దీపం ఉండగానే.. చక్క బెట్టుకోవాలనేనా?

మహారాష్ట్ర రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలకు కొదవలేదు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలు వారసత్వ రాజకీయాలకు ఎప్పుడో తెరదీశాయి. మొన్నటి వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని శివసేన [more]

Update: 2021-01-04 17:30 GMT

మహారాష్ట్ర రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలకు కొదవలేదు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలు వారసత్వ రాజకీయాలకు ఎప్పుడో తెరదీశాయి. మొన్నటి వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని శివసేన మొన్నటి ఎన్నికల్లో మాత్రం నేరుగా బరిలోకి దిగారు. ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయి ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇక శరద్ పవార్ కుటుంబంలోనూ అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు.

పవార్ కుటుంబంలో…..

శరద్ పవర్ సోదరుడు అజిత్ పవార్ ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పటికే సుప్రియా సూలె మూడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. శరద్ పవార్ కు కుమారులు లేరు. ఇక అజిత్ పవార్ కుమారుడు పార్థి పవార్ మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను మరోసారి పోటీ చేయించాలని పవార్ కుటుంబం నిర్ణయించింది.

తాజాగా పార్థీ పవార్ ను….

పార్థీ పవార్ ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. యువజన విభాగం బాధ్యతలను చూస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో పార్థీ పవార్ ను పోటీ చేయంచాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనిపై శరద్ పవార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బరిలోకి దించి పార్థీ పవార్ ను శాసనసభలోకి అడుగుపెట్టించాలన్నది పవార్ ప్రయత్నంగా కన్పిస్తుంది.

ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని…..

కొల్హాపూర్ జిల్లా మంగల్ వెడా అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటకే మహారాష్ట్ర రాజకీయాల్లో యువనేతలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఇప్పటికే కీలక భూమిక ప్రభుత్వంలో పోషిస్తున్నారు. అందుకే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ తన కుమారుడు పార్థ్ పవార్ ను బరిలోకి దించి మూడేళ్లలో రాజకీయంగా రాటుదేలేలా చూడాలన్నేది ఆయన ఆకాంక్ష. మొత్తం మీద పార్థీ పవార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడంపై ఎన్సీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News