పవన్ ఏదో చేస్తాడనుకుంటే?
నాయకుడన్నాక నమ్మకం కల్గించాలి. ముఖ్యంగా క్యాడర్ లో విశ్వాసం కల్పించాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమనుకుంటున్నారు? జనంలో తిరగకపోయినా తనను ఆదరిస్తారన్న నమ్మకమా? ఎన్నికలకు ముందు [more]
నాయకుడన్నాక నమ్మకం కల్గించాలి. ముఖ్యంగా క్యాడర్ లో విశ్వాసం కల్పించాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమనుకుంటున్నారు? జనంలో తిరగకపోయినా తనను ఆదరిస్తారన్న నమ్మకమా? ఎన్నికలకు ముందు [more]
నాయకుడన్నాక నమ్మకం కల్గించాలి. ముఖ్యంగా క్యాడర్ లో విశ్వాసం కల్పించాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమనుకుంటున్నారు? జనంలో తిరగకపోయినా తనను ఆదరిస్తారన్న నమ్మకమా? ఎన్నికలకు ముందు ఏడాది పాటు పర్యటిస్తే సరిపోతుందన్న అలసత్వామా? అన్నది జనసైనికుల్లోనే చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో పెద్దగా తిరిగింది లేదు. కేవలం 2019 ఎన్నికల ప్రచారంలో మాత్రమే ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అంతకు ముందు ఉద్దానం సమస్య, రైతు సమస్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. అయినా ప్రజలు తన పార్టీని ఆదరించలేదు. కేవలం ఒక్క స్థానానికే పరిమితం చేశారు.
పర్యటనలు లేకుండానే?
ఎన్నికలలో ఓటమి తర్వాత పవన్ కల్యాణ్ పెద్దగా ప్రజల్లో పర్యటించింది లేదు. సమస్యలపై స్పందించింది లేదు. తన బలం తనకు తెలిసొచ్చిందో ఏమో వెను వెంటనే బీజేపీతో పొత్తుకు దిగిపోయారు. బీజేపీతో పొత్తు ఇప్పటికిప్పుడు అవసరం లేకపోయినా అనాలోచిత నిర్ణయంతో దానికి దగ్గరయ్యారు. ఫలితంగా ఇప్పుడు ప్రజా సమస్యలపై కూడా స్పందించే అవకాశం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి వాటిపై స్పందించాలనుకున్నా బీజేపీతో పొత్తు అడ్డంకిగా మారింది.
మున్సిపల్ ఎన్నికల్లోనూ…
ఇక తాను ప్రజల్లోకి వస్తే సెక్యూరిటీ సమస్య అని పవన్ కల్యాణ్ పదే పేద చెబుతుంటారు. అభిమానులు తన పర్యటనల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారన్నది ఆయన అనుమానం. అందుకే దాదాపు జనంలో పర్యటనలకు పవన్ కల్యాణ్ దూరంగాఉంటున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొనకపోవడానికి కారణమిదే. అయినా అనేక చోట్ల జనసైనికులు తమ పార్టీని విజయం వైపు నడిపేందుకు కృషి చేశారు. అప్పుడప్పుడు కన్పించినంత మాత్రాన ప్రజలు తమ వాడిగా చేసుకోరు.
మరోవైపు పార్టీ అధినేతలందరూ…..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా కొంత తగ్గిన తర్వాత పర్యటనలు ప్రారంభించారు. సమస్యలపై స్పందిస్తున్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సయితం జనంలోకి వెళుతున్నాయి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం షూటింగ్ లతోనే బిజీగా ఉన్నారు. సినిమాలు పూర్తయిన తర్వాతనే పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చే అవకాశముంది. అది కూడా ఎంపిక చేసుకున్న కొన్ని ప్రాంతాల్లోనే పర్యటిస్తారట. మొత్తం మీద పవన్ కల్యాణ్ జనాలకు దూరంగా ఉండటం వల్లనే క్షేత్రస్థాయిలో జనసేన ఇప్పటికీ బల పడలేకపోతుంది.