జులైలో జూలు విదిలిస్తుందా? ఏం చేయాలి?
కరోనా వైరస్ భారత్ ను వదలిపెట్టడం లేదు. లాక్ డౌన్ మినహాయింపులతో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ భారత్ [more]
కరోనా వైరస్ భారత్ ను వదలిపెట్టడం లేదు. లాక్ డౌన్ మినహాయింపులతో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ భారత్ [more]
కరోనా వైరస్ భారత్ ను వదలిపెట్టడం లేదు. లాక్ డౌన్ మినహాయింపులతో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ భారత్ ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య విషయంలో ప్రపంచంలో నాలుగో స్థానంలోకి చేరుకుంది. ఇది ఆందోళన కల్గించే అంశమే. జులై చివరి నాటికి పదిహేను లక్షల మంది కరోనా వైరస్ బారిన పడతారన్న నిపుణుల హెచ్చరికలు ఇప్పుడు ఆందోళన కల్గిస్తున్నాయి.
మూడు లక్షలు దాటి…..
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అమెరికా, రష్యా తర్వాత స్థానంలో భారత్ చేరిపోయింది. మరణాల సంఖ్య కొంత అదుపులో ఉన్నప్పటికీ భవిష్యత్ లో ఇవి కూడా పెరుగుతాయంటున్నారు. ప్రస్తుతం భారత్ లో ఐదో విడత లాక్ డౌన్ అమలులో ఉంది. మూడో విడత లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడం ప్రారంభించారు. ఐదో విడత లాక్ డౌన్ అమలులో ఉన్నా లేనట్లేనన్నది వాస్తవం.
అన్నీ తెరుచుకోవడంతో…..
దాదాపు అన్ని తెరుచుకున్నాయి. మాల్స్, ప్రార్థనామందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం కావడంతో కరోనా వ్యాప్తి మరింత ఎక్కవుగా ఉండనుంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. మహరాష్ట్రలో లక్ష దాటేసిన కేసులు, తమిళనాడులో నలభైవేలు దాటేశాయి. ఇక్కడ మరోసారి లాక్ డౌన్ అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు.
ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న….
భారత్ లో పది రోజుల నుంచి పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రాలు ఆర్థికంగా కోలుకుంటున్నాయి. మరోవైపు ఉపాధిలేక రెండు నెలల నుంచి కష్టాలు పడిన వారు సయితం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జులై నాటికి కరోనా వైరస్ మరింత విజృంభిస్తుందన్న వార్తలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండటంతో భవిష్యత్ మీద బెంగ పట్టుకుంది.