ఈసారి వారికే టిక్కెట్లట… పవన్ కొత్త నిర్ణయం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆయన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే దసరా నుంచి పార్టీని [more]

Update: 2020-09-28 00:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆయన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే దసరా నుంచి పార్టీని పూర్తిగా యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సీనియర్ నేతలతో పవన్ కల్యాణ్ తరచూ సమావేశమవుతున్నారు. నియోజకవర్గాల వారీగా నేతల పేర్లను కూడా తీసుకుని పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

దసరా నుంచి….

దసరా నుంచి పార్టీ పై పూర్తిగా దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇందుకోసం డైలీ డెయిరీ సిద్ధం చేసుకున్నట్లు కూడా చెబుతున్నారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత నియోజకవర్గాల వారీగా పవన్ కల్యాణ్ పార్టీపై దృష్టి సారించలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో హడావిడిగా టిక్కెట్లను కేటాయించడం తప్ప నియోజకవర్గంలో నేతలు ఎవరో కూడా పవన్ కల్యాణ్ కు తెలియదు.

ఇన్ ఛార్జులను నియమించేందుకు….

రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ ఛార్జులను నియమించేందుకు పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఫాం హౌస్ లో కసరత్తులు ప్రారంభమయనట్లు తెలుస్తోంది. గత ఐదు నెలలుగా హైదరాబాద్ కే పరిమితమయిన పవన్ కల్యాణ‌్ త్వరలోనే ఏపీకి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈలోగా నియోజకవర్గాల వారీగా ఒక ఒపీనియన్ కు రావాలని భావించి కసరత్తులు చేస్తున్నారు.

బలమైన నియోజకవర్గాల్లో….

తనకు ప్రధానంగా బలం ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని, తొలుత అక్కడ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. బీజేపీతో ఎటూ పొత్తు ఉంటుంది కాబట్టి రానున్న ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను దింపేందుకు, ఇప్పటి నుంచే వారికి ఇన్ ఛార్జి పదవిని అప్పగించాలని నిర్ణయించారు. ఎవరైతే ఇన్ ఛార్జిగా ఉన్నారో వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనున్నారు. ఈ నాలుగేళ్లలో వారి పనితీరు, పార్టీ పట్ల వారి నిబద్ధత, అంకిత భావం, వారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకపోతేనే టిక్కెట్ ఇచ్చేలా ముందుగానే వారికి వపన్ కల్యాణ్ చెప్పనున్నట్లు తెలిసింది. వచ్చే దసరా నుంచి ప్రారంభమై ఫిబ్రవరి నాటికి ఇన్ ఛార్జిల నియామకం పూర్తికావాలన్నది పవన్ యోచన.

Tags:    

Similar News