ఏరాసుకు ఏ దారీ లేదా?
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా ప్రకటించకపోయినా [more]
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా ప్రకటించకపోయినా [more]
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా ప్రకటించకపోయినా కొందరు నేతలకు ఇక రాజకీయ ఎదుగుదల లేనట్లే అనుకోవాలి. అందులో ఏరాసు ప్రతాప్ రెడ్డి ఒకరు. ఆయన ప్రస్తుతం టీడీపీ లో ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఏ నియోజకవర్గం టిక్కెట్ దక్కే అవకాశం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి పై ఆశ తప్ప ఏరాసు ప్రతాప్ రెడ్డికి రాజకీయంగా మరో ఆశలేదు.
సీమ నేతగా…?
ఏరాసు ప్రతాప్ రెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ లో ఆయన రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా సాగింది. అయితే ఈ సీమ నేతకు ఒక నియోజకవర్గం ప్థిరంగా లేకపోవడం విచిత్రం. నిజానికి పాణ్యం నియోజకవర్గానికి చెందిన ఏరాసు ప్రతాప్ రెడ్డి 2009 లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత మంత్రి కూడా అయ్యారు. అయితే ఇప్పుడు టీడీపీలో శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఏరాసు ప్రతాప్ రెడ్డికి టిక్కెట్ ఛాన్స్ ఉండదు.
పాణ్యం నుంచి….
ఇక పాణ్యం నియోజకవర్గంలోనూ ఆయనకు అవకాశాలు లేవు. 2014లో తెలుగుదేశం పార్టీ పాణ్యం నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చింది. అక్కడ పోటీచేసిన ఏరాసు ప్రతాప్ రెడ్డి దారుణ ఓటమి పాలయ్యారు. అప్పటి ఎన్నికల్లో గౌరు చరితా రెడ్డి విజయం సాధించగా ఏరాసు ప్రతాప్ రెడ్డి మూడో స్థానంలోకి వెళ్లారు. కేవలం 53 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి 60 వేల ఓట్లకు పైగా రావడం విశేషం.
ఎక్కడా నో ఛాన్స్……
వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుంచి గౌరు చరితా రెడ్డి పోటీ చేస్తారన్నది వాస్తవం. ఆమె నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏరాసు ప్రతాప్ రెడ్డికి ఇటు శ్రీశైలం, అటు పాణ్యం టిక్కెట్లు టీడీపీ నుంచి దక్కే అవకాశాలు లేవన్నది సుస్పష్టం. దీంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్లలేక, తనకు రాజకీయంగా ఎదుగుదల లేదని భావించి తనకు ఇష్టమైన వ్యవసాయానికి పరిమితమయ్యారని తెలుస్తోంది. పైకి ప్రకటన చేయకపోయినా రాజకీయంగా ఏరాసు ప్రతాప్ రెడ్డి సన్యాసం తీసుకున్నట్లే చెప్పాలి.