ఎందుకీ…. విగ్రహం… ఏం చెబుతోంది? ఏం జరుగుతోంది?

న్యూయార్క్ నగరంలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నిలువెత్తు ప్రతిమ స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. జాతి, మతం, ప్రాంతం, రంగు వంటి వివక్ష లేకుండా అమెరికా సమాజం [more]

Update: 2020-06-20 16:30 GMT

న్యూయార్క్ నగరంలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నిలువెత్తు ప్రతిమ స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. జాతి, మతం, ప్రాంతం, రంగు వంటి వివక్ష లేకుండా అమెరికా సమాజం అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, దేశంలోని ప్రతి ఒక్కరుా స్వేచ్ఛగా బతికేందుకు ఈ ప్రతిమ పూచీ వహిస్తుంది. కానీ ఆచరణలో ఇది అంతా ఎండమావిగానే కనిపిస్తుంది. స్వేచ్ఛా ప్రతిమ ఈ వివక్షను కళ్ళప్పగించి చుాడటం మినహా ఏమీ చేయలేకపోయింది. ఇది అమెరికా సమాజానికి తలవంపులు తెచ్చే వ్యవహారమే. అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా, అత్యంత సంపన్నదేశమైన అమెరికాలో నల్లజాతీయుల పట్ల నేటీకీ వివక్ష కొనసాగుతుండటం సిగ్గుచేటు. శతాబ్దాలుగా అమెరికా సమాజంలో భాగమైన నల్లజాతీయులు నేటీకీ ద్వీతీయశ్రేణి పౌరులుగా జీవిస్తున్నారనడానికి ఇటీవల జరిగిన జార్జి ఫ్లాయిడ్ హత్య నిలువెత్తు నిదర్శనం. ఫ్లాయిడ్ ను కర్కశంగా హతమార్చిన తీరు సభ్యసమాజాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనను యావత్ ప్రపంచం నిరసించింది.

ఓటు బ్యాంకు రాజకీయం తప్ప…..

ఫ్లాయిడ్ హత్యతో అమెరికాలో నల్లజాతీయుల పరిస్ధితిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారు ఎదురొంటున్న ఇబ్బందులు, వివక్ష, అవమానాలు, అసలు అమెరికా సమాజంలో వారి పాత్రపై లోతైన అధ్యయనం జరుగుతోంది. ఒక్కసారి చరిత్రలోకి వెళితే వారి దయనీయ పరిస్ధితి అర్ధమవుతుంది. వచ్చే నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో అమెరికన్ ప్రముఖులు అందరు పైకి మాత్రం ఫ్లాయిడ్ ఘటనను నిరసిస్తున్నారు. అంతేతప్ప వారిపై శ్వేతజాతీయులైన అమెరికన్లకు నిజమైన ప్రేమలేదన్నది నిజం. ఉత్తర అమెరికాలో 1804 లోనే బానిసత్వం రద్దయింది. వందల సంవత్సరాల పాటు నల్లజాతీయులతో చాకిరీ చేయించుకున్నారు. మఖ్యంగా వ్యవసాయ పనుల్లో వారి అవసరం ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ వారికి ఓటుహక్కు కుాడా ఉండేది కాదు. 1870 లో 15 వ రాజ్యాంగసవరణ ద్వారా నల్లజాతి పురుషులకు మాత్రమే ఓటు హక్కు లభించింది. క్రమంగా అమెరికన్ సమాజంలో వారు భాగమయ్యారు. కానీ అక్కడి పాలకులు వారిని ఓటు బ్యాంకుగా చుాస్తున్నారే తప్ప పౌరులుగా చుాడటం లేదు. ఎన్నికల సమయంలో చిలకపలుకులు పలకడం తప్ప ఆచరణలో వారి సంక్షేమం పట్ల శ్రద్ధచుాపిన దాఖలాలు లేవు.

జనాభాలో 14 శాతం…..

