పవన్ తో టచ్ మి నాట్ గానేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, బీజేపీ నేతలకు మధ్య దూరం పెరిగినట్లే కన్పిస్తుంది. ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వారి మధ్య మరింత [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, బీజేపీ నేతలకు మధ్య దూరం పెరిగినట్లే కన్పిస్తుంది. ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వారి మధ్య మరింత [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, బీజేపీ నేతలకు మధ్య దూరం పెరిగినట్లే కన్పిస్తుంది. ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వారి మధ్య మరింత దూరం పెంచింది. జనసేనపై ఎన్నో ఆశలుపెట్టుకున్న బీజేపీకి తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. జనసేన ఓటు బ్యాంకు తమకు షిఫ్ట్ కాలేదన్న ఆగ్రహం బీజేపీ నేతల్లో ఉంది. టీడీపీకే ఆ ఓట్లు పడటంతో భవిష్యత్ రాజకీయం ఎలా నడపాలన్న దానిపై ఇటీవల సీనియర్ నేతలు మంతనాలు జరిపినట్లు తెలిసింది.
రెండు జిల్లాల్లోనే….?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లక్షలాది మంది అభిమానులున్నారు. అది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అయితే వరసగా జరిగిన ఎన్నికల్లో జనసేన కొన్ని ప్రాంతాలకే పరిమితమయింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తప్పించి జనసేన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. జనసేన అధినేత తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసినా ఫలితాలు చూసి బీజేపీ నేతలే అవాక్కవ్వాల్సి వచ్చింది.
ఓట్లు టర్న్ కాకపోవడంతో….
ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అభిమానులు ఓట్లతో పాటు కాపు సామాజికవర్గం ఓట్లు కూడా అండగా ఉంటాయని బీజేపీ భ్రమించింది. కేవలం రెండు జిల్లాలకే పరిమితమయిన పవన్ కల్యాణ్ కు అనవసర ప్రాధాన్యమిచ్చమేమోనన్న అనుమానం బీజేపీ నేతల్లో బయలుదేరింది. బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఓట్లు తమ వైపు టర్న్ కాకపోవడంతో బీజేపీ అగ్రనేతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
విలీనం చేయాలని మరోసారి…?
దీంతో కేంద్రనాయకత్వం జనసేనను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను మరోసారి తెరపైకి తేనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ ఈ ప్రతిపాదన తెచ్చినా పవన్ కల్యాణ్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే వరస ఓటములతో పవన్ కల్యాణ్ సయితం పార్టీని నడపేది ఎలా? అన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. బీజేపీలో విలీనం చేస్తే అసలుకే ముప్పు ఏర్పడుతుందని సన్నిహితులు సలహా ఇస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే గౌరవప్రదమైన స్థానాలు సాధించగలమని చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీకి, పవన్ కల్యాణ్ కు మధ్య దూరం పెరిగిన మాట వాస్తవం.