ఆయన తప్ప టీడీపీని ఎవరూ ఆదుకోలేరట
చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల అనుభవంతో టీడీపీని ఎలాగో లాక్కొస్తున్నారు. ఓడిపోయి మూడు నెలలు తిరగకముందే జోరు పెంచారు. తాను స్ట్రాంగ్ అని పార్టీని ఒంటి చేత్తో మరో పదేళ్ల [more]
చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల అనుభవంతో టీడీపీని ఎలాగో లాక్కొస్తున్నారు. ఓడిపోయి మూడు నెలలు తిరగకముందే జోరు పెంచారు. తాను స్ట్రాంగ్ అని పార్టీని ఒంటి చేత్తో మరో పదేళ్ల [more]
చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల అనుభవంతో టీడీపీని ఎలాగో లాక్కొస్తున్నారు. ఓడిపోయి మూడు నెలలు తిరగకముందే జోరు పెంచారు. తాను స్ట్రాంగ్ అని పార్టీని ఒంటి చేత్తో మరో పదేళ్ల వరకూ సునాయాసంగా నడిపించగలనని ఓ వైపు చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు. తన తరువాత కుమారుడు లోకేష్ కూడా ఉన్నారని చంద్రబాబు అంటున్నారు. మరి టీడీపీకి నారా వంశం చక్కనైన నాయకత్వం ఇస్తుందని చంద్రబాబు గట్టి భరోసా ఇస్తూంటే బయట మాత్రం టీడీపీ దైన్య స్థితిని బయటపెట్టేలా చర్చోపచర్చలు జరగడం విశేషం. అటు సినిమా తారల నుంచి ఇటు రాజకీయ నాయకుల వరకూ టీడీపీ ఉంటుందా వూడుతుందా అన్న చర్చలే చేస్తూ వస్తున్నారు. మరి దీని పరమార్ధం ఏంటి. చంద్రబాబు ఉండగానే టీడీపీ నావ మునిగిపోతుందని చెప్పడమేనా..
జూనియర్ రావాలంట…..
ఈ మాటలు అన్నది సీనియర్ సినీ నటుడు గిరిబాబు. ఆయన ఎన్టీయార్ కాలం నుంచి సినిమాల్లో ఉన్నారు. ఆయనే చెప్పుకున్నట్లుగా ఎన్టీయార్ పిలుపు మేరకు టీడీపీలో చేరారు కూడా. ఇక ఎన్టీయార్ని ఆయన కుటుంబమే ముఖ్యమంత్రి పదవి నుంచి దించేస్తే వ్యతిరేకించి దూరంగా ఉంటున్నట్లుగా చెప్పుకున్నారు. గిరిబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్శ్ చూస్తే ఇపుడున్న స్థితిలో టీడీపీని ఎవరూ లేపలేరట. ఆ పార్టీ దారుణంగా చితికిపోయిందంట. చంద్రబాబు నాయకత్వంలో ఉంటే టీడీపీ మళ్లీ ఎదగదని కూడా గిరిబాబు చెప్పేస్తున్నారు. జూనియర్ ఎన్టీయార్ రంగప్రవేశం చేస్తే టీడీపీకి బతుకు వెలుగు ఉంటాయని ఆయన అంటున్నారు. ఓ విధంగా చంద్రబాబు ఆయన కుమారుడు టీడీపీని మళ్ళీ అధికారంలోకి తేలేరని స్పష్టంగా గిరిబాబు చెప్పేశారన్న మాట.
చంద్రబాబు మీద పడిన జేసీ….
ఇక నిన్నటి వరకూ చంద్రబాబుని విజన్ ఉన్న నాయకుడు అంటూ పొగిడిన మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఇపుడు చంద్రబాబు వల్లనే టీడీపీ ఓడిపోయిందని అంటున్నారు ఏపీలో బీజేపీకి బలం సమకూరితే అది చంద్రబాబు విధానాల వల్ల తప్ప మరోటి కాదని కూడా అనేశారు. టీడీపీ ఇపుడు ఇబ్బందులో ఉందని కూడా చెప్పిన జేసీ జూనియర్ ఎన్టీయార్ వస్తే ఆయనకు సిన్మా గ్లామర్ ఉందని పార్టీకి బాగానే ఉంటుందని అనేశారు.
కొత్త రూపు రావాలంటే….
అంటే చంద్రబాబు వల్ల టీడీపీకి కొత్త రూపు రాదని చెప్పేసినట్లేమరి. ఇక రాజకీయ వర్గాల్లో కూడా ఓ అభిప్రాయం ఉంది. చంద్రబాబు ఉంటే ఆ పార్టీకి మళ్లీ జనాదరణ కష్టమని. ఇక జగన్ సైతం చంద్రబాబు టీడీపీకి నాయకుడిగా ఉండడమే తనకు బలమని భావిస్తున్నారు. ఆయన ఆ పార్టీకి ఎన్నాళ్లు ప్రెసిడెంట్ గా ఉంటే అన్ని సార్లు తాను ఎన్నికల్లో గెలవగలను అని అనుకుంటున్నారు. అంటే జూనియర్ వస్తే ఇబ్బందేనని వైసీపీలోనూ కొంత చర్చ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద గిరిబాబు లాంటి వారు అన్నట్లు జనమే పదవులు ఇస్తారు, పార్టీ పగ్గాలను ఇస్తారట. ఆ పగ్గాలు జూనియర్ అందుకునే రోజు దగ్గర్లో ఉందా మరి.