కోల్డ్ వార్ స్టార్టయింది

జ‌గ‌న్ కేబినెట్‌లో ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోందా ? ప‌క్క‌ప‌క్క జిల్లాల‌కు చెందిన ఈ ఇద్ద‌రు మంత్రులు ఒక‌రిపై ఒక‌రు గుస్సాగా ఉన్నారా ? [more]

Update: 2019-10-15 14:30 GMT

జ‌గ‌న్ కేబినెట్‌లో ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోందా ? ప‌క్క‌ప‌క్క జిల్లాల‌కు చెందిన ఈ ఇద్ద‌రు మంత్రులు ఒక‌రిపై ఒక‌రు గుస్సాగా ఉన్నారా ? ఒక‌రి శాఖ‌లో ఒక‌రు వేలు పెడుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆ ఇద్ద‌రు మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. దీనికి కార‌ణాలు అనేకం ఉన్నాయి. కృష్ణాజిల్లా గుడివాడ నుంచి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న కొడాలి నానికి జ‌గ‌న్ .. రాష్ట్రంలోనే కీల‌క‌మైన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ను కేటాయించారు. ఆయ‌న త‌న‌ప‌ని తాను చేసుకుని పోతున్నారు. ప్ర‌భుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను కూడా త‌న‌దైన శైలిలో తిప్పికొడుతున్నారు.

రైస్ మిల్లర్లతో…..

ఇక‌, ప‌శ్చిమ‌గోదావరి జిల్లాకు చెందిన మ‌రో మంత్రి, ఆచంట‌ నుంచి గెలిచిన మాజీ నాయ‌కుడు, జిల్లా రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు చెరుకువాడ శ్రీరంగ‌నాథ రాజు కు కూడా జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. ఈయ‌న‌కు గృహ నిర్మాణ శాఖ‌ను కేటాయించారు. అయితే, ఆది నుంచి కూడా ఈయ‌న కు రాష్ట్రంలోని రైస్ మిల్ల‌ర్స్‌తో విడదీయ‌రాని అనుబంధం ఉంది. ఎన్నిక‌లకు ముందు కూడా జిల్లా రైస్ మిల్ల‌ర్స్ స‌హ‌కారం అందించారు. భారీ ఎత్తున నిధులు అందించి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు కృషి చేశారు. అయితే, ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత త‌మ ప్ర‌యోజ‌నాల‌కు రంగ‌నాథ‌రాజు ఉప‌యోగ‌ప‌డ‌తాడ‌ని అనుకున్నారు. ఆయ‌న కొన్ని సంవ‌త్స‌రాలుగా జిల్లా రైస్‌మిల్ల‌ర్ల అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు.

డ్యామేజీ అవుతుందని…..

ఈ క్ర‌మంలోనే రంగ‌నాథ‌రాజు.. త‌న‌కు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ను అప్ప‌గించాల‌ని జ‌గ‌న్‌ను కోరారు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఆయ‌న‌కు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ను అప్ప‌గిస్తే.. రాజ‌కీయంగా త‌న‌కు డ్యామేజీ వ‌స్తుంద‌ని భావించి గృహ నిర్మాణ శాఖ‌ను కేటాయించారు. దీంతో రాజు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు. దాదాపు ప‌ది రోజుల పాటు త‌న శాఖ‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోకుండా ఉండిపోయారు. త‌న‌కు పౌర‌స‌ర‌ఫ‌రాలు అప్ప‌గిస్తే.. జ‌గ‌న్ ఆశించిన దానిక‌న్నా ఎక్కువ‌గా ప‌నిచేసి ఉండేవాడిన‌ని ఆయ‌న త‌న అనుచ‌రుల వ‌ద్ద చెప్పుకొచ్చారు.

నాణ్యమైన బియ్యం లేవంటూ….

ఇక‌, త‌న‌కు ఈ శాఖ ద‌క్క‌క పోవ‌డంతో మంత్రి కొడాలి నానిపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభిం చారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న నాణ్య‌మైన బియ్యం స‌ర‌ఫ‌రా విష‌యంలో మంత్రి రంగ నాథరాజు వేలు పెట్ట‌డం ప్రారంభించారు. నాణ్య‌మైన బియ్య స‌ర‌ఫ‌రాలో లోపాలు ఉన్నాయంటూ ఆయ‌న మీడియా స‌మావేశాల్లో విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి కొడాలి నాని కూడా రంగ‌నాథ‌రాజు చూస్తున్న గృహ నిర్మాణ శాఖ‌పై విమ‌ర్శలు చేయ‌డం ప్రారంభించారు. గృహ‌నిర్మాణ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, త‌న నియోజ‌వ‌క‌ర్గంలో వేలాది మంది అర్హులు ఉన్నా.. కేవలం వంద మందికి మాత్ర‌మే ఇళ్లు ఇస్తున్నార‌ని ఆయ‌న అంటున్నారు.

ఒకరిపై ఒకరు…..

ఇక రంగ‌నాథ‌రాజు ఒత్తిళ్ల‌తో ప్ర‌భుత్వం సేక‌రించే బియ్యంలో 25 శాతం వ‌ర‌కు ప‌శ్చిమ‌గోదావ‌రి నుంచే కొనుగోలు చేసేలా సీఎం జ‌గ‌న్ ఓకే చెప్పారు. అయినా ఆయ‌న‌కు సంతృప్తి లేదు. చివ‌ర‌కు త‌న అస‌హ‌నాన్ని అంతా కొడాలి నానిపై చూపిస్తున్నారు. అటు నాని కూడా రంగ‌నాథ‌రాజు శాఖ‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఇలా ఈ ఇద్ద‌రి మ‌ధ్య శాఖ‌ల విష‌యంలో త‌లెత్తిన వివాదం ముదురుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.

Tags:    

Similar News