బాబు ఆ ధైర్యం చేస్తే మాత్రం..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. జూనియర్లకు ఎలాగూ మాట్లాడే ఛాన్స్ దక్కడం లేదు. అయితే, సీనియర్లు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ.. చాలా మటుకు [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. జూనియర్లకు ఎలాగూ మాట్లాడే ఛాన్స్ దక్కడం లేదు. అయితే, సీనియర్లు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ.. చాలా మటుకు [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. జూనియర్లకు ఎలాగూ మాట్లాడే ఛాన్స్ దక్కడం లేదు. అయితే, సీనియర్లు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ.. చాలా మటుకు మౌనం పాటిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు మాటలను కూడా వారు లెక్కపెట్టడం లేదు. బాబే సాక్షాత్తూ ఇసుక దీక్షకు కూర్చుంటే.. మొహం చాటేసిన నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీలో ఈ తరహా పరిస్థితి బహుశా గతంలో ఎప్పుడూ చూడలేదని పార్టీ అభిమానులు చెబుతున్నారు. మరి ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది? ఏ కారణంగా పార్టీ ఇప్పుడు ఇంటా బయటా కూడా ఎదురీత ఈదుతోంది? పోయేవారెవరో.. ఉండే వారెవరో కూడా తెలియని పరిస్థితికి కారణమేంటి ?
లోకేష్ చెప్పిన సూచనలనే…..
ఇప్పుడు అందరి ఆలోచనా కూడా దీనిపైనే ఉంది. పార్టీలో కీలక నాయకులు ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులు ఈ విషయంపై చర్చిస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడం వెనుక కీలకమైన కారణాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ కారణాల విషయంలో ఎవరినీ బాధ్యులను చేయక పోవడం ఒక రీజన్. అదే సమయంలో కొందరు సీనియర్లు పార్టీ కోసం ఎన్నికల సమయంలో కొన్ని సూచనలు చేశారు అయితే, చంద్రబాబు వాటిని పక్కన పెట్టి.. కేవలం తన కుమారుడు లోకేష్, ఆయన తరపున ఉండే నాయకులు చెప్పిన సూచనలు పాటించారనేది పెద్ద ఎత్తున సీనియర్లు చెప్పుకొంటున్న మాటలు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని…..
అయితే, దీనికి కాలం చెల్లిందని అనుకుంటున్నా.. ఇప్పుడు పార్టీలో కొత్త కార్యానిర్వాహక అధ్యక్ష పదవిని తీసుకు వస్తున్నారు. దీనికి ఇప్పటికే కసరత్తు పూర్తయిపోయింది. సహజంగానే ఈ పదవిని ఎవరిని ఉద్దే శించి తెరమీదికి తెచ్చారో తెలుస్తూనే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పుంజుకునేలా చేయడంలో యువతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఈ క్రమంలోనే తన కుమారుడు లోకేష్‌ను ఈ పదవి లో కూర్చోబెట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నారు అయితే, ఇప్పటికే ప్రజల్లో తనను తాను నిరూపించు కోలేక పోయిన లోకేష్‌పై పార్టీలో సీనియర్లు పెద్దగా తలాడించడం లేదు.
ఒక్కొక్కరుగా వెళ్లిపోతూ……
పైగా ఇటీవల ఎన్నికల్లో అంతా లోకేషే అయి వ్యవహరించాడు. చివరకు తాను ఎమ్మెల్యేగా గట్టెక్కలేకపోయాడు. దీంతో ఆయన వ్యూహం ఎన్నికల్లో పనికిరాదనే విషయం తెలిసిపోయింది. ఈ రెండు కీలక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండానే చంద్రబాబు కార్యానిర్వాహక అధ్యక్షుడిగా తన కుమారుడికి పగ్గాలు అప్పగించాలని చూడడం ఏమేరకు సమంజసం అని సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో అధినేతకు కూడా దూరంగా ఉంటున్నారు. వారసత్వ రాజకీయాలను కాదనలేని వారు కూడా ఇటీవల ఎన్నికల్లో లోకేష్ పెర్ఫార్మెన్స్ చూసి మొహం చాటేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వ్యూహం వేస్తారో ? చూడాలి.