కలసి రమ్మంటున్నాడే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత యాక్టివ్ అయ్యారు. ఆయన విజయవాడలోనే ఉంటూ వివిధ జిల్లాల పార్టీ కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నారు. జనసేనను [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత యాక్టివ్ అయ్యారు. ఆయన విజయవాడలోనే ఉంటూ వివిధ జిల్లాల పార్టీ కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నారు. జనసేనను [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత యాక్టివ్ అయ్యారు. ఆయన విజయవాడలోనే ఉంటూ వివిధ జిల్లాల పార్టీ కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నారు. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 25 ఏళ్ల పాటు జనసేన ఉంటుందని భరోసా ఇచ్చిన పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒంటరిగా వెళితే విజయంపై సాధ్యాసాధ్యాలను కూడా పవన్ కల్యాణ్ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కార్యకర్తల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు.
సర్కార్ పై పోరాటానికి….
ఇక వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ పోరాటాలను ప్రారంభించారు. జగన్ వంద రోజుల పాలనపై కూడా పవన్ కల్యాణ్ గతంలో ఛార్జిషీట్ విడుదల చేశారు. ఇక తాజాగా నవంబరు 3వ తేదీన విశాఖలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. విశాఖలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం జిల్లాల వారీగా సన్నాహక కార్యక్రమాలనుకూడా నిర్వహించారు. గతంలో రాజమండ్రిపై జరిగిన కవాతు సక్సెస్ కావడంతో ఆ రేంజ్ లో చేయాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉంది.
వామపక్షాలు దూరమయినా….
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీచేయలేదు. వామపక్షాలను, బీఎస్పీతో కలసి ఆయన పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. పవన్ తో చేతులు కలిపిన వామపక్షాలు సయితం సింగిల్ సీటును సాధించలేకపోయాయి. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి వామపక్షాలు తమ ఆలోచనను మార్చుకున్నట్లు కనపడుతుంది. ఏపీలో తిరిగి బలపడాలంటే సొంతంగానే పోరాడాలని నిర్ణయానికి వచ్చాయి. ఈ నాలుగు నెలల్లో వామపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగిల్ గానే ఆందోళన నిర్వహించాయి తప్ప పవన్ కల్యాణ్ తో కలసి నడవలేదు.
మద్దతు కోరితే….
కానీ ఇసుక కొరతపై విశాఖలో నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనకు పవన్ కల్యాణ్ ఇతర పార్టీల మద్దతు కోరుతుండటం విశేషం. ప్రభుత్వం మెడలు వంచాలంటే అందరూ కలసి పోరాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. అంటే ఒంటరిగా తాను ఉద్యమాలు చేయలేననే పవన్ కల్యాణ్ ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నట్లేనని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసి తన సత్తా చాటుకోవాలని, అందరితోకలసి వెళ్లి దెబ్బతిన్నా ఇంకా పవన్ కల్యాణ్ కు జ్ఞానోదయం కలగలేదా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ విశాఖ నిరసన ప్రదర్శనను సీరియస్ గానే తీసుకుంది. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.