ఆయన గారికి ఏమైంది?

ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు చాలా మంది సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. గెలిచిన ఎమ్మెల్యేలలో కొంతమంది, ముఖ్య నాయకుల్లో కొంతమంది యాక్టివ్ [more]

Update: 2019-09-16 00:30 GMT

ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు చాలా మంది సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. గెలిచిన ఎమ్మెల్యేలలో కొంతమంది, ముఖ్య నాయకుల్లో కొంతమంది యాక్టివ్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో, మీడియా ముందు కనిపిస్తున్నారు తప్ప మిగతా వారు సోయలో లేరు. ఇక కొందరు అయితే పార్టీ జంప్ అయిపోయాగా…మరి కొందరు జంప్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే పార్టీలో ఉంటూ..చాలామంది అందుబాటులో ఉండటం లేదు. అందులో ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న కాగిత వెంకట్రావు అసలు కనిపించడం లేదు.

పార్టీ ఆవిర్భావం నుంచి…..

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ లో ఉన్న కాగిత…తొలిసారి 1985లో టీడీపీ తరుపున మల్లేశ్వరం (ర‌ద్ద‌య్యింది) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1989లో ఓడిపోయిన ఆయన 1994,99 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి..2004లో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన పెడన నుంచి 2009లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014లో టీడీపీ తర‌పున మళ్ళీ గెలిచారు. సీనియ‌ర్‌గా మంత్రి ప‌ద‌వి ఆశించినా ద‌క్క‌లేదు. ప్ర‌భుత్వం ఉన్నా ఐదేళ్ల పాటు ఆయ‌న అసంతృప్తితోనే ఉన్నారు.

ఆరోగ్యం బాగాలేక….

ఇటు జిల్లా గ్రూపు రాజ‌కీయాల్లోనూ ఆయ‌న‌కు మాజీ మంత్రి ఉమ లాంటి వాళ్ల‌తో పొసిగేది కాదు. ఇక 2019 ఎన్నికల్లో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుమారుడుకు సీటు ఇప్పించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ వైసీపీ అభ్యర్ధి జోగి రమేశ్ చేతిలో ఓడిపోయారు. అయితే ఆరోగ్యం బాగోలేక కాగిత బయటకు రాకపోయినా ఆయన కుమారుడు వెంకటకృష్ణప్రసాద్ కూడా ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఎన్నో ఏళ్ళు పెడన నియోజకవర్గాన్ని ఏలిన కాగిత పార్టీలో యాక్టివ్ గా లేకపోవడం వల్ల కేడర్ కూడా నియోజకవర్గంలో కన్పించడం లేదు. నియోజకవర్గ బాధ్యతలనీ తీసుకుని పార్టీని బలపడేలా చేయాల్సిన కాగిత తనయుడు ఆ దిశ‌గా దృష్టి పెట్టిన‌ట్టు లేదు.

స్తబ్దుగా క్యాడర్…..

ప్రస్తుత పరిస్థితుల్లో కాగిత వెంకట్రావు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయ‌న రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్టే. ఆయన తనయుడు మొత్తం బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. పోనీ ఆయన పార్టీ మారే సూచనలు ఏమైనా ఉన్నాయా ? అంటే అవి లేవు. దీంతో నియోజకవర్గంలో పార్టీని ఎవరు పట్టించుకోకపోవడంతో కేడర్ స్తబ్దుగా ఉండిపోయింది. ప్రస్తుతానికైతే పెడన నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఉందా? లేదా? అన్నట్లుగానే ఉంది. మరి కాగిత తనయుడు ఎప్పుడు యాక్టివ్ అయ్యి…పార్టీని బలోపేతం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News