కోడెల కేసులో కీలకమదే
ఏపీ మాజీ శాసనసభా పతి, టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్య రాజకీయంగా మారుమోగిపోతోంది. రాజకీయంగా వాదోపవాదాలకు దారితీసింది. ఇంతకీ కోడెల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? [more]
ఏపీ మాజీ శాసనసభా పతి, టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్య రాజకీయంగా మారుమోగిపోతోంది. రాజకీయంగా వాదోపవాదాలకు దారితీసింది. ఇంతకీ కోడెల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? [more]
ఏపీ మాజీ శాసనసభా పతి, టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్య రాజకీయంగా మారుమోగిపోతోంది. రాజకీయంగా వాదోపవాదాలకు దారితీసింది. ఇంతకీ కోడెల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందో తెలియాలంటే కీలకమైన కోడెల మొబైల్ ఫోన్ డేటానేనని పోలీసులు విశ్వసిస్తున్నారు.
కోడెల ఎవరెవరితో మాట్లాడారు….?
కోడెల ఆత్మహత్య చేసుకునే మూడు రోజుల ముందు నుంచి ఎవరెవరితో మాట్లాడారు…..ఆయన మొబైల్ మెసేజ్ లలో ఏముంది. ఎక్కువగా ఎవరితో మాట్లడాడం జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆ మొబైల్ మాత్రం ఇంతవరకు దొరకలేదు…కుటుంబ సభ్యులే మొబైల్ ని దాచిపెట్టారా….? లేక ఏమైంది? మిస్ అవ్వడానికి కారణమేంటో అంతుచిక్కడం లేదు. దీంతో పోలీసులు సైతం ఆ మొబైల్ కోసం సీరియస్ గా వెతుకుతున్నారు.
కేసులకు భయపడేంత…
కోడెల కేసులకు భయపడే వ్యక్తి కాదు. ఇంట్లో బాంబులు పేలినప్పుడు…. ధైర్యంగా సిబిఐ కేసుల్నే ఎదుర్కొని క్లీన్ చిట్ తెచ్చుకున్న నేత కోడెల శివప్రసాద్. అందుకే ప్రజలు ఆయన్ని పల్నాటి పులి అని పిలుచుకుంటారు. అయితే అందరూ చెప్పే ఒకే ఒక్క మాట ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని. మరి
ఆత్మహత్య కు బలమైన కారణమేంటి….? అనేది ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్న? దీనిపై మూడు పోలీసు బృందాలు సీరియస్ గా దర్యాప్తు చేపట్టాయి.
ఆ గంటలో ఏం జరిగింది?
కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే కొద్ది గంటల ముందు జరిగిన పరిణామాలే కోడెల ఆత్మహత్యలో కీలకంగా మారే అవకాశం ఉంది. రాజకీయ రంగు పులుముకున్న ఈ ఆత్మహత్య కేసులో మరోకోణం కూడా వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు కొన్ని క్లూస్ దొరకడమే దీనికి బలం చేకూరుస్తోంది. అవి ప్రూవ్ అవ్వాలంటే కోడెల మొబైల్ దొరికితేనే సాధ్యం అంటూన్నారు నిపుణులు. మరి ఆ మొబైల్ ఏమైంది…క్లూస్ టీంకు అన్ని దొరికినా ఆ మొబైల్ ఎందుకు దొరకలేదు. అది దొరికితే దానిలోని మెస్సేజ్ లలో ఆ నిజం బైట పడే అవకాశం ఉంది అని మిస్ చేశారా లేక మిస్ అయిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రాధమిక విచారణలో తేలిందేంటి?
కోడెల శివప్రసాద్ టిఫిన్ చేసిన తర్వాత మొబైల్ ను వెంట తీసుకొని పోలేదని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. మరి ఆ మొబైల్ ఎక్కడ ఉంది అనేది పోలీసులకు సవాలుగా మారింది. మొబైల్ లో దాగిన రహస్యలే దర్యాప్తుకు కీలకం కానున్నాయి. కోడెల మృతితో కుటుంబసభ్యులు బాధలో ఉండడంతో పోలీసులు కూడా వారిని ఎక్కువగా అడగలేకపోతున్నారు. మరోవైపు కుటుంబసభ్యులు స్వగ్రామానికి వెళ్లిపోయారు. కోడెల ఆఖరిగా మాట్లాడిన కాల్ 8:30 నిమిషాలుగా తెలుస్తోంది. ఆ తర్వాత కోడెల ఎంత సేపు కుటుంబ సభ్యులతో గడిపారు, ఎన్ని గంటలకు రూమ్ లోకి వెళ్ళాడు.? అన్న విషయాలను ఆరా తీస్తున్నారు. ఎంత పిలిచినా రాకపోవడంతో ఎన్నింటికి గుర్తించారనే విషయాలను పోలీసులు కూలంకుషంగా తెలుసుకుంటున్నారు. కానీ బసవతారకం ఆసుపత్రి యాజమాన్యం మాత్రం కోడెలను ఉదయం 11:37లకు ఆసుపత్రికి తీసుకువచ్చారని ప్రకటించింది. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని, పల్స్ బాగా పడిపోవడంతో 12:39 నిమిషాలకు చనిపోయినట్లు చెప్పారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి అంత సేపు పల్స్ తో ఉండే అవకాశం ఉందా..? ఆసుపత్రికి తీసుకొని వచ్చే ముందే చనిపోయాడా ?అన్న ఆరోపణల్లో వాస్తవమొంత అనే దానిపైనా పోలీసులు నిపుణులతో మాట్లాడి వివరాలను సేకరిస్తున్నారు.
కొనఊపిరిలో ఎంతసేపు….
కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కొనఊపిరితో ఎంత సేపు ఉన్నారనే విషయాన్ని పోలీసులు పరిశోధిస్తున్నారు. సాధారణంగా వైర్ తో ఉరి వేసుకున్న వ్యక్తి నిమిషాల్లో చనిపోతారు. మెడదగ్గర నరాలు ఒత్తుకొని పోయి..ఆసుపత్రికి కు తీసుకొని వెళ్లే సమయం కూడా ఉండదు. ఉస్మానియా ఆసుపత్రిలో జరిగిన పోస్టుమార్టం నివేదికలోనూ కోడెల చెవి దగ్గర తప్ప ఒంటిమీద ఎలాంటి గాయాలులేవని..జరిగిన పరిణామాలను బట్టి కొన్ని విషయాలు మిస్టరీగా ఉన్నాయి. ఆ దిశగా పోలీసులు ఆరాతీస్తున్నారు..మొబైల్ దొరికితే అసలు వాస్తవాలు కొన్ని బైటికి వచ్చే అవకాశం ఉంది.