జగన్ ఒక్క హామీ ఇస్తే చాలు.. ఆ ఫ్యామిలీ సైకిల్ దిగేస్తుందట
రాజకీయాల్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసుకున్నా.. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. అవకాశం-అవసరం అనే రెండు విశాల విధానాలనే రాజకీయాలు నాయకులు నమ్ముతారు. [more]
రాజకీయాల్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసుకున్నా.. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. అవకాశం-అవసరం అనే రెండు విశాల విధానాలనే రాజకీయాలు నాయకులు నమ్ముతారు. [more]
రాజకీయాల్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసుకున్నా.. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. అవకాశం-అవసరం అనే రెండు విశాల విధానాలనే రాజకీయాలు నాయకులు నమ్ముతారు. దాని ప్రాతిపదికనే వారు అడుగులు వేస్తారు. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. గతంలోనూ జరిగింది. ఇప్పు డు కూడా జరుగుతోంది. ఇకపై కూడా జరుగుతుంది. అనే ధోరణిలో నాయకులు వ్యవహరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన వారి నుంచి ఇటీవల నాయకుల వరకు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పనబాక కృష్ణయ్య, లక్ష్మిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఎంపీగా గెలిచి….
చిత్తూరు జిల్లా తిరుపతి ఎంపీ స్థానం నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పనబాక లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. 2014కు ముందు రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో ఆమె రాజకీయంగా ఒడిదుడుకు పరిస్థితి ఎదుర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండగా ఆమె ఓ వెలుగు వెలిగారు. నెల్లూరు రిజర్వ్‌డ్ స్థానంగా ఉన్నప్పుడు అక్కడ నుంచి పలుసార్లు ఎంపీగా గెలిచిన ఆమె 2009 ఎన్నికల్లో నెల్లూరు జనరల్ కావడంతో బాపట్ల నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలోనూ మంత్రిగా చక్రం తిప్పారు. అయితే, రాష్ట్ర విభజనకు వ్యతిరేకమే అయినా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించలేక పార్టీ దెబ్బతిన్నప్ప టికీ మిగిలిన నేతల మాదిరిగా వెంటనే బయటకు రాకుండా అక్కడే ఉన్నారు.
మనసంతా వైసీపీయేనట…..
2014 ఎన్నికల్లోనూ పనబాక దంపతులు కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇక, 2019 ఎన్నికలకు ముందు మాత్రం ఆమె తన భర్తతో కలిసి టీడీపీ పంచన చేరిపోయారు. ఈ క్రమంలోనే తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె అస్సలు ప్రత్యక్ష రాజకీయాల్లో కనపడడం లేదు. టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి కూడా టీడీపీలో నే ఉన్నా.. మనసంతా మాత్రం వైసీపీపైనే ఉంది. టీడీపీ పుంజుకోక పోవడం, చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే నాయకుడు కూడా లేకపోవడం కారణంగా పనబాక మనసంతా ఇప్పుడు వైసీపీపైనే ఉందట.
ఏదో ఒకటి ఇస్తే చాలట….
అయితే, జగన్ నుంచి ఏదైనా గట్టి హామీ లభిస్తే వెంటనే పార్టీ మారేందుకు ఈ ఫ్యామిలీ రెడీగా ఉంది. కానీ, ఇప్పుడు మండలి రద్దు చేస్తూ జగనే తీర్మానం చేశారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి కూడా అవకాశం లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఏదైనా మరో మార్గం చూపించినా ఈ కుటుంబం జగన్ కు జై కొట్టేందుకు రెడీ అవుతోంది. ఇదే జరిగితే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఇది పెద్ద షాకే. ఇప్పటికే మాజీ ఎంపీ శివప్రసాద్ మరణంతో చిత్తూరు ఎంపీ సీటుకే సరైన అభ్యర్థి లేకుండా పోయారు. ఇప్పుడు పనబాక కూడా పార్టీ వీడితో తిరుపతిలో కూడా బాబు కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే.