తమ్మూళ్లూ… వస్తున్నా….!!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇక జిల్లాల బాట పట్టనున్నారు. చంద్రబాబు తొలుత వైసీపీ ప్రభుత్వానికి తొలుత ఏడాది సమయం ఇద్దామని నేతలకు చెప్పుకొచ్చారు. [more]

Update: 2019-09-01 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇక జిల్లాల బాట పట్టనున్నారు. చంద్రబాబు తొలుత వైసీపీ ప్రభుత్వానికి తొలుత ఏడాది సమయం ఇద్దామని నేతలకు చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, పార్టీ నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులు చంద్రబాబును ఆందోళనలోకి నెట్టాయి. ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు ఇల్లు వదిలి బయటకు రావడం లేదు.

జిల్లాల పర్యటనకు…..

దీంతో చంద్రబాబునాయుడు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. జిల్లాల్లో పర్యటించి క్యాడర్ లో ధైర్యం నింపాలన్న యోచలనలో చంద్రబాబు ఉన్నారు. దీంతో పాటుగా తాను జిల్లాల పర్యటనకు వెళితే నేతలు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్నది చంద్రబాబు అంచనా. అందుకే ఆయన జిల్లాల బాట పట్టనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనే పర్యటించారు. కార్కకర్తల మీద జరిగిన దాడులను నిరసిస్తూ ఆయన తన పర్యటనలో వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

నేతలపై కేసు…..

ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవుతున్నాయి. కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్, కరణం బలరామకృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలపై ఇప్పటికే కేసులు నమోదయి ఉన్నాయి. కోడెల శివప్రసాద్ సంగతి సరేసరి. యరపతినేని శ్రీనివారావుపై సీబీఐ కత్తి వేలాడుతుంది. దీంతో చంద్రబాబు మిగిలిన నేతల్లో ధైర్యం నింపేందుకు జిల్లాలను పర్యటించాలని నిర్ణయించారు.

క్యాడర్ లో ధైర్యం నింపేందుకు…..

ప్రతి వారంలో రెండు రోజుల పాటు ఒక జిల్లాను పర్యటించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా తొలి జిల్లా పర్యటనను తూర్పు గోదావరిని ఎంచుకున్నారు. ఇక్కడ పార్టీ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ చంద్రబాబు పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల టీడీపీ పిలుపునిచ్చిన అన్నాక్యాంటిన్లు, ఇసుక కొరత ఆందోళనల్లో పెద్దగా క్యాడర్ పాల్గొనకపోవడానికి కేసుల భయమేనని తెలుసుకున్న చంద్రబాబు వారిలో ధైర్యం నింపేందుకు జిల్లాల పర్యటనను ఎంచుకున్నారు.

Tags:    

Similar News