జగన్ గుడ్ లుక్స్ లో ఆ యువనేత…? త్వరలోనే?

జగన్ తనకు నమ్మకంగా ఉన్నవారిని, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇస్తారు. ఏమాత్రం తలెగరేసినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతారు. ఇప్పుడు జగన్ గుడ్ లుక్స్ లో [more]

Update: 2021-05-09 15:30 GMT

జగన్ తనకు నమ్మకంగా ఉన్నవారిని, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇస్తారు. ఏమాత్రం తలెగరేసినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతారు. ఇప్పుడు జగన్ గుడ్ లుక్స్ లో వైసీపీ కీలక నేత ఒకరు పడటం పార్టీలో చర్చనీయాంశమైంది. నెల్లూరుజిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన నేదురుమిల్లి రామకుమార్ రెడ్డికి పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ చేశారంటున్నారు. త్వరలోనే రామ్ కుమార్ రెడ్డికి పదవీ యోగం పట్టే ఛాన్సుంది.

మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా….

నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు, వైఎస్ హయాంలోనూ రాజ్యలక్ష్మి మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. నిజానికి 2019 ఎన్నికల్లో రామ్ కుమార్ రెడ్డికే వెంకటగిరి నియోజకవర్గం టిక్కెట్ దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరడం, ఆయనకు వేరే నియోజకవర్గాన్ని కేటాయించలేకపోవడంతో వెంకటగిరి టిక్కెట్ ను ఆయనకు ఇచ్చారు.

పార్టీని నమ్ముకుని….

దీంతో వెంకటగిరిలో పోటీ చేయాలనుకున్న నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. అయినా రెండేళ్లుగా పార్టీని నమ్ముకునే ఉన్నారు. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డికి స్థానిక వైసీపీ నేతలకు బలపడటం లేదు. ఆనం రామనారాయణరెడ్డిని ఒక్క కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. మంత్రి అనిల్ కుమార్, మేకపాటి గౌతం రెడ్డిలు ఆనం వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. దీంతో వెంకటగిరి నుంచే మరో నేతకు ఛాన్స్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారంటున్నారు.

ఆయనను ప్రమోట్ చేస్తూ….

ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈనేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో మంత్రులు, సీనియర్ నేతలందరూ నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి నే ప్రమోట్ చేస్తున్నారు. ఆయన ఇంట్లోనే సమావేశాలు నిర్వహించారు. జగన్ సూచన మేరకే ఇది జరిగిందంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తేలిన తర్వాత నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి కి కీలక పదవి ఇచ్చే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News