జగన్ పై జనంలో అంత వ్యతిరేకత ఉందా?
చంద్రబాబు భ్రమల్లో ఉన్నారా. తాను చెప్పినదంతా జనాలు నమ్మేస్తున్నారని అనుకుంటున్నారా. ప్రజలకు వైసీపీ సర్కార్ మీద పూర్తి వ్యతిరేకత ఉందా. చంద్రబాబుని అధికారంలో నుంచి దించేసి పెద్ద [more]
చంద్రబాబు భ్రమల్లో ఉన్నారా. తాను చెప్పినదంతా జనాలు నమ్మేస్తున్నారని అనుకుంటున్నారా. ప్రజలకు వైసీపీ సర్కార్ మీద పూర్తి వ్యతిరేకత ఉందా. చంద్రబాబుని అధికారంలో నుంచి దించేసి పెద్ద [more]
చంద్రబాబు భ్రమల్లో ఉన్నారా. తాను చెప్పినదంతా జనాలు నమ్మేస్తున్నారని అనుకుంటున్నారా. ప్రజలకు వైసీపీ సర్కార్ మీద పూర్తి వ్యతిరేకత ఉందా. చంద్రబాబుని అధికారంలో నుంచి దించేసి పెద్ద తప్పు చేశామని ఏపీ జనం అనుకుంటున్నారా. ఇవన్నీ చంద్రబాబుకు ఉన్న ఆలోచనలు. జగన్ ని అనవసరంగా ఎన్నుకున్నామని జనం భావిస్తున్నారని చంద్రబాబు భ్రమిస్తున్నారు. అందుకే ఆయన నోటి వెంట జగన్ మీద అంత పరుషమైన మాటలు వస్తున్నాయి. జనంలో తేల్చుకుందాం రండి అంటున్నారు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు తెలియదా జనాలకు అయిదేళ్ళకు ఒకే ఒకసారి అవకాశం వస్తుందని, అపుడే వారి ఏలికల తలరాత మారుస్తారని, జగన్ గద్దెనెక్కి ఏడాదే కదా అయింది. ఇంతలో అంత తొందర చంద్రబాబుకు ఉండొచ్చు కానీ జనాలకు ఏం పట్టింది.
ఏంటి తేల్చేది ….
మనకు రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. అవి వాటి పని చేస్తాయి. తప్పు చేస్తే పోలీసులు, ఏసీబీ, సీబీఐ లాటి సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తాయి. అంతే తప్ప జనంలోకి సవాళ్ళు చేసుకుంటూ రాజకీయ పార్టీలు వస్తే వారిని కూర్చోబెట్టి పంచాయతీ తీర్పులు ఇవ్వడం జనం పని కాదు, కానీ చంద్రబాబు మాత్రం సవాల్ విసురుతున్నారు. మీ అవినీతి మా అవినీతి జనంలో తేల్చుకుందా మంటున్నారు. అది తేల్చే కదా జనం వైసీపీకి పట్టం కట్టింది. మరో నాలుగేళ్ళలో ఎటూ ఎన్నికలు వుంటాయి. అంతవరకూ బాబు ఓపికగా ఉంటే బెటర్ అంటున్నారు.
లోకల్ ఫైట్లోనే…..
ఇక అప్పటివరకూ చంద్రబాబు ఆగలేకపోతే లోకల్ బాడీ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బాబు కోరినట్లుగా బ్యాలెట్ పేపర్లోనే జరుగుతాయి. టీడీపీకి మెజారిటీ సీట్లు సాధించి వైసీపీకి జనంలో బలం లేదు అని ఆ ఎనికల్లో బాబు నిరూపించవచ్చు. అంతే కాదు, వైసీపీ మీద జనంలో మోజు తగ్గింది అంటూ ఏపీ అంతా తిరిగి మరీ ప్రచారం కూడా చేయవచ్చు. అంతే తప్ప చంద్రబాబు భ్రమల్లో ఉంటూ ఏపీలో జగన్ కి అసలు ఏమీ లేదని అనుకొవడం వల్ల నష్టం ఆయన పార్టీకే అంటున్నారు.
హిప్నటైజ్ అవుతున్నారా..?
రాజకీయ నాయకుడుకి తొంభై తొమ్మిది మంచి మాటలు చెవుల్లో పడినా కూడా నూరవ మాట చెడ్డదైతే దానివైపే సీరియస్ గా చూడాలి. ఎందుకంటే ఏ నాయకుడు ముందు కూడా పార్టీ నాయకులు నిజాలు చెప్పరు కాబట్టి, ఇపుడు టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. చంద్రబాబును మోసే అనుకూల పత్రికలు బోలెడు ఉన్నాయి. మరో వైపు టీడీపీలో చంద్రకీర్తనలకు ఎక్కడా కొదవ లేదు. ఈ నేపధ్యంలో చంద్రబాబు కూడా హిప్నటైజ్ అయిపోతున్నారు. జగన్ కి ఏమీ బలం లేదు, జనంలో వ్యతిరేకత ఉంది అని తమ్ముళ్ళు అంటే అదే నిజమని భ్రమిస్తున్నారు. మళ్ళీ వచ్చేది తానేనని అతి ధీమాతో ఉన్నారు. దీంతో విపక్షంగా తాను చేయాల్సిన పని చేయడం మానేస్తున్నారు. ఈ కారణంగానే ప్రజలలో చులకన అవుతున్నారని అంటున్నారు. మరి చంద్రబాబు ఇకనైనా భ్రమల్లో నుంచి బయటకు వస్తారా.? లేదా? అనేది చూడాలి.