వాళ్లు దగ్గరయితేనే.. సీఎం దర్జా దక్కుతుందట
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రెండే పార్టీలకు అధికారం దక్కుతుంది. ఒకటి వైసీపీ. రెండు టీడీపీ. మరొకరికి అధికారం దక్కే అవకాశం వచ్చే ఎన్నికలకు మాత్రం [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రెండే పార్టీలకు అధికారం దక్కుతుంది. ఒకటి వైసీపీ. రెండు టీడీపీ. మరొకరికి అధికారం దక్కే అవకాశం వచ్చే ఎన్నికలకు మాత్రం [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రెండే పార్టీలకు అధికారం దక్కుతుంది. ఒకటి వైసీపీ. రెండు టీడీపీ. మరొకరికి అధికారం దక్కే అవకాశం వచ్చే ఎన్నికలకు మాత్రం లేదు. పోటీ వైసీపీ, టీడీపీ మధ్యనే ఉండనుంది. అయితే పొత్తులతో వెళతారా? లేక ఒంటరిగా వెళతారా? అన్నది పక్కనపెడితే చంద్రబాబు మాత్రం తనను వదలి వెళ్లిన వర్గాలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.
రైతులు, నిరుద్యోగులు…
ప్రధానంగా ఏపీలో రైతులు, యువత గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. రైతు రుణమాఫీని చంద్రబాబు ఏకకాలంలో అమలు చేయకపోవడంతో ఆ వర్గమంతా గత ఎన్నికల్లో వ్యతిరేకమయింది. ఎన్నికల్లో రైతురుణ మాఫీని చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా అని మెలికపెట్టారు. అది కూడా వడ్డీలకే సరిపోవడంతో రైతులు చంద్రబాబుపై ఆగ్రహంతో ఉండి ఎన్నికల నాటికి కటీఫ్ చెప్పేశారు.
దగ్గరకు చేర్చుకోవడం కోసం….
ఇక నిరుద్యోగులు కూడా బాబు వస్తే జాబు వస్తుందని 2014 ఎన్నికల ప్రచారం లో ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అమరావతిని, పోలవరాన్ని బట్టి ఊగులాడటంతో యువత కూడా జగన్ వైపు 2019 ఎన్నికల్లో మొగ్గు చూపింది. దీంతో ప్రధాన వర్గాలైన రైతులు, యువత దూరమవ్వడంతో చంద్రబాబు గత ఎన్నికలలో దారుణ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
దగ్గరయితేనే…
దీంతో వచ్చే ఎన్నికలలో ఈ రెండు వర్గాలను మంచి చేసుకునే ప్రయత్నంలో పడ్డారు చంద్రబాబు. జాబ్ క్యాలండర్ కొత్తది ప్రకటించాలంటూ నిరసనలకు దిగారు. ఇక రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించలేదంటూ నియోజకవర్గాల్లో రైతులతో ర్యాలీలు చేయిస్తున్నారు. తాను రైతు పక్షపాతినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్నికల సమయానికి ఈ రెండు వర్గాలను ఆకట్టుకోగలిగితే చంద్రబాబు నాలుగోసారి ఛాన్స్ వచ్చినట్లేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ జగన్ అమలు చేస్తున్న సంక్షేమపథకాలతో ఈ రెండు వర్గాలు చంద్రబాబు దరి చేరడం అంత సులువు కాదు.