జగన్ ను తిడితేనే?

నేడు సామాజిక మాధ్యమాలు పెరిగిపోయిన నేప‌థ్యంలో రాజ‌కీయ నాయ‌కులు తీసుకుంటున్న నిర్ణయాల‌పై ప్రజ‌లు వెంట‌నే స్పందిస్తున్నారు. త‌మ అభిప్రాయాల‌ను సుత్తిలేకుండా సూటిగా చెబుతున్నారు. అవ‌త‌లి ప‌క్షం నాయ‌కులు [more]

Update: 2020-02-21 15:30 GMT

నేడు సామాజిక మాధ్యమాలు పెరిగిపోయిన నేప‌థ్యంలో రాజ‌కీయ నాయ‌కులు తీసుకుంటున్న నిర్ణయాల‌పై ప్రజ‌లు వెంట‌నే స్పందిస్తున్నారు. త‌మ అభిప్రాయాల‌ను సుత్తిలేకుండా సూటిగా చెబుతున్నారు. అవ‌త‌లి ప‌క్షం నాయ‌కులు ఎంత సీనియ‌ర్లయినా.. ఎంత జూనియ‌ర్లయినా. కూడా లెక్కించ‌కుండానే నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో రాజ‌కీయ నేత‌ల‌కు సోష‌ల్ మీడియా ఇప్పుడు ప్రధాన ప్రతిప‌క్షంగా మారిపో యింది. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏపీ ప‌గ్గాలు చేప‌ట్టిన అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల మాజీ ఎమ్మెల్యే సాకే శైల‌జానాథ్ టార్గెట్‌గా ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌క‌ర‌రాల చ‌ర్చలు న‌డుస్తున్నాయి.

అభ్యర్థులు దొరకక…..

ఏపీ విభ‌జ‌నతో తీవ్రంగా న‌ష్టపోయిన కాంగ్రెస్ ఇప్పటి వ‌ర‌కు ఎదుగు బొదుగు లేకుండానే కాలం గ‌డుపుతోంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ పార్టీ టికెట్లు ఇచ్చేందుకు అభ్యర్థుల‌ను వెతుక్కోవాల్సి వ‌చ్చింది. అంతేకాదు. అభ్యర్థులు కావ‌లెను..! అంటూ ప్రక‌ట‌న కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ ప‌రిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పార్టీ ప‌గ్గాల‌ను ఎస్సీ వ‌ర్గానికి చెందిన సాకే శైలజానాధ్ కు పార్టీ అధిష్టానం అప్పగించింది.

జగన్ ను విమర్శించడంపైనే…..

త్వర‌లోనే జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థల ఎన్నిక‌లతో పాటు వ‌చ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని ముందుండి న‌డిపించే బాధ్యత‌ను సాకే శైలజానాధ్ కు అప్పగించారు. సాకే నియామ‌కంతో పార్టీలో కొత్త ఊపు వ‌స్తుంద‌ని, పార్టీ పుంజుకుంటుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, ఆయ‌న అంద‌రి ఆశ‌లు, ఆశ‌యాల‌కు భిన్నంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి పెట్టకుండా అధికారంలో ఉన్న జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం పైనే దృష్టి పెట్టడంపై రాజ‌కీయ వ‌ర్గాలు విమ‌ర్శలు సంధిస్తున్నారు.

తప్పు తెలుసుకోకుండా……

అస‌లు ఎలాంటి ఓటు బ్యాంకు పెద్దగా లేని బీజేపీనే నేడు జ‌గ‌న్‌ను దువ్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింద‌ని, కానీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ త‌న త‌ప్పును తెలుసుకోలేక పోతోంద‌ని కేవ‌లం జ‌గ‌న్‌ను విమర్శించ‌డం త‌ప్ప ఏమీ చేయ‌డం లేద‌న్న విమ‌ర్శలు కూడా వ్యక్తమ‌వుతున్నాయి. ఇప్పటికైనా సాకే ఈ విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకుని ముందుకు సాగాల‌న్న అభిప్రాయాలే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. మ‌రి సాకే శైలజానాధ్ ఏం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News