చప్పట్లోయ్.. దీపాలోయ్.. మోడీ వద్దకు వెళ్లాలోయ్
టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాంటి పరిస్థితిని తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కొనలేదు. చంద్రబాబు పార్టీలో ఎన్నో సంక్షోభాలను చూశారు. కానీ ఇప్పుడున్నంత సంక్షోభం [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాంటి పరిస్థితిని తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కొనలేదు. చంద్రబాబు పార్టీలో ఎన్నో సంక్షోభాలను చూశారు. కానీ ఇప్పుడున్నంత సంక్షోభం [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాంటి పరిస్థితిని తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కొనలేదు. చంద్రబాబు పార్టీలో ఎన్నో సంక్షోభాలను చూశారు. కానీ ఇప్పుడున్నంత సంక్షోభం ఎన్నడూ లేదు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. తెలంగాణలో టీడీపీ పూర్తిగా లేనట్లే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్యాడర్ ను నిలుపుకోవాలంటే వారిలో ధైర్యాన్ని నూరిపోయాలి. ఉత్తేజాన్ని నింపాలి. ఇప్పటికే 70కు చేరువలో ఉన్న చంద్రబాబు కిందా మీదా పడుతూ పార్టీని నెట్టుకొస్తున్నారు.
ఫేస్ బుక్ రిప్లైస్ చూస్తే…..
చంద్రబాబు నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో చంద్రబాబు, లోకేష్, మనవడు దేవాన్ష్ లతో కలసి దీపాలను వెలిగించారు. ఈ ఫొటోను చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆయనకు టీడీపీ అభిమానులే సలహాలు ఇస్తుండటం రిప్లైలలో కన్పిస్తుంది. లోకేష్ నాయకత్వం పార్టీకి పనికి రాదని, భవిష్యత్తులో పార్టీ ఉండాలంటే రామ్మోహన్ నాయుడు వంటి వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పలువురు సూచించారు. కొందరైతే మీరు ప్రధానమంత్రి అవుతారని ప్రశంసలు కూడా చేశారనుకోండి. లోకేష్ ను నాయకుడిగా పార్టీ క్యాడర్ ఒప్పుకోవడం లేదనడానికి ఆయన ఫేస్ బుక్ లో వచ్చిన రిప్లైలే నిదర్శనమని చెప్పక తప్పదు.
గత కొన్ని రోజులుగా…..
ఇక చంద్రబాబు మోదీ చేసిన ప్రతి పనినీ అనుసరించడాన్ని కూడా కొందరు తప్పుపట్టారు. ప్రధానంగా ఒకవర్గానికి చెందిన వారు ఇప్పటి వరకూ మీ అభిమానులమని, దీపాలు వెలిగించడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని కామెంట్స్ పెట్టారు. నిజమే ఇటీవల చంద్రబాబు మోదీపై ప్రశసంలు కురిపిస్తున్నారు. మోదీ ఏది చెప్పినా శభాష్ అంటున్నారు. మోదీ లాంటి నాయకుడు దేశానికి అవసరమని పొగుడుతున్నారు. మోదీ చప్పట్లు కొట్టమంటే కొట్టారు. దీపాలు వెలిగించమంటే వెలిగించారు.
హస్తిన పిలుపుకోసం…..
ఇవన్నీ కేవలం మోదీని మంచి చేసుకోవడానికేనన్న కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి. పార్టీ ఓటమి తర్వాత ఆర్థికంగా పార్టీ ఇబ్బంది పడుతోంది. టీడీపీ నేతలు కూడా ఆర్థికంగా చితికిపోయారు. జగన్ నాలుగేళ్లలో పార్టీని నాకేసేటట్లు కన్పిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మోదీ రక్షణ తనకు అవసరమని భావించిన చంద్రబాబు ఆయనతో సఖ్యత పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోనూ బలమైన లాబీయింగ్ జరుగుతోంది. మరి మోదీ ఎప్పుడు కరుణిస్తారో? చంద్రబాబు కు హస్తిన నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో?నని నేతల నుంచి అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి చూద్దాం…దీపాలతోనైనా దశ తిరుతుందేమో?