వారంతా దూరమయింది అందుకేనటగా…!!

రాష్ట్రంలో అతిపెద్దపార్టీగా 2014లో అవ‌త‌రించిన టీడీపీ.. ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసుకుని ఐదేళ్లపాటు పాలించింది. ఈక్రమంలోనే బ‌ల‌మైన బీసీ ఓటు బ్యాంకుతో పాటు.. అన్ని సామాజిక వ‌ర్గాల‌ను [more]

Update: 2019-07-05 05:00 GMT

రాష్ట్రంలో అతిపెద్దపార్టీగా 2014లో అవ‌త‌రించిన టీడీపీ.. ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసుకుని ఐదేళ్లపాటు పాలించింది. ఈక్రమంలోనే బ‌ల‌మైన బీసీ ఓటు బ్యాంకుతో పాటు.. అన్ని సామాజిక వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకొని క‌నీసం మ‌రో 20 ఏళ్లపాటు అధికారంలోనే ఉండాల‌ని ఆశ‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప్రతిసామాజిక వ‌ర్గానికీ ఓ కార్పొరేష‌న్ ఏర్పాటు, నిధుల కేటాయింపు వంటి అంశాల‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఇక‌, ఉభ‌య గోదావ‌రులు స‌హా కోస్తాలో బ‌లంగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గాన్ని కూడా త‌న‌వైపు తిప్పుకొనేందుకు అనేక వ్యూహ ప్రతివ్యూహాల‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు సాగారు. అయితే, ఆయ‌న వేసిన అడుగులు కాపుల‌ను మెప్పించ‌లేక పోయాయి.

మూడో స్థానంలోనే….

దీంతో ఎన్నిక‌ల్లో కాపులు త‌మ త‌ఢాఖా చూపించారు. టీడీపీని ప‌క్కన పెట్టారు. జ‌న‌సేన ఎఫెక్ట్ భారీగా త‌గిలింది. సామాజిక వ‌ర్గంపై ఉన్న ప్రేమ‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీవైపు కాపులు మొగ్గు చూపారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కు కూడా ఫిదా అయ్యారు. దీంతో చంద్రబాబునాయుడు మూడో స్థానానికే ప‌రిమిత‌మైంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు టీడీపీలో అంత‌ర్మధ‌నం ప్రారంభ‌మైంది. కాపులు ఎందుకు దూర‌మ‌య్యారంటూ.. పార్టీ అధినేత పెద్ద ఎత్తున స‌మీక్ష ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనేక విష‌యాలు వెలుగు చూశాయి. జనసేన పార్టీ ఒంటరి పోటీ టీడీపీని నష్టపర్చిందని, ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. వైసీపీ నుంచి తమను తీసుకోవడం ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపిందేమోనని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనుమానం వ్యక్తం చేశారు.

ముద్రగడ ఎఫెక్ట్ కూడా….

మొత్తానికి పార్టీకి బ‌లంగా ఉంటార‌ని భావించిన కాపు వ‌ర్గం దూరం కావ‌డం వెనుక ప్రధాన రీజ‌న్ మాత్రం చంద్రబాబు నాయుడు 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ సామాజిక వ‌ర్గానికి ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ హామీని అమ‌లు చేయ‌లేక పోవ‌డ‌మే క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో కాపు ఉద్యమ నేత ముద్రగ‌డ ప‌ద్మనాభంను కూడా అడుగ‌డుగునా అవ‌మాన ప‌రిచే రీతిలో త‌న పార్టీ నాయ‌కుల‌తో వ్యాఖ్యలు చేయించ‌డం, కేంద్రం ఒప్పుకోద‌ని తెలిసి కూడా రాష్ట్ర అసెంబ్లీలో ఏక ప‌క్షంగా తీర్మానాన్ని ఆమోదించుకుని, త‌న‌త‌ప్పు ఏమీలేద‌ని చెప్పుకొనేందుకు గోడ‌మీది పిల్లి వాటంగా చంద్రబాబు వ్యవ‌హ‌రించ‌డాన్ని కాపులు చూస్తూ ఊరుకోలేక పోయారు.

రిజర్వేషన్ల విషయమూ…..

అదే స‌మ‌యంలో కేంద్రం ప్రక‌టించిన ఈడ‌బ్ల్యుఎస్ రిజ‌ర్వేష‌న్ కోటా 10%లో త‌మ‌కు 5% ఇచ్చినా..దీనికి సంబంధించిన పూర్తిస్థాయి గైడ్ లైన్స్ ఇవ్వక‌పోవ‌డం, కాపు వ‌ర్గానికి అటు మంత్రి వ‌ర్గంలోనూ ఇటు పార్టీలోనూ ఆశించిన మేర‌కు చంద్రబాబునాయుడు పదవులు ఇవ్వక‌పోవ‌డం వంటి ప్రధాన కార‌ణాలను కాపు నాయ‌కులు ఆత్మశోధ‌న చేసుకుంటున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఇలా గ‌డిచినా.. రాబోయే రోజుల్లోనైనా.. కాపులు స‌హా అన్ని వ‌ర్గాల‌ను చేరువ చేసుకునేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది.

Tags:    

Similar News