ీీఅమెరికాలో నల్లజాతీయుల సంఖ్య దాదాపు 4.2 కోట్లుగా గణాంకాలు పేర్కొంటున్నాయి. మెుత్తం జనాభాలో అంటే దాదాపు 14 శాతం. వీరిలో అత్యధికం పేదరికంలో మగ్గుతున్నారు. సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక దుర్భర జీవనం గడుపుతున్నారు. ఉన్నతవిద్య అందిచినప్పటికి వారి పట్ల నేటికీ వివక్ష కొనసాగుతునే ఉంది. ఒక శ్వేత జాతీయుడి సగటు సాలీనా ఆదాయం 36,785 డాలర్లు కాగా నల్లజాతీయుడి ఆదాయం 23,738 డాలర్లకు మించడం లేదు. నిరుద్యోగరేటు నల్లజాతీయుల్లో 5.5 శాతం ఉండగా, తెల్లజాతీయుల్లో 2.3 శాతం కావడం గమనార్హం. ఇటీవల కరోనా మ‍హమ్మారికి గురై చనిపోయిన వారిలో కూడా నల్లజాతీయులే అత్యధికంగా ఉండటం గమనార్హం. దేశంలో నమెాదైన మరణాల్లో 50.3 శాతం నల్లజాతీయులు కాగా తెల్లజాతీయులు 20.7 శాతం మత్రమే కరోనా పరీక్షల నిర్వహణలోనుా వివక్ష నెలకొందన్న వాదన ఉంది. నల్లవాళ్ళంతా నేరస్తులేనని, అనుమానం వస్తే వారిని కాల్చి చంపడానికి వెనుకాడరన్నది అమెరికా పోలీసుల అంతర్గత భావన. తరతరాలుగా ఈ భావన కొనసాగుతోంది. అమెరికా న్యాయవ్యవస్ధలోనుా ఈ జాడ్యం లేకపోలేదు.

అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నా….

నల్లజాతీయులు దశాబ్దాలుగా అమెరికా సమాజంలో భాగమైనప్పటికి, దేశవ్యాప్తంగా వారు విస్తరించినప్పటికీ పాత తరం భావాలకు చరమగీతం పాడటంలేదు. 2008 లో డెమెుక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష పదవికి ఎన్నికైన బరాక్ ఒబామా హయాం లోనూ ఈ పరిస్ధితి లేకపోలేదు. ఒబామా ఆఫ్రో అమెరికన్. ఆయన తల్లి ఆఫ్రికన్, తండ్రి అమెరికన్. ఆఫ్రో అమెరికన్ సంతతికి చెందిన తొలి అధ్యక్షుడు ఒబామానే కావడం విశేషం. న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినా, మిచిగాన్, మేరీలాండ్, లూసియానా, తదితర రాష్టాల్లో నల్లజాతీయులు అధికసంఖ్యలో ఉన్నారు. న్యూయార్క్ లో అత్యధికంగా 30 లక్షల మంది నల్లజాతీయులున్నారు. చికాగో, మిచిగాన్ తరవాతి స్ధానాల్లో ఉన్నాయి. అమెరికా రాజకీయాల్లో సహజంగా నల్లజాతీయులు డెమెుక్రటిక్ పార్టీ వైపు మెుగ్గు చూపుతారు. ఇది మెుదటినుంచీ వస్తున్న విదానం. రిపబ్లికన్ పార్టికి చెంది ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ నల్లజాతీయులపై ఆగ్రహానికి ఇది ఒక కారణం. ఆయన వారిని ఓటు బ్యాంక్ గా పరిగణిస్తున్నారు తప్ప పౌరులుగా చూడటం లేదు. మున్ముందు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఫ్లాయిడ్ హత్యను పైకి ఖండించారు. అంతే తప్ప అంతరాల్లో ఆయన అభిప్రాయం ఒక రకంగా ఉంది. ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్య దేశమంటుా చంకలు గుద్గుకునే అమెరికా నల్లజాతీయులను నిజమైన పౌరులుగా గుర్తించేదెన్నడు?

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News