నోరు విప్పితే అంతేనా? ఈ బ్యాచ్ ఇంతేనా?

జ‌గ‌న్ ప్రభుత్వంలో ఆయ‌న కాకుండా 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో చాలా త‌క్కువ మంది ఇప్పుడు స్పందిస్తున్నారు. అంతేకాదు, వీరిలోనూ ఒక‌రిద్దరు మాత్రమే నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నార‌నే [more]

Update: 2020-04-19 14:30 GMT

జ‌గ‌న్ ప్రభుత్వంలో ఆయ‌న కాకుండా 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో చాలా త‌క్కువ మంది ఇప్పుడు స్పందిస్తున్నారు. అంతేకాదు, వీరిలోనూ ఒక‌రిద్దరు మాత్రమే నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నార‌నే వాద‌న వ‌స్తోంది. మీడియాతో మాట్లాడుతున్న మ‌రో ఒక‌రిద్దరు మంత్రులు మాత్రం కేవలం విమ‌ర్శల‌కు మాత్రమే ప‌రిమిత‌మ‌వుతున్నార‌నే వాద‌న‌కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇప్పుడు ప్రజ‌ల‌కు ధైర్యం చెప్పాల‌ని, వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై నిఘా పెట్టుకోవాలని, ఎక్కడా తప్పులు చేయొద్దని కూడా సీఎం జ‌గ‌న్ మంత్రుల‌ను ఆదేశిస్తున్నారు. ఆయ‌న మాట వింటున్న నాయ‌కులు ఒక‌రిద్దరు బాగానే ఉన్నా.. మ‌రికొందరు మాత్రం త‌మ ఇష్టాను సారం వ్యవ‌హ‌రిస్తున్నార‌ని, ఈ స‌మ‌యంలో ఇలాంటి విమ‌ర్శలు స‌మంజ‌స‌మా? అని కూడా నోరు నొక్కుకుంటున్నారు.

ప్రతి సమావేశంలో…..

ముఖ్యంగా మంత్రి కొడాలి నాని ఇప్పుడు మ‌రోసారి సెంట‌రాఫ్‌ది టాపిక్ అయ్యారు. నిజానికి కొడాలి నాని ఎప్పుడు మాట్లాడినా.. ఆయ‌న కేంద్రంగా మీడియా మారిపోతుంది. ఆయ‌న నోటి నుంచి అనేక మార్లు వివాదాస్పద వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. స‌న్నబియ్యం వివాదంపై “నీ అమ్మ మొగుడికి చెప్పాలా?“-అంటూ.. మాజీ మంత్రి దేవినేనిపై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. అప్పట్లో ఆయ‌న తీవ్ర వివాదం అయ్యారు. ఇక‌, ఆత‌ర్వాత కూడా అసెంబ్లీలోనూ చంద్రబాబును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. ఇక అప్పటి మంత్రి అచ్చెన్నాయుడిపై అచ్చెన్నాయుడు ఎద్దుగాడు… మొద్దుగాడు అని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో…..

స‌రే! అప్పట్లో రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితి వేరు. ప్రజ‌ల ప‌రిస్థితి వేరు. కానీ, ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. క‌రోనా ఎఫెక్ట్‌తో ప్రజ‌లు అత‌లాకుతలం అవుతున్నారు. ఇప్పుడు ఈ స‌మ‌యంలో రాజ‌కీయాలు వారు కోరుకోవ‌డం లేదు. త‌మ‌కు ఆప‌న్న హ‌స్తం అందించే నాయ‌కులు కావాల‌నే కోరుకుంటున్నారు. పైగా ఎక్కువ మంది టీవీల‌కు, సోష‌ల్ మీడియాకు అతుక్కుపోయారు. ఎవ‌రు ఏ నాయ‌కుడు ఏం మాట్లాడినా ఇప్పుడు ప్రజ‌ల‌కు వెంట‌నే చేరిపోతోంది. ఈ క్రమంలో తాజాగా కొడాలి నాని మాజీ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగ‌డ్డ ర‌మేశ్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిజంగానే ఏవ‌గించుకుంటున్నారు.

కొంతకాలం దూరంగా ఉన్నా…..

చంద్రబాబు కాలి చెప్పు.. అంటూ.. ఆయ‌న‌ను కొడాలి నాని దూషించ‌డాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైనా ఉంటే.. కోర్టుల్లో తేల్చుకోవాలే త‌ప్ప.. ఇలా ప‌రుషంగా మాట్లాడి మ‌రింత వివాదాస్పదం చేయ‌డం స‌మంజ‌స‌మా ? అని అంటున్నారు. ఇక చంద్రబాబు, దేవినేని ఉమను త‌న‌కు అల‌వాటైన రీతిలోనే తీవ్ర ప‌ద‌జాలంతో తిట్టారు. ఉమా సొంత వ‌దిన‌నే బాత్‌రూమ్‌లో చంపాడ‌ని వ్యక్తిగ‌త ఆరోప‌ణ‌ల‌కు కూడా దిగారు. ఇక మ‌ధ్యలో కొడాలి నాని ప్రెస్‌మీట్లకు దూరంగా ఉన్నప్పుడు జ‌గ‌న్ అదే జిల్లాకు చెందిన మ‌రో మంత్రి పేర్ని నానితో ఈయ‌న పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ విష‌యాలు చెప్పించారు. . ఏదేమైనా కొడాలి నాని వ్యాఖ్యలు ప్రత్యక్షంగా కొడాలి నాని ఇమేజ్‌ను పెంచ‌క‌పోగా.. జ‌గ‌న్ ప్రభుత్వంలోని ఆయ‌న బ్యాచ్ ఇంతే! అనే కామెంట్లకు అవ‌కాశం క‌ల్పిస్తోంది. మ‌రి ఇక‌నైనా ఇలాంటి వ్యాఖ్యల‌కు కొడాలి నాని దూరంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

Tags:    

Similar News