బయటపడటమే బెటర్ కదా? పవన్ డెసిషన్….?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయన తన అసహనాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న తిరుపతి [more]

Update: 2021-03-26 12:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయన తన అసహనాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక తర్వాత పవన్ కల్యాణ్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఆయన పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. సొంతంగా ఎదుగుతూ పార్టీని బలోపేతం చేయాలన్నది పవన్ కల్యాణ్ లక్ష్యంగా కన్పిస్తుంది.

ఏడేళ్ల క్రితం…..

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టిన వెంటనే మోదీ గుజరాత్ కు పిలిపించుకుని మరీ మాట్లాడారు. 2014 ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కల్యాణ‌్ ను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినా ఏపీకి న్యాయం చేయకపోవడంతో పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలపై ధ్వజమెత్తారు. దీంతో వారికి దూరం పెరిగింది. 2019 ఎన్నికలలో విడిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఫలితాల తర్వాత బేషరతుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

పొత్తు పెట్టుకున్నాక…..

బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని జనసేన కార్యకార్తలే సోషల్ మీడియాలో తప్పుపట్టారు. అయినా ఆవేశంతో పవన్ కల్యాణ‌్ బీజేపీతో పొత్తుకు దిగారు. జగన్ ను కంట్రోల్ చేేయాలంటే బీజేపీతో పొత్తు అవసరమనే పవన్ కల్యాణ్ భావించారు తప్పించి, అనంతర పరిణామాలను ఆయన ఊహించలేదు. పొత్తు పెట్టుకున్నాక మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కూడా దక్కలేదు. దాదాపు పొత్తు పెట్టుకుని ఏడాది అవతున్నా, పవన్ మూడు సార్లు ఢిల్లీ వెళ్లినా వారి దర్శనం లభించలేదు. దీంతో పవన్ కల్యాణ‌్ మనస్తాపానికి గురయ్యారని చెబుతున్నారు.

విలువ లేని చోట….

విలువలేని చోట ఉండే కంటే బయటకు వెళ్లడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. దీనికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కూడా జనసేనకు ఇబ్బందిగా మారింది. పెరిగిన ధరలు కూడా మోదీపై వ్యతిరేకతను పెంచుతున్నాయి. దీంతో పవన్ కల్యాణ‌ బీజేపీతో కటీఫ్ చెబితేనే బెటర్ అని భావిస్తున్నారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా పవన్ నిర్ణయంపై ప్రభావం చూపనున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత దీనిపై పవన్ కల్యాణ‌్ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. బీజేపీ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని పవన్ కల్యాణ‌్ భావిస్తున్నారు.

Tags:    

Similar News