి. మొత్తానికి పవన్ కల్యాణ్ తన సినిమా గ్లామర్ ని రాజకీయంగా బలమైన పునాదిగా మార్చుకోలేకపోయారు. అదే సమయంలో మిత్రులను ఎన్నుకునే విషయంలోనూ తడబాట్లూ పొరపాట్లూ చేస్తున్నారు. చూడాలి ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా సాగుతుందో.