ఢిల్లీనే డిసైడ్ చేస్తుందట
బీజేపీ ఇపుడు ఎన్నడూ లేనంతగా ఇబ్బందుల్లో ఉంది. రాజకీయంగా మోడీ, అమిత్ షాలకు గడ్డుకాలం నడుస్తోంది. ఎనిమిది నెలల క్రితం బంపర్ మెజారిటీతో వరసగా రెండవమారు కేంద్రంలో [more]
బీజేపీ ఇపుడు ఎన్నడూ లేనంతగా ఇబ్బందుల్లో ఉంది. రాజకీయంగా మోడీ, అమిత్ షాలకు గడ్డుకాలం నడుస్తోంది. ఎనిమిది నెలల క్రితం బంపర్ మెజారిటీతో వరసగా రెండవమారు కేంద్రంలో [more]
బీజేపీ ఇపుడు ఎన్నడూ లేనంతగా ఇబ్బందుల్లో ఉంది. రాజకీయంగా మోడీ, అమిత్ షాలకు గడ్డుకాలం నడుస్తోంది. ఎనిమిది నెలల క్రితం బంపర్ మెజారిటీతో వరసగా రెండవమారు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా రాష్ట్రాలు మాత్రం ఒక్కొక్కటిగా చేజారుతున్నాయి. దీంతో రాజకీయంగా దూకుడు కొంత తగ్గిందని చెప్పాలి. లేకపోతే ఏపీ లాంటి చోట్ల రాజధాని పేరిట ఇంత చిచ్చు రగులుతున్నా కేంద్రం అలా ఉండిపోవడం అంటే మాటలు కాదు, అందునా మోడీ, అమిత్ షాలు ఊరుకునే రకం కూడా కాదు, కానీ జగన్ కి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వరస పరాజయాలతో మోడీ, షా డీలా పడిపోవడం. మరి ఇపుడు దేశానికి రాజధాని, బీజేపీ రాజకీయానికి ఆయువు పట్టు లాంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
అక్కడ గెలిస్తేనే…..
అక్కడ కనుక బీజేపీ గెలిస్తే మళ్ళీ మోడీ, షా జూలు విదిలిస్తారని అంతా అనుకుంటున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లను గెలుచుకున్న బీజేపీకి ఇపుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చెమటలు పట్టిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ అయిదేళ్ళ పాటు బాగానే పాలించిందన్న మార్కులు జనం వేశారు. దాంతో మరో చాన్స్ ఆ పార్టీకి ఇస్తారన్న ఊహాగానాలూ ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి మాత్రం గెలుపు అన్నది జీవన్మరణ సమస్య. బీజేపీ గెలిస్తేనే దేశంలో తలెత్తుకుని తిరగగలదు అంటున్నారు.
అలా అయితే….
ఇక ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేనెలలో వెలువడతాయి. అప్పటికి ఏపీలో రాజధాని ప్రక్రియ కూడా పూర్తి అవుతుందని అంటున్నారు. ఒకవేళ జరిగినా, ఆగినా కూడా బీజేపీ ప్రభావం చూపించడానికి ఢిల్లీ ఫలితాలు ఎనలేని బలాన్ని ఇస్తాయని అంటున్నారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే మాత్రం జగన్ దూకుడుని అడ్డుకునే భారీ వ్యూహానికి శ్రీకారం చుట్టడం ఖాయం. జగన్ కి కూడా రాజకీయంగా ఇబ్బందులు ఆ ఫలితాలతోనే మొదలవుతాయని భావిస్తున్నారు. బీజేపీ గెలుపు పిలుపుతో ఏపీలో కొత్త పొత్తు కుదుర్చుకున్న జనసేనకు కూడా కొత్త పవర్ వచ్చేస్తుందని విశ్లేషిస్తున్నారు.
తేడా కొడితే….?
ఇక అనుకోని విధంగా తేడా కొడితే మాత్రం జగన్ కి ఎదురులేని పరిస్థితి ఉంటుంది. కంచుకోట లాంటి ఢిల్లీలో, అందునా ప్రధాని సహా మొత్తం మంత్రి మండలి కొలువు తీరిన రాజధాని ఉన్న చోటే ఓటమి పాలు అయితే ఆ పరాజయం దారుణమే. అదే కనుక జరిగితే బీజేపీ మరింతగా డీలా పడుతుంది. అపుడు జగన్ మూడు రాజధానుల రధం మరింత ముందుకు సాగిపోతుంది. విపక్షాలు సైతం పెద్ద నోరు చేసుకోని స్థితికి చేరుకుంటాయి. ఇవన్నీ చూసుకున్నపుడు ఏపీకి, ఢిల్లీకి ఉన్న బంధం మరో మారు రాజకీయ తెర ముందుకు పెద్ద చర్చగా వస్తోంది. మరి జగన్ రాజకీయ భవిష్యత్తు కూడా ఢిల్లీ మీదనే ఆధారపడి ఉందని చెప్పాలి.