ఇక ఆపడం సాధ్యం కాదా?
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తుంది. కేసులు రోజురోజుకూ పెరగడమే తప్ప తగ్గుతున్న జాడ లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కన్పించడం లేదు. [more]
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తుంది. కేసులు రోజురోజుకూ పెరగడమే తప్ప తగ్గుతున్న జాడ లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కన్పించడం లేదు. [more]
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తుంది. కేసులు రోజురోజుకూ పెరగడమే తప్ప తగ్గుతున్న జాడ లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కన్పించడం లేదు. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు ఐదు లక్షలు దాటేసి ఆరు లక్షలకు చేరువలో ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాలు కరోనాతో అల్లాడి పోతున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. ప్రజల నిర్లక్ష్యం కూడా కేసుల సంఖ్య పెరగడానికి కారణమంటున్నారు.
తొలినాళ్లలో…..
కరోనా తొలి నాళ్లలో కేసుల సంఖ్య పెద్దగా లేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నెలల తరబడి జీరో కేసులు ఉన్నాయి. లాక్ డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయడంతో కొన్ని జిల్లాల్లో కేసులే నమోదు కాలేదు. కేవలం నగరాలకే కరోనా వైరస్ పరిమితమయింది. కానీ మర్కజ్ మసీదు ప్రార్ధనలు, కోయంబేడు మార్కెట్ తో కరోనా వైరస్ జిల్లాలకు అంటుకుంది. వేల కేసులు జిల్లాల్లో నమోదవుతున్నాయి.
జిల్లాల్లో అంటుకున్న……
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే కేసులు 80వేలకు చేరువలో ఉన్నాయి. దాదాపు 500 మంది వరకూ కరోనాతో మరణించారు. తొలినాళ్లలో బీభత్సం సృష్టించిన కర్నూలు జిల్లాలో నేడు యాభై వేల కేసుల వరకూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోనూ కరోనా కేసులు నలభై వేలకు పైగానే నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు.
లాక్ డౌన్ మినహాయింపుల తర్వాతే….
లాక్ డౌన్ నిబంధనలను సడలించిన నాటి నుంచే కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రజలు కూడా కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం కూడా పెరగడానికి కారణమని చెప్పక తప్పదు. అందుకే ఏపీలోని అనేక జిల్లాల్లో ఇప్పుడు లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నారు. ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నారు. ప్రభుత్వంపై నెపం వేసే కన్నా ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. టెస్ట్ లు కూడా దేశంలోనే ప్రధమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. రోజుకు యాబై నుంచి అరవై వేల టెస్ట్ లను నిర్వహిస్తున్నారు. అందువల్లనే కేసుల సంఖ్య పెరుగుతుందన్నది ప్రభుత్వ వాదన. మొత్తం మీద రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతుండటం ఏపీలో ఆందోళన కల్గిస్తుంది.