వైసీపీలో ఆయ‌న బ‌ల‌వుతున్నాడే.. ప్రకాశంలో హాట్ టాపిక్‌

బాచిన కృష్ణ చైత‌న్య. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ యువ నాయ‌కుడు. ఆయ‌న ప‌రిస్థితి అత్యంత గంద‌ర‌గోళంగా ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న దూసుకుపోవాల‌ని ప్రయ‌త్నిస్తున్నా పార్టీలో [more]

Update: 2020-12-10 00:30 GMT

బాచిన కృష్ణ చైత‌న్య. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ యువ నాయ‌కుడు. ఆయ‌న ప‌రిస్థితి అత్యంత గంద‌ర‌గోళంగా ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న దూసుకుపోవాల‌ని ప్రయ‌త్నిస్తున్నా పార్టీలో సీనియ‌ర్ల నుంచి నువ్వు ఆగు..! అని ఆదేశాలు అందుతున్నాయి. వాస్తవానికి సీఎం జ‌గ‌న్ నుంచి కూడా కృష్ణచైత‌న్యకు అభ‌యం ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో నీ ప‌ని నువ్వు చేసుకో..! అని జ‌గ‌న్ స్వయంగా కృష్ణ చైత‌న్యకు సూచించార‌న్నది వాస్తవం. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో బాచిన ఫ్యామిలీకి విలువ‌లు పాటించే రాజ‌కీయ నేత‌లుగా మంచి పేరుంది.

ఇన్ ఛార్జి ఇచ్చినా…..

గ‌త ఎన్నిక‌ల్లో గ‌ర‌ట‌య్య ఓట‌మి త‌ర్వాత జ‌గ‌న్ ఆయ‌న కుమారుడు కృష్ణ చైత‌న్యకే నియోజ‌క ఇన్‌చార్జ్ ప‌గ్గాలు అప్పగించారు. తండ్రి బ‌ల‌మైన రాజ‌కీయ వార‌స‌త్వం త‌న‌కు బాగా ఉప యోగ‌ప‌డుతుంద‌ని కృష్ణచైత‌న్య భావించారు. అయితే ఇప్పుడు అద్దంకిలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి, మాజీ ఎంపీ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కృష్ణ చైత‌న్య దూకుడుకు అడ్డు ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. అద్దంకిలో వైసీపీ మాజీ నాయ‌కుడు, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌విని తిరిగి వైసీపీలోకి తీసుకువ‌చ్చేందుకు ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలోనే చైత‌న్యను డౌన్ చేసే తెర‌చాటు కార్యక్రమం న‌డుస్తోంద‌ని వారు ఆరోపిస్తున్నారు.

అందుకే పక్కన పెట్టి….

రాజకీయాల్లో గ‌ర‌ట‌య్య చ‌రిత్రను ప‌రిశీలిస్తే.. ఆయ‌న తిన‌రు.. ఎవ‌రినీ తిన‌నివ్వరు అనే పేరుంది. ఇప్పు డు ఇదే కొన‌సాగితే.. త‌మ‌కు ఇబ్బంది అనే భావ‌న జిల్లా వైసీపీలో ఇద్దరు, ముగ్గురు నేత‌ల్లో ఉంద‌ట‌. ఈ క్రమంలోనే ఇప్పుడున్న రాజ‌కీయాల‌కు గ‌ర‌ట‌య్య ఫ్యామిలీ ప‌నికి రాద‌ని కూడా వీరు అంత‌ర్గతంగా ప్రచారం చేస్తున్నారు. మ‌రోవైపు వైవి. సుబ్బారెడ్డికి అద్దంకి సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఆయ‌న వ‌ర్గంతో పాటు రెడ్డి వ‌ర్గం కూడా ఇక్క‌డ బ‌లంగా ఉంది. వీరంతా కృష్ణ చైత‌న్యను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న ఆ వ‌ర్గంలో ఉంది.

ఇద్దరూ కలసి….

చివ‌ర‌కు చిన్న చిన్న ప‌ద‌వులు, ప‌నుల విష‌యంలో కూడా ఓ వైపు వైవి. సుబ్బారెడ్డి ఫ్యామిలీ, మ‌రో వైపు జిల్లా మంత్రిగా ఉన్న బాలినేని వేలు పెడుతుండ‌డం, ఇక ఇక్కడ క‌ర‌ణం ఫ్యామిలీకి కూడా బ‌ల‌మైన వ‌ర్గం ఉండ‌డం, వాళ్లు వైసీపీలో ఉండ‌డంతో పాటు పార్టీ అధిష్టానం అండ‌దండ‌లు పుష్కలంగా ఉండడంతో క‌ర‌ణం వెంక‌టేష్ కూడా అద్దంకి వైసీపీ రాజ‌కీయాల్లో వేలు పెట్టి త‌న వ‌ర్గాన్ని బ‌లోపేతం చేసుకుంటున్నారు. ఇక క‌ర‌ణంను అటు సుబ్బారెడ్డి, ఇటు మంత్రి బాలినేని ఇద్దరూ కూడా ప్రోత్సహిస్తోన్న ప‌రిస్థితి.

సైడ్ అవ్వాల్సిందే….

అద్దంకిలో ప‌రిణామ‌లు బాచిన కృష్ణ చైత‌న్యకు ఏ మాత్రం అనుకూలంగా లేవు. చీరాల పంచాయితీ తేలి క‌ర‌ణం ఫ్యామిలీ ఇక్కడ‌కు వ‌చ్చినా కృష్ణ చైత‌న్య ఆట‌లో సైడ్ అవ్వాల్సిందే. ఒక‌వేళ వైసీపీ ఆప‌రేష‌న్‌లో మెయిన్ టార్గెట్‌గా ఉన్న గొట్టిపాటి ర‌వి పార్టీలోకి వ‌చ్చినా కృష్ణ చైత‌న్యకు లైఫ్ లేదు. దీంతో చైతన్య ఏం చేయాలో తెలియ‌క‌.. రాజ‌కీయంగా కొట్టుమిట్టాడుతున్నారు. జ‌గ‌న్ సైతం ఆయ‌న మొర ఆలకించే ప‌రిస్థితి లేదు.

Tags:    

Similar News