కోయంబేడు కోత ఏపీలో మామూలుగా లేదు
ఆంధ్రప్రదేశ్ కు కోయంబేడు మార్కెట్ శాపంగా మారింది. దాదాపు ఏడు జిల్లాల్లో కోయంబేడు మార్కెట్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. తొలుత విదేశీయులు [more]
ఆంధ్రప్రదేశ్ కు కోయంబేడు మార్కెట్ శాపంగా మారింది. దాదాపు ఏడు జిల్లాల్లో కోయంబేడు మార్కెట్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. తొలుత విదేశీయులు [more]
ఆంధ్రప్రదేశ్ కు కోయంబేడు మార్కెట్ శాపంగా మారింది. దాదాపు ఏడు జిల్లాల్లో కోయంబేడు మార్కెట్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. తొలుత విదేశీయులు ఆ తర్వాత మర్కజ్ మసీదు ప్రార్థనలు, తాజాగా కోయంబేడు మార్కెట్ ల నుంచి ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగింది. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారిని గుర్తించి ఇప్పటికే చికిత్సలు చేయించారు. వారి సమస్య చాలా వరకూ తగ్గినట్లే.
కూరగాయల వ్యాపారులు…
కానీ కోయంబేడు మార్కెట్ మరోసారి పట్టుకుంది. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు ఏపీిలోని సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, నెల్లూరుకు ఎక్కువగా వెళుతుంటారు. కూరగాయలు, పండ్లు ఈ మార్కెట్ కు తీసుకెళ్లడం, అక్కడి నుంచి ఏపీకి తీసుకురావడం ఎక్కువగా జరుగుతుంటుంది. రోజుకు వందల సంఖ్యలో లారీలు ఈ జిల్లాల నుంచి కోయంబేడు మార్కెట్ కు వెళుతుంటాయి. ఈ నేపథ్యంలో కోయంబేడు మార్కెట్ లో కరోనా వ్యాప్తి చెందడంతో అది ఆంధ్రప్రదేశ్ కు కూడా అంటుకుంది.
మొత్తం ఏడు జిల్లాల్లో….
చిత్తూరు జిల్లాలో నిన్నటి వరకూ నమోదయిన 173 కేసుల్లో అత్యధికంగా కోయంబేడు మార్కెట్ కు చెెందినవే. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా నమోదయిన 149 కేసుల్లో యాభై శాత ఈ మార్కెట్ నుంచి వచ్చినవే. ఈ రెండు జిల్లాలతో పాటు కోయంబేడు మార్కెట్ నుంచి విశాఖపట్నం, తూర్పు గోదావరి, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు కూడా వైరస్ వ్యాప్తి చెందింది. వీరిని గుర్తించే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు.
కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకటించిన తర్వాత….
ప్రకాశం జిల్లాను నిన్న కరోనా ఫ్రీ జిల్లా గా అధికారులు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో గడచిన రెండు నెలల్లో 63 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం నెగిటివ్ రావడంతో కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకటించారు. అలా ప్రకటించిన 24 గంటల్లోనే కోయంబేడు మార్కెట్ నుంచి కరోనా జిల్లాలోకి మళ్లీ ఎంటర్ అయింది. మొత్తం మూడు కేసులను అధికారులు గుర్తించారు. ప్రకాశం జిల్లా నుంచి మొత్తం 170 మంది వరకూ కోయంబేడు మార్కెట్ కు వెళ్లారని భావిస్తున్నారు. వీరంతా కూరగాయల వ్యాపారులు, డ్రైవర్లే. వీరిని గుర్తించగలిగితేనే వ్యాధిని అరికట్టవచ్చు. ప్రస్తుతం ప్రకాశంజిల్లా అధికారులు అదే పనిలో ఉన్నారు.