అమ్మను చూసైనా నేర్చుకోరా నాయనా?
కుతూహులమ్మ దశాబ్దకాలాల పాటు చిత్తూరు రాజకీయాల్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రస్థాయి నేతగా కూడా ఎదిగారు. వయసు మీద పడటం, ప్రస్తుత రాజకీయాల్లో చురుగ్గా తిరగలేకపోవడంతో కుతూహలమ్మ [more]
కుతూహులమ్మ దశాబ్దకాలాల పాటు చిత్తూరు రాజకీయాల్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రస్థాయి నేతగా కూడా ఎదిగారు. వయసు మీద పడటం, ప్రస్తుత రాజకీయాల్లో చురుగ్గా తిరగలేకపోవడంతో కుతూహలమ్మ [more]
కుతూహులమ్మ దశాబ్దకాలాల పాటు చిత్తూరు రాజకీయాల్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రస్థాయి నేతగా కూడా ఎదిగారు. వయసు మీద పడటం, ప్రస్తుత రాజకీయాల్లో చురుగ్గా తిరగలేకపోవడంతో కుతూహలమ్మ రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు. తన వారసత్వాన్ని రాజకీయాల్లో కుతూహులమ్మ చూడాలనుకున్నారు. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. దానికి కారణం కుమారుడి నిర్వాకమే.
ఐదుసార్లు గెలిచిన నేపథ్యం…..
కుతూహలమ్మ సీనియర్ నేత. ఐదుసార్లు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. వేపంజేరి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందారు. గంగాధర నెల్లూరు నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి కుతూహలమ్మ గెలుపొందారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో కుతూహులమ్మ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వరస ఓటములు ఆ కుటుంబానికి చుట్టుముడుతున్నాయి.
కుమారుడికి ఇవ్వాలంటూ….
కుతూహులమ్మ కుమారుడు హరికృష్ణను రాజకీయంగా తన వారసుడిగా తీర్చిదిద్దాలనుకున్నారు. 2019లో గంగాధర నెల్లూరు నియోజవకర్గం టిక్కెట్ ను కుతూహలమ్మ తన కుమారుడికి ఇవ్వాలని చంద్రబాబును కోరారు. చంద్రబాబు చాలా రోజులు అంగీకరించలేదు. చివరకు కుతూహలమ్మ వత్తిడితో హరికృష్ణకు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. అయితే ఆయన నారాయణస్వామి చేతిలో ఓటమి పాలయ్యారు.
పూర్తిగా దూరంగా…..
అప్పటి నుంచి నియోజకవర్గాన్ని హరికృష్ణ పట్టించుకోవడం లేదు. నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఉన్నా పార్టీని కూడా పక్కన పెట్టారు. కరోనా సమయంలోనూ నియోజకవర్గానికి ముఖం చాటేశారు. హరికృష్ణ ఒకరున్నారని నియోజకవర్గ ప్రజలు మర్చిపోయే పరిస్థిితి తలెత్తింది. కుతూహులమ్మ ఎంత చెబుతున్నా హరికృష్ణ మాత్రం నియోకవర్గానికి వెళ్లడం లేదు. ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. తల్లి రాజకీయాల్లో పడిన కష్టంలో ఒక్క శాతం కూడా హరికృష్ణ పడటం లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.