ట్రబుల్ షూటర్ కు బాబు కీలక బాధ్యతలు

కొంచెం క‌ష్టప‌డితే.. చాలు.. భారీ భ‌విష్యత్తు రాజ‌కీయాల్లో నేత‌ల‌కు సొంత మ‌వుతుంద‌నే విష‌యం తెలిసిందే. అది అధికార పార్టీలో అయినా.. ప్రస్తుత ప్రతిప‌క్షం టీడీపీలో అయినా.. ఒక్కటే. [more]

Update: 2020-08-28 06:30 GMT

కొంచెం క‌ష్టప‌డితే.. చాలు.. భారీ భ‌విష్యత్తు రాజ‌కీయాల్లో నేత‌ల‌కు సొంత మ‌వుతుంద‌నే విష‌యం తెలిసిందే. అది అధికార పార్టీలో అయినా.. ప్రస్తుత ప్రతిప‌క్షం టీడీపీలో అయినా.. ఒక్కటే. ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో క‌ష్టప‌డే నేత‌ల‌కు చంద్రబాబు మంచి గుర్తింపు ఇవ్వాల‌ని నిర్ణయించారు. పార్టీ ప‌రిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగోలేదు. ఈ నేప‌థ్యంలో పార్టీని గాడిలో పెట్టాల‌ని భావించిన చంద్రబాబు.. కీల‌క‌మైన నాయ‌కులు, ట్రబుల్ షూట‌ర్లుగా గుర్తింపు తెచ్చుకున్న నాయ‌కులకు కీల‌క బాధ్యత‌లు అప్పగించాల‌ని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులుకు జిల్లాలో ఓ కీల‌క ప‌ద‌విని క‌ట్టబెట్టే ఆలోచ‌న‌లో ఉన్నట్టు అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

వ్యూహకర్తగా పేరు….

ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో విజ‌యం సాధించిన గ‌న్ని వీరాంజ‌నేయులు పార్టీ కోసం క‌ష్టించి ప‌నిచేసే నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీలో వ్యూహ‌క‌ర్తగా కూడా ఎదిగారు. వివాద ర‌హితుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అధికారంలో ఉండ‌గా ఆయ‌న‌కు అనేక బాధ్యత‌లు అప్పగించారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుకోసం త‌న‌కు అప్పగించిన బాధ్యత‌లు స‌క్సెస్ చేసిన గ‌న్ని వీరాంజ‌నేయులుకి ఆ త‌ర్వాత కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా కొన్ని ప్రాంతాల‌కు ఇన్‌చార్జ్ బాధ్యత‌లు ఇచ్చారు. ఈ క్రతువులో స‌క్సెస్ అయిన గ‌న్ని వీరాంజ‌నేయులు ప‌నితీరు, స‌మ‌న్వయం, వ్యూహాల‌పై చంద్రబాబుకు గురి కుదిరింది.

తెలంగాణ ఎన్నికల సమయంలోనూ….

ఇక‌, 2018లో తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అశ్వారావు పేట నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపిని గెలిపించే బాధ్యత‌ల‌ను చంద్రబాబు గ‌న్ని వీరాంజ‌నేయులుకే అప్పగించారు. ఈ విష‌యంలోనూ ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ గెలిచిన రెండు సీట్లలో అశ్వారావుపేట ఒక‌టి. ఇక గ‌త ఎన్నిక‌ల్లో గ‌న్ని ఉంగుటూరులో ఓడినా కేడ‌ర్‌కు ప్రతి నిత్యం అందుబాటులో ఉండ‌డంతో పాటు త‌న వ‌ర్గంపై అధికార ప‌క్షం ఎన్ని కేసులు పెడుతున్నా… ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఇక‌, పోల‌వ‌రం నియ‌జ‌క‌వ‌ర్గంలో పార్టీలో వెల్లువెత్తిన అసంతృప్తుల‌ను త‌గ్గించే బాధ్యత‌ల‌ను, పార్టీని చ‌క్కదిద్దే బాధ్యత‌ల‌ను కూడా చంద్రబాబు గ‌న్ని వీరాంజ‌నేయులుకే అప్పగించారు. దీంతో ఆయ‌న రంగంలోకి దిగి వాటినికూడా చ‌క్కదిద్దారు. పోల‌వ‌రంలో గ‌న్ని వీరాంజ‌నేయులు ఎంట్రీతో అక్కడ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బొర‌గం శ్రీనివాస్‌కు కేడ‌ర్ స‌మ‌న్వయంతో దూసుకుపోతున్నారు.

కీలకమైన బాధ్యతలను…..

ఇక అస్తవ్యస్తంగా ఉన్న మ‌రో రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడిలోనూ పార్టీలో లుకలుక‌ల‌ను స‌రిదిద్దే బాధ్యత‌ను గ‌న్ని వీరాంజ‌నేయులుకే అప్పగించారు చంద్రబాబు. చింత‌ల‌పూడిలోనూ పార్టీ నేత‌ల మ‌ధ్య ఉన్న బేధాభిప్రాయాల‌ను స‌రిచేసేందుకు గ‌న్ని వీరాంజ‌నేయులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఇలా అన్ని విష‌యాల్లోనూ ట్రబుల్ షూట‌ర్‌గా ఉన్న గ‌న్నికి ఇప్పుడు కీల‌క‌మైన బాధ్యత అప్పగించాల‌ని చంద్రబాబు నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. త్వర‌లోనే ఏలూరు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం పార్టీ అధ్యక్ష బాధ్యత‌ల‌ను గ‌న్ని వీరాంజ‌నేయులుకి అప్పగించాల‌ని భావిస్తున్నార‌ని తెలిసింది.

ఆయనైతేనే బెటరని….

ఏపీలో కొత్త జిల్లాల విభ‌జ‌న ప్రక్రియ ఊపందుకుంది. అధికార వైసీపీ ఇప్పటికే పార్ల‌మెంట‌రీ జిల్లాల వారీగానే పార్టీ క‌మిటీలు వేస్తోంది. టీడీపీ సైతం ఇప్పుడు పార్లమెంట‌రీ జిల్లాల వారీగానే క‌మిటీలు వేసే ఆలోచ‌న‌లో ఉంది. ఈ క్రమంలోనే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉన్న మూడు పార్లమెంట‌రీ జిల్లాల్లో ఏలూరు క‌మ్మ, న‌ర‌సాపురం కాపు, రాజ‌మండ్రిని బీసీల‌కు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉంది. ఏలూరు పార్లమెంట‌రీ జిల్లా నుంచి పార్టీ అధ్యక్షుడిగా వివాద ర‌హితంగా అంద‌రిని క‌లుపుకు పోయే మ‌న‌స్తత్వం ఉన్న గ‌న్ని వీరాంజ‌నేయులు అయితేనే బెట‌ర్ అని బాబు భావిస్తున్నార‌ట‌.

Tags:    

Similar